వినమరుగైన

కీర్తిశేషులు - భమిడిపాటి రాధాకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నాటకం తణుకు, విజయవాడ, నరసాపురం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, బాపట్లలో జరిగిన పరిషత్తుల్లో ఉత్తమ రచనకో, ఉత్తమ నటుడికో, ఉత్తమ ప్రదర్శనకో ప్రథమ ద్వితీయ బహుమతులు వరుసగా అందుకుంది.
అంతేకాకుండా దీన్ని రెండు దశాబ్దాలపాటు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా, ఆంధ్రేతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శించి ప్రశంసింపబడని ప్రముఖ నాటక సమాజం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ నాటకాన్ని ప్రదర్శించి ప్రశంసింపబడిన నట ప్రముఖులు శ్రీ కె.వెంకటేశ్వరరావు, జె.వి.సుమయాజులు, రమణమూర్తి, జి.ఎస్.ఆర్.మూర్తి, సిహెచ్.కృష్ణమూర్తి, కనకాల దేవదాస్, కబీర్‌దాస్, వాసుదేవరావు, సిహెచ్.కృష్ణమూర్తి, కనకాల దేవదాస్, కబీర్‌దాస్, వాసుదేవరావు, సిహెచ్.వాణీబాల మొదలగువాళ్లు ఎందరో ఈ నాటకంలో మురారి పాత్ర ధరించి, ఉత్తమ నటుడు బహుమతి అందుకోవడం, శ్రీ రావుగోపాలరావు సినీరంగ ప్రవేశానికి ఊతం అయింది.
స్వానుభవం 1964లో శ్రీ జె.వి.రమణమూర్తి దర్శకత్వంలో ఈ నాటకం ప్రదర్శించినపుడు నేను కూడా ఓ వేషం వేశాను. నాటకాన్ని చూడటానికి ఆనాటి జిల్లా కలెక్టరు శ్రీ డి.శంకర గురుస్వామి భార్యతో సహా వచ్చారు. వారు కేరళవాసులు అవడం వల్ల తెలుగు సరిగా రాదు. నాటకం రసవత్తరంగా సాగుతోంది. మురారి, తన తల్లి చనిపోయిన సీను, సిట్యుయేషను తమ్ముడు వాణీనాథానికి చెప్తూ ఎలా మర్చిపోగలన్రా ఆ రోజు. ఆవేళ పుట్టిన రోజుగదా అని తలంటుకోమందిరా మనమ్మ. పుట్టిన రోజునాడు తలంటుకుంటే ఆయుష్షు ఎక్కువవుతుందిరా అంటూ,
‘‘ఎంతో బతిమాలిందిరా! కాఫీ యిస్తే పోసుకుంటానన్నాను. ఎంతో ఆనందపడిపోయి, నన్ను ముద్దెట్టుకుని కాఫీ కలపటానికి లోపలికెళ్లింది. కుంపటి మీంచి పాలగినె్న దించుతుంటూ చీరంటుకుందిరా. చీరతోపాటు మనిషీ కాలిపోయిందిరా. ‘మురారీ, మురారీ’ అంది. కాలిపోయిన అమ్మ దగ్గరికి పరుగెత్తుకెళ్లాను. ‘‘ముందు కాఫీ కలుపుకుతాగు నాయనా’’ అని చెప్పి మరీ చచ్చిపోయిందిరా ఆ కన్నతల్లి’’ అని మురారి వేషం వేసిన శ్రీ సోమయాజులు డైలాగు చెప్తుంటే తెలుగు ప్రేక్షక లోకంతోపాటు తెలుగు సరిగా రాని కలెక్టరుగారు, ఆయన సతీమణి వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యం యింకా నాకు కళ్లక్కట్టినట్టుంది. ఇలా చెప్పుకుపోతుంటే ఈ నాటకం గురించి ఎన్నో... ఎనె్నన్నో!’’
టివి దెబ్బకి, రంగస్థలం తాత్కాలికంగా కుంగి పధ్నాలుగు పాత్రలున్న ఈ నాటక ప్రదర్శన కొద్దిగా కష్టమనిపించినా తెలుగ్గడ్డమీద నటుడు మొహానికి రంగు పూసుకున్నంత కాలం కీర్తిశేషులు నాటకం చిరంజీవే. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కీశే పుచ్ఛా భార్గవ రామోజీ