వినమరుగైన

పరిసరాలు.... మనిషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ స్వాతంత్య్ర పోరాటం, ప్రపంచ యుద్ధాల నేపథ్యంలో రచించిన శ్రవ్య నాటిక పరువుకోసం పోతే. ఒక జమిందారీ కుటుంబాన్ని ఆధారం చేసుకొని భిన్న దృక్పథాలను ఒకే కాన్వాసుమీద చిత్రించిన అద్భుత వర్ణచిత్రమిది. తరాలు, వర్గాలు, ప్రేమలు, స్వార్థాలు, త్యాగాలు, అధికార దర్పాలు, సెంటిమెంట్లు మొదలైనవి ఎన్నో ఆ నాటికలో తటస్థపడతాయి. అన్నింటికి మించి మానవత్వం శిఖర సదృశంగా కనిపిస్తుంది.
ఒక స్వాతంత్య్ర యోధుడిని వెతుక్కొంటూ అతడు దాగిన జమిందారు భవనానికి వచ్చిన బ్రిటీష్ ప్రభుత్వ పోలీసు అధికారితో జమీందారు కుటుంబ వృద్ధమాత అంటుంది ఇలా-
‘‘... మీ సంఘర్షణలో ఇమిడి వున్న ధర్మ సూత్రాలేమిటో నాకు తెలియడంలేదు. నాకు బోధపడని దానికి నేనేం సహాయం చేయగలను? శివం కోసం (అంటే ఈ నాటికలో స్వాతంత్య్ర యోధుడికోసం) మీరు గాలించి వెతుకుతున్నారు- మంచిది. వెతకండి. కాని ఆ వెతకడంలో మీకు సహాయం చెయ్యలేను. శివం ఆశయాలేమిటో నాకు తెలీదు. మీ ఆశయాలంతకన్నా తెలీదు. కాని నా ఆశయాలేమిటో నాకు స్పష్టంగా తెలుసు. నాతో అనుబంధం కలిగి వున్న ప్రతి మనిషి సుఖం కోసం నేను పాటుపడతాను. బలహీనుణ్ని ముష్కరుడు చావగొడుతుంటే అడ్డు తగులుతాను- ఏమైనే సరే. నాకు కావలసింది సుఖం. అందుచేత నా పరిసరాలు కూడా సుఖంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను..’’ ఈ నాటిక చాలా పాఠాలను చెపుతున్నది. పరిసరాలు సుఖంగా లేనపుడు మనిషి సుఖంగా బ్రతకడలేడన్న సందేశం కూడా వృద్ధమాత మాటల్లో దాగి వుంది. శాస్ర్తీగారు పలికించే సంభాషణలలో ఇలాంటి సూక్తి వౌక్తికాలు చాలా కనిపిస్తాయి.
జమీందారు పోయిన కొంతకాలానికి భార్యకు కుటుంబంలో ఒక విచిత్ర సన్నివేశం ఎదురైంది. ఆ సన్నివేశంలో ఆమె తత్త్వం ఆవిష్కృతమైంది. నిజానికి ఇది స్వాతంత్య్ర పోరాటకాలంలోనే కాదు, ఇప్పుడూ చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితే ఇది. ఇక్కడ అంతస్తులు, విద్యాయోగ్యతలు అప్రధానం. మనస్సు, ఆలోచనా సరళి ప్రధానం. గోరాశాస్ర్తీగారు స్వాతంత్య్ర యోధుణ్ణి దాచడానికి అనువైన చోటును సృష్టించడం కోసం జమీందారు భవనాన్ని ఎంచుకొన్నారు. అప్పటికే కాలం చేసిన జమీందారుతో ఇక్కడ పనిలేదు. కుటుంబ మర్యాదలు జమీందారు భార్య ద్వారా వ్యక్తమైనాయి.
పాత్రలూ, పరిస్థితులూ మారినా మనస్తత్వాలు ఒకంతట మారవు. సమాజం లోతులలోకి వెళ్లి చూస్తే జమీందారు భార్యవలె మానవీయ దృష్టి ఉన్న మరెందరో తటస్థపడవచ్చు. కొందరిలో అది వ్యక్తం, మరికొందరిలో అవ్యక్తం.
ఆశ ఖరీదు అణా సంకలంనలోని నాటికలు అప్పటికీ ఇప్పటికీ సమాజానికి ఉపయోగపడే రచనలు. వాటిల్లో ఆశ ఖరీదు అణా మరీ మరీ ప్రయోజనకరమైన నాటిక. ఏదో ఒక కారణంవల్ల ఆశాభంగం చెంది ఆత్మహత్య చేసుకొంటున్న అభాగ్యుల కథలను నిత్యం పత్రికలలో చదువుతుంటాము. ఒకరు ప్రేమ వైఫల్యం వల్ల ప్రాణం తీసుకొంటే,, మరొకరు పరీక్షల్లో నెగ్గని కారణంగా జీవితాన్ని అంతం చేసుకోవడం జరుగుతున్నది. ఆత్మహత్యకు పాల్పడుతున్న వ్యక్తికి అలా అనుకొన్న క్షణాన రవ్వంత ఆశ కల్పిస్తే అతడిని కాపాడవచ్చు. అది అసాధ్యమైన పనేమీ కాదు. పెద్దగా వ్యయప్రయాసలతో కూడినది కూడా కాదు.
మహానగరంలో ఒక గల్లీ. అందులో చాలా కుటుంబాలు అద్దెకు ఉంటున్న ఒక భవనం. అలా కాపురాలు ఉంటున్నవారిలో ముసలివాళ్లున్నారు, పడుచువాళ్లున్నారు, పెళ్లయినవాళ్లున్నారు, పెళ్లికానివారూ ఉన్నారు.
*
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పొత్తూరి వేంకటేశ్వరరావు