వినమరుగైన

ఆశే భవిష్యత్తుకు ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో విధమైన సమస్యలు. అన్ని కుటుంబాలూ కలిసి ఒక చిన్న సమాజం. అందరిలో ఏదో నైరాశ్యం, ఏదో నిస్సహాయత- ఒక తాతగారు మినహా. ఆయన మాత్రం ఆశావాది. చలి వణికిస్తున్న ఒక తెల్లవారు ఝామన నిరాశాజీవులు నలుగురినీ కూర్చోబెట్టుకుని ఆయన ఇలా అంటారు.
‘‘... చావడానికి లక్ష కారణాలుంటే బతకడానికి కోటి కారణాలుంటాయి. నా సంగతే తీసుకోండి. గంపెడు సంసారం. అందరూ మూర్ఖులు స్వార్థపరులూ - జబ్బులూ- అన్నీ సమస్యలే. కాని కాని ఏది ఏమైనా బతకడంలో ఎంతో మాధుర్యం ఉంది నాయనా! లోకాన్ని పోల్చుకోండి. ముందు మీకందరికి కావలసింది ధైర్యం. మనలో ఏ ఒక్కరి కుటుంబం తీసుకొన్నా నికృష్టంగానే ఉంది. అంత మాత్రాన మనల్ని మనమే అసహ్యించుకొంటామా? జీవితంలోని ఆనందాన్ని పోల్చుకొందుకీ, దుఃఖాన్ని సానుభూతితో చూడటానికీ ప్రయత్నించండి. నిస్సహాయతని అసహ్యించుకొనే మనుషులున్నారు లోకంలో. మీరు అలాగే అయిపోకండి. బిచ్చగాడిని వాడి దారిద్య్రానికీ, పిల్లవాడిని వాడి తల్లిదండ్రుల మూర్ఖత్వానికీ నిందించకండి’’.
ఎవరో అడిగారు ఆయన్ని- ‘‘మీరు ఇనే్నళ్లు బతికారు గదా! మీరు అనుభవించిన ఆనందం ఏమిటి’’ అని.
తాతగారంటారు-
‘‘బోలెడంత! వర్షాకాలం గొడుగేసుకొంటే ఆనందం. ఎండాకాలం చన్నీళ్లు స్నానం చేస్తే ఆనందం. శీతాకాలం దుప్పటి కప్పుకొంటే ఆనందం.’’
అలా చలిలో కబుర్లు చెప్పుకొంటున్న వారందరి దృష్టి ‘‘కాఫీ, కాఫీ’’ అంటూ గంట వాయించుకొంటూ వచ్చిన మనిషిమీద పడింది. ఆ రోజుల్లో కాఫీ గ్లాసు అణా! తాతగారు తన చుట్టూ ఉన్న అందరికీ తలొక గ్లాసు కాఫీ ఇప్పించారు. అక్కడ కూర్చున్న వాళ్లలో కృష్ణవేణి అనే అమ్మాయి అంటుంది కాఫీ తాగి-
‘‘ఇలా తెల్లవారుఝామున రోడ్డుమీద లాంతరు కాఫీ ఎప్పుడూ తాగలేదు. ఎంత బాగుంది! నీళ్ల కాఫీయే అనుకోండి, అయితేనేం- ఇలా తాగడం బాగుంది..’’
మరో అమ్మాయి అందుకొని ‘‘మరే! ఎందుకో ప్రాణం లేచి వచ్చింది. మీరు గొప్పవాళ్లు తాతగారూ!’’ అంది. అణా కాఫీ మహిమ వారి చేత అలా అనిపించింది. తాతగారన్నారు- ‘‘చూశారా మరి. మనిషికొక్క అణాతో అందరికీ మళ్లీ ఎంత ఆశ వచ్చిందో’’. అప్పుడే తెల్లవారుతుంటుంది. కృష్ణవేణి అంటుంది. ‘‘మరిచిపోయిన ఆశలు మళ్లీ జ్ఞాపకం వస్తున్నాయి. తెల్లవారుతోంది’’ అని. ఒక యువకుడి చేత ‘‘ఇంకో కొత్త ప్రభావం!’’ అని ముక్తాయింపు పలికించి నాటికను ముగింపు చేశారు గోరాశాస్ర్తీగారు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పొత్తూరి వేంకటేశ్వరరావు