వినమరుగైన

శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తి రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీటికిష్టపడితే, మా అబ్బాయి మీ అమ్మాయిని కూడా చూడనక్కరలేదు. ముహూర్తాలే పెట్టుకోవచ్చు’’.
‘‘అంతకన్నానా! ఒక్క నిమిషం మా ఆడవాళ్లతో సంప్రతించి మళ్లీ ఫోన్ చేస్తాను’’. అవతలి నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దం. ఆనందంగా విషయమంతా వసంతమ్మ దగ్గరకొచ్చి చెప్పారు రత్నంగారు. ఆమె ఒక్కసారిగా ఉరిమి చూసింది.
‘‘మీకేమన్నా మతిపోయిందా? ఎంత ఆడపిల్లలను కన్నవాళ్ళమైనా, ఏమాత్రం ఆత్మాభిమానం లేనివాళ్ళమనా వీళ్ళ ఉద్దేశ్యం. పెళ్ళంటే ఒక అమ్మారుూ, అబ్బారుూ మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకొని, సంసారం చేయడానికి ఏర్పాటుచేసిన ఓ పవిత్ర కల్యాణవేదిక. అంతేగానీ, వాళ్ళను బానిసలుగా చేసుకొని, జీవితాంతం వాళ్ళవెనకాలే పడి నసపెడుతూ, ఆనందించడం కోసం చేసే జంతు బలి కాదు. ఇవాళ్టికి చాలుగాని పదండి భోజనానికి’’ అంటూ హితోపదేశం చేసింది వసంతమ్మ. ఉసూరుమంటూ డైనింగ్ టేబుల్ చేరారు రత్నంగారు.
***
ఆ మర్నాడే వివాహ సంబంధాలు చెప్పే సాంబశివరావుగారి ఆఫీసుకు వెళ్ళారు. వెళ్తూనే తను ఫోన్లో ఆయన చెప్పినవి కనుక్కున్న విషయాలు చెప్పారు?
‘‘అరే! అలాగా! ఏమిటోనండీ! మాకొచ్చిన సమాచారం మాత్రమే మీకందివ్వగలం కానీ, అన్ని వివరాలలు మా దగ్గరుండవ్. ఇవిగో చూసుకోండి. మిగతా ఊళ్ళనుంచి వచ్చిన వివాహ సంబందాల సమాచార పత్రికలు. హడావిడి పడకుండా నిదానంగా చూసుకొని రాసుకోండి. అన్నట్లు మరిచాను, చాలా రోజులైంది. మరో ఐదు వందలు సమర్పించుకొని మరీ చూసుకోండి. మీ గురించి అప్పుడప్పుడూ ఆటోల్లో కూడా వెళ్లి విచారించి వస్తుంటాం కదండీ అందుకని. ఇలా అడిగానని అనుకోండి. ఇప్పుడే ఇవ్వకపోనా ఫర్వాలేదు. ముందు రాసుకోండి. తర్వాత పంపించండి. ఈవేళ మీరు రాసుకొనే వాటిలో తప్పకుండా కుదిరే అవకాశం వుంది. ఎందుకంటే ఇవన్నీ చాలా లేటెస్టు లిస్టులు’’ అని ఆపి ఆ పత్రికలన్నీ రత్నంగారి చేతికిచ్చారు సాంబశివరావుగారు.
‘‘ముందీ అయిదువందలూ తీసుకోండి’’ అంటూ అయిదు వందల కాగితాన్ని సాంబశివరావుగారికి సమర్పించుకున్నారు. ఎప్పుడైనా ఇవ్వాల్సిందిగా అనుకొంటూ రత్నంగారు, ఆ తరువాత ఊసురోమంటూ ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఆ పత్రికల పరిశీలనలో పడ్డారు. ఇలాంటివాళ్ళే మరికొందరు కూడా సంబంధాలు వెతుక్కుంటూ ఏవో కొన్ని గుర్తుపెట్టుకొని రాసుకుంటున్నారు. పిహెచ్‌డి చేసేవాళ్ళు లైబ్రరీకెళ్లి ప్రముఖ గ్రంథాలు చదివి, అందులోని విషయాల్ని రాసుకుంటున్నవారిలా, ఆనాటికి చాలనుకొని ఓ గంట తరువాత ఇంటికి చేరారు రత్నంగారు.
***
‘‘డాడీ! డాడీ! ఎవరో వచ్చారు’’అంటూ కూతురు అరుణ పిలవడంతో వెంటనే వరండాలోకొచ్చారు వాసుదేవరత్నంగారు.
‘‘ఓ మీరా!’’ అన్నారు వచ్చిన వ్యక్తిని కూర్చోమని సైగ చేస్తూ.
‘‘మీకో రత్నం లాంటి సంబంధం తెచ్చానండీ’’ అన్నాడాయన.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339