వినమరుగైన

మాతృమందిరము( వేంకట పార్వతీశ్వర కవులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1922లో దువ్వూరి రామిరెడ్డిగారై మాతృమందిరము అనే ఖండకావ్యంలో దేశాభివృద్ధికి, మాతృమందిరంలో స్థానానికి త్యాగం ప్రధానం అని వెంకట పార్వతీశ్వర కవులు తమ నవల మాతృమందిరంలో ప్రతిపాదించినట్లే ప్రతిపాదించారు.
మాతృమందిరములో మరో ముఖ్య విశేషం ఉంది. ఈ నవల చదివితే వెంకట పార్వతీశ్వర కవుల ఇతర కవితలు కూడా రుచి చూడవచ్చు. నవలలో ఒక్కొక్క ప్రకరణానికి ముందు ఒక్కొక్క ఖండిక నుంచి కొన్ని పంక్తులు తీసుకుని ఈ కవులు ప్రకటించారు. వీరి ప్రఖ్యాత రచన ఏకాంతసేవ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఒకరకంగా ఏకాంతసేవ వీరి ప్రేమ సిద్ధాంతం అయితే, మాతృమందిరము దాని ఆచరణ. సరస్వతి, ముత్యాలు పాత్రల ద్వారా ఏకాంతసేవలోని భావాలకు మానవ రూపాలు లభించాయి.
దళిత బాలిక ముత్యాలు తను కోరుకున్న వ్యక్తి ప్రేమకోసం తపించిపోవడం, తుదకు తనే త్యాగం చేయడం, ఆ సందర్భంగా ఆమె పలికిన పలుకులు పాఠకుడిని కంట తడిపెట్టిస్తాయి.
విధవా వివాహానికి ఈ రచయితల అనుమతి లేదు. వీరి ఉద్దేవ్యంలో అది అభారతీయం.అందుకే బాల వింతంతువు సత్యవతి సత్యానందాదేవి అనే పేరుతో మాతృమందిరంలో మాతృదేవి పూజా పరిచారిక అవుతుంది.
అయితే మాతృమందిరం నిర్ద్వంద్వంగా సర్వమానవ సహోదరత్వాన్ని ప్రతిపాదిస్తుంది. హరిజనుల కోసం అమృత హస్తాలు చాచి ముందుకు వస్తున్న మాతృదేవి చరణ మంజీరాల నాదం సామవేదంలా ప్రశాంత గోదావరీ తీరంలో ఇప్పటికీ- అంటే నవల చదవటం ముగించాక కూడా అనుభూతమవుతూనే వుంటుంది. గాంధీజీ ప్రవేశానికి ముందే హరిజనులను హృదయానికి ఎత్తుకున్న వెంకట పార్వతీశ్వరుల సాహస క్రాంత దర్శనం ప్రశంసార్హం. సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొలసాని సాంబశివరావు