వినమరుగైన

ప్రతాపరుద్రీయము - వేదము వేంకటరాయశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క థా పరిష్కార ఘట్టంలో
సెట్టియొకడు నేను చెకుముకి శాస్ర్తీయు
కాలరుద్రు మూడు కనుల భంగి
మేము ముమ్వురమును మేల్కొని యుందుము
ప్రభువు విశ్రమంబు బడయుగాక’’
అనడం యుగంధరుని వంటి నిరంతర జాగ్రన్మూర్తికి సహజం.
సేనాని విశ్వాసరావు అన్నట్టు
ఆయన గాలిని బేనును తోయముతో నఱకు బొగలతో గోడలిడున్
ఆయన ప్రయోగ మభినవ తోయజ భవ సృష్టి పెఱది దుస్స్వప్నమగున్’’
ఇంతటి మేధకి మరెంతటి శౌర్యం మేళవించిందో సుల్తాన్ సేనాని వలీఖాన్ అంటాడు.
‘‘రుద్రయుగంధర్ ముద్రపెట్టితే నిద్రపోదు హాథీ
బాలయుగంధర్ లీల పల్కితే పేలదుర తపాకీ
సూరయుగంధర్ బీరము వింటి పారదుర ఫిరంగీ
ప్రతాపరుద్రుడు శుభ పర్యవసాన వేళ తీర్చలేని కృతజ్ఞతాభారనఁముడై పాదాలంటి ‘తైలింగ రాజ్య సింహాసన సంస్థాపక- ఢిల్లీ సురత్రాణ బందీగ్రాహ- అనే ప్రశస్తితోడి హారం బహూకరించాడు. ఒక్క మాటతో ప్రతాపరుద్రీయ నాటకానికి జీవనాడి హృదయ స్థానం యుగంధర పాత్ర.
సారా చెంబు తాడు బాధంతా అనుభవించి ‘‘పేరయ్య రాజంట పేరెల్లి రాణంట తనకి మామావాళ్లు దండమెడ్తారంట’’ అంటూ రూపసామ్యం చేత ఆపద్ధర్మ రాజరికం నెఱపి మాట మాటకి హర్షాన్ని, పాటపాటకీ ఆమోదాన్ని పండించి చివరకి ఓ సీమకి దొరతనం దక్కించుకొన్న పేరసయ్య జనప్రియుడు. చెకుముకి చమత్కారాలు, విద్యనాధుని వైదుష్యం, జనార్దనమంత్రి నిర్వహణ, వలీ ఖస్రూఖానుల కుతంత్రం వంటి అంశాలన్నీ దేనికదే రసవంతము.
వేదంవారు పాత్రోచిత భాష, పద్య రచనా శైలి చక్కగా ప్రయోగించారు. ప్రతాపరుద్ర విజయోత్సవ దిదృక్షాగతులైన విద్యాధరులు:
‘‘దండితవైరి వీరుని ప్రతాపనరేంద్రుని ముల్లెమూటగా
గొండని దైవమే తురక కూళల కీఁగను గొన్నమింటికిన్
గుండియవ్రీల నెత్తురుగల గుజ్జగు కండలు రెండునుం బలే
చంఢగా భస్తి మండలము శైవలినీ కలితార్క బింబమున్’’ అనడములోను, బంధితుడైన రాజు
‘‘కూలి నాలి చేసి కుములు పేద సుఖంబు
దక్కదిలను మకుటధారికెపుడు’’
అనుకోవడంలోనూ,
‘‘గోదారి తల్లికీ గొజ్జలగిపూదండ
సరపోతికీ సన్నజాజిదండ
కిష్ణాయేణమ్మకీ గేదంగీ పూదండ
కాయేరికీ చంద్రకాంతిదండ’’
అనటంలోనూ ఎంతో శైలి వైవిధ్యం భాసిస్తుంది.
ప్రతాపరుద్రీయంలో వీరరసము అంగి, హాస్యము అంగము, ప్రతాపరుద్రుడు నాయకుడు, యుగంధరాదులు ఉపనాయకులు. ప్రాచీన, నవీన నాటక లక్షణాలకి సమన్వయం కల్పించిన ప్రతాపరుద్రీయ నాటకం సాహిత్య పీఠంపైనా, సహృదయ పీఠంపైనా చిరంజీవము. కర్త ‘‘జంకు కళంకు లేని కవిచంద్రుడు తోషిత కోవిదేంద్రుడా వేంకటరాయశాస్ర్తీ’’.
-అయపోయంది

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ధరా రామనాథశాస్ర్తీ