వినమరుగైన

మాతృమందిరము( వేంకట పార్వతీశ్వర కవులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొనాధన్ స్విప్ట్ రచించిన గలివర్స్ ట్రావెల్స్ అలాంటిది. స్విప్ట్‌లా కరకు మాటలతో కాకుండా, మంచి మాటలతో చేసిన ప్రయత్నం మన తెలుగు నవల మాతృమందిరం. మాతృమందిరం రుూజ్ ది తెలుగు యుటోపియా అని అనవచ్చు.
అందుకే శ్రీకాంత శర్మగారన్నట్లు రచయితలు మంచీ, చెడూ రెండు చిత్రించాల్సి వచ్చింది. అవి అతిగా వుండటం సాహిత్య అవసరం.ఈ నవలపై మరో తీవ్ర విమర్శ కూడా వుంది. శ్రీ కవిత్వవేది తమ ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహములో మాతృమందిరములో విస్వైక్యము శూన్యము అని తేల్చి పారేశారు. వస్తు ఐక్యం ప్రబోధానందస్వామి మాతృమందిరంలో అందరినీ సమావేశం అయ్యేట్లు చేసి, అందరి తప్పులు ఒప్పించి, దిద్దించటంలో వుంది. ఈ సంగతి ముందే గమనించి తమ ఉపోద్ఘాతంలో వెంకట పార్వతీశ్వర కవులు ఇలా అన్నారు. భౌతిక ప్రపంచమునకును, భావనా ప్రపంచమునకును గలిగిన బింబ ప్రతిబింబ సంఘటన సమయమునందే ఇందలి ఇతివృత్తము సుప్రకాశితమయ్యెను. మాతృ మందిరాన్ని అనేక కోణాల నుంచి అధ్యయనం చేసే అవకాశాలున్నాయి. నవలలో సంఘ సంస్కరణ ప్రధాన ధ్యేయం కాబట్టి మానవులందరూ సోదరులనే ప్రతిపాదన సర్వత్రా వ్యాపించింది. బెంగాల్‌లో బంకించంద్ర ఛటర్జీ ఆనందమఠం నవలలాంటిది తెలుగు మాతృమందిరం. అయినా ఈ నవల అనేక వౌలిక భేదాలు ప్రదర్శించి స్వతంత్ర నవలా గౌరవం పొందింది. అనంతరం తెలుగు రచయితలపై ఈ నవల ప్రభావం ప్రస్ఫుటంగా పడింది. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..