వినమరుగైన

గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్రమంత విశాలమైన తెలుగు సాహిత్యంలో నిజానికి ఎందరు సాహితీమూర్తులు, వారు సృష్టించిన ఎన్ని అద్భుతమైన పాత్రలు లేవు? కాని చటుక్కున మన మనసులో మెదిలే పాత్రలు మాత్రం కొనే్న. గురజాడ వారి గిరీశం, పానుగంటి వారి జంఘాల శాస్ర్తీ, మొక్కపాటి వారి పార్వతీం.. ఇలా! అలాంటి పాత్రల కోవకు చెందినదే చిలకమర్తివారు సృష్టించిన గణపతి పాత్ర! ఆంధ్రుల జీవితంలో అక్కడక్కడా కన్పించే అవలక్షణాలన్నింటినీ పోగుచేసి గణపతి పాత్రకు రూపకల్పన చేశారు చిలకమర్తివారు. పార్వతీదేవి తలంటుపోసుకోబోతూ ఒంటికి పెట్టుకున్న నలుగుతో పిండి బొమ్మ చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ గణపతి ఉద్భవించాడు. తమ సాహితీ కన్య నలుగుపెట్టుకుంటే కిందపడ్డ నలుగుతో ఈ గణపతి కాయాన్ని ఖాయం చేశారు చిలకమర్తివారు అంటారు ఆరుద్ర. అంతటి అజ్ఞానావతారం కంచుకాగడాలు పెట్టి వెతికినా తెలుగు సాహిత్యంలో మరొక చోట కన్పించదు. భాగవత రామాయణాది పురాణములు విని విని చెవులు తడకలు కట్టినవారికి వినోదమైనా కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ గణపతి వృత్తాంతాన్ని వ్రాస్తున్నానని చిలకమర్తివారు అన్నప్పటికీ ఒక విశేష ప్రయోజనానే్న చిలకమర్తివారు ఆశించారు. వీరు సృష్టించిన గణపతి ఏ మాత్రం కల్తీ లేని తెలుగువాడు. మనకు బాగా పరిచయమైనవాడు. తాను నవ్వుల పాలౌతూ మనల్ని నవ్వించేవాడు. ఈతడి వంశము బ్రహ్మము. అందునా పప్పుబొట్లవారి శాఖ. గణపతి పూర్వులలో ఒకడు పందెము వేసి మూడు తవ్వల కందిపప్పు వండించుకొని తానొక్కడే భక్షించి మూడు వరహాలు బహుమానంగా పొందటంవల్ల వాడి ఇంటిపేరు పప్పు్భట్లవారని రూఢమైంది. గోదావరి తీరంలోని మందపల్లి ఈ వంశీయుల స్వగ్రామం. గణపతి పూర్వీకులు పురుష వృషభులు. అంటే అచ్చువోసి విడిచిన ఆబోతులు. ఎవరి పొలము గట్టుమీద మామిడిచెట్లున్నా, కొబ్బరి చెట్లున్నా వాని కాయలు పప్పు్భట్లవారివే. ఎవరి దొడ్లో మంచి పాదులు పెట్టుకున్నా వాని కాయలు పప్పు్భట్లవారివే. గణపతి తాత, తండ్రి ఎంతటి మహోత్తర చరిత్ర గలవారో విశదంగా చెప్పాక గణపతి వృత్తాంతంలోకి వస్తారు చిలకమర్తివారు. గణపతి తాతగారి పేరు పాపయ్య. స్వవస్తువుకూ, పరవస్తువుకూ అద్వైతభావం కలవాడు. ఇతగాడికి శరీరమంతా జీర్ణకోశం ఉన్నది. అగ్నిహోత్రంలో ఏమి వేసినా హుతమైపోయినట్లు, పాపయ్య జఠరాగ్నిలో ఏమి పడినా భస్మమే! రోజుకు మూడుసార్లు మూడు మానికల బియ్యం కావాలి అతనికి! యజ్ఞ యాగాలు చేసే శక్తి సామర్థ్యాలు ఎలాగూ లేవు కనుక అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్ అనే ఆర్యోక్తిని నమ్మి దిక్కులేని శవాలను కాల్చటాన్ని తన వృత్తిగా స్వీకరిస్తాడు. అన్నంభొట్ల అప్పన్నగారు తమ పనె్నండు సంవత్సరాల వయసుగల కుమార్తెను, పనె్నండు వందల రూపాయల కన్యాశుల్కానికి, మూడు వందల రూపాయల నగలకు అతనికిచ్చి పెళ్లిచేస్తారు. అలా నలభై సంవత్సరాల వయసుగల పాపయ్యకూ, ముక్కుపచ్చలారని పిచ్చమ్మకూ వివాహం జరుగుతుంది.వివాహం జరిగిన రెండు సంవత్సరాలకు ఆమె పుష్పవతి అవుతుంది. అయితే ఈమధ్యకాలంలో మామకూ అల్లుడుకూ మనస్పర్థలు వస్తాయి. అందువల్ల మళ్లీ మూడు వందల రూపాయలిచ్చి మామగార్ని ప్రసన్నుణ్ణి చేసుకొని పిచ్చమ్మను కాపరానికి తెచ్చుకుంటాడు. సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

చిలకమర్తి లక్ష్మీ నరసింహం