వినమరుగైన

కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్నిహితమైన ప్రతి ఒక్కరినీ సంస్కరించాలనుకున్న మధరవాణి వారెవరూ మారలేదు గాని తనకి తానుగా మంచికి మారిందనీ విశాఖ దృశ్యాల్లో సూచితమైంది. పీక్కి ఉరిపడినందువల్ల లుబ్ధావధాన్లు పశ్చాత్తాపపడి కొద్దిగానైనా మంచికి మారడుగాని అవధాన్లు కన్నా ఏడాకులు ఎక్కువ చదివిన అతని తమ్ముడు గిరీశం మాత్రం మారే స్వభావం కలవాడు కాదు గాక కాదని హెడ్‌తో దొంగ సాక్ష్యాలు కట్టే దృశ్యంలో గిరీశం చూపించిన విశ్వరూపమే నిరూపించింది.
గిరీశం క్రూరమృగం మొఖాన్ని తళుక్కున మురిపించి విశాఖ లుబ్ధావధాన్ల విడిది దృశ్యం తెరపడుతుంది. గంగిగోవు ముఖాన్ని కప్పుకున్న గిరీశంతో చివరి దృశ్యం మొదలవుతుంది. ఈ దృశ్యంలో ప్రతీకలైన పాత్రలు ఏకకాలంలో కథాగతిని, చరిత్ర గతిని సూచిస్తూ ప్రవర్తిస్తాయి.
జీవితం అనే నాణానికి రెండు పక్కలున్నాయి. సంస్కరణోద్యమానికి ప్రతీకైనా, గత శిథిల వ్యవస్థ అవశేషాల్నించి బయటపడలేని, సంస్కర్తల మేధోవికాస పరిధిని సూచిస్తున్న సౌన్యారావు బొమ్మయితే, ఆ శిథిల వ్యవస్థకి ప్రతీకలైన లుబ్ధావధాన్లు మరో పక్కన్నది బొరుసు. అలాగే అమ్ముకుని కొనుక్కొనే అన్ని వ్యవస్థల అనుభవాలతో రాటుదేలిన స్ర్తి వర్గానికి, సమాజానికి వెరసి పాలితుల్లో అనివార్యంగా పెరుగుతున్న ప్రజాస్వామ్య చైతన్యానికి ప్రతీకగా నిల్చిన మధురవాణి బొమ్మయితే, లోకం తెలీనివారందరికీ ప్రతీకైన బుచ్చెమ్మ బొరుసు. పరమార్థాన్ని ప్రదర్శిస్తూ స్వార్థానికి ప్రాధాన్యమిచ్చే పాత కొత్త పాలకవర్గ - న్యూ రిచ్ - విత్తనదశకి ప్రతీకైన గిరీశం బొమ్మయితే కోర్టుల్లోనే కథ అడ్డంగా తిరుగుతున్న పాత పాలక వర్గ లౌక్యానికి ప్రతినిధి రామప్ప పంతులు బొరుసు.
కంటిముందు కదలుతున్న బొమ్మల వెనక కనబడని బొరుసుల జీవితం గురించే చివరి దృశ్యంలో చర్చ జరుగుతుంది. చివరికి పాలితుల్లో జీవించే హక్కుని కోల్పోతున్న వేశ్యల గురించి సౌజన్యరావుని ప్రశ్నించిన మధురవాణి, అప్పటికి సంస్కర్తల్లో పూర్తిగా కనిపించని ప్రజాస్వామిక దృక్పథానికి తానే ప్రతీకనని రుజువు చేసుకుంది.
ఈ మధురవాణి మెట్టుమీద మధ్యగా నిలుచుంటే కుడివైపు గిరీశాన్ని బైటకు పొమ్మన్న సౌజన్యరావు, ఎడమవైపు బైటకి వెడుతూ ఆగిన గిరీశం నిలబడినప్పడు దృశ్యం స్క్వీజ్ అయి ఆగుతుంది. ఆగే ముందే గిరీశం డామిట్ కథ అడ్డంగా తిరిగింది అని తన మారని స్వభావాన్ని వాచ్యంగా వ్యక్తం చేశాక నాటకం ముగుస్తుంది.
విస్తరించి వికసించిన ఈ నాటక రచనలో గ్రీకు ట్రయాలజీ లక్షణం వుంది.
ఇది నా మాట కాదు. పరిశోధించిన సాహిత్యవేత్తల్లో కొందరన్నమాట. నా పరిశీలనకి దొరికిన విభజన ఇది.
విజయనగరంలో వుండలేక వూరు విడిచిన గిరీశం మధురవాణులు కృష్ణరాయ పురాగ్రహారం, రామచంద్రాపురాగ్రహారం కోటల్లో పాగా వేయడంలో మొదటి భాగం ముగుస్తుంది. రామప్పపంతులింటికి ఉత్తరంతో వచ్చి లుబ్ధావధాన్లు పరిచయమైన దగ్గర్నుంచి దాసరి తత్త్వం పాడి రామప్ప పంతుల్ని చెరువుగట్టుకి తరిమేదాకా మధురవాణి కంటెకథ నడిపినదంతా రెండో భాగమవుతుంది. చెరువుగట్టు సీన్నుంచి అందరి కథలు అడ్డంగా తిరుగుతూ చివరికి గిరీశం కథ కూడా అడ్డంగా తిరగడంతో మూడో భాగం ముగుస్తుంది.
ట్రయాలజీని మూడు రోజులు మూడు భాగాలుగా ప్రదర్శించినా లేక మధురవాణి కేంద్ర బిందువుగా - అంతరార్థ విశదీకరణకి ప్రాణమైన సమాజ వాస్తవికత కనుమరుగవకుండా సంక్షిప్తీకరించి ప్రదర్శించినా ప్రయోక్తలు ముఖ్యంగా ఒక్క విషయాన్ని గుర్తించవలసి వుంటుంది. మంచికి మారిన మధురవాణి, విశాఖ దృశ్యాల సారం మిస్ కాకుండా, మారని గిరీశం, దొంగ సాక్ష్యాలు కట్టే లుబ్ధావధాన్ల విడిది దృశ్యం సారం మిస్ కాకుండా వూరి భయంతో కొద్దిగా మాత్రమే మారిన లుబ్ధావధాన్ల మీద కేంద్రీకరిస్తూ ప్రయోక్త ప్రయోగించాలి. అపుడే చివర్లో పాలితుల్లోనూ అణచివేతకు గురైన స్ర్తి వర్గానికి, సమాజానికి వెరసి అందరికీ కనీస భద్రతగల ప్రజాస్వామ్యానికి కనీస రక్షణ సంరక్షణ ఎక్కడన్న ప్రశ్నార్థకంతో నాటకం ముగుస్తుంది.
అప్పుడే చివరి దృశ్యంలో మధురవాణికి సౌజన్యరావనే సత్పురుషుడు ‘్భగవద్గీత’ని బహూకరించడం అతని పాత్ర స్వభావ పరిమితి స్పష్టమవుతుంది.

-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

--కాకరాల