వినమరుగైన

మాలపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటిసారి జైలుశిక్షననుభవిస్తున్న కాలానికే పాలకుల విధానాలు ఏవిధంగా సామాన్య జనులను నేర ప్రవృత్తికి మరలుస్తున్నాయోచూశారు. స్వరాజ్యం వస్తేగాని సెటిల్‌మెంట్లు, జైళ్లు బాగుపడే అవకాశం లేదని భావించారు. భూస్వామ్య వ్యవస్థలో శ్రామిక జనుల శ్రమకు సరియన గిట్టుబాటు లభింపకపోవటం, కాలగతిలో కుల వ్యవస్థలో ఏర్పడిన దోషాలు ఆయన గుండెను కదలించివేశాయి. వ్యవస్థలో కొందరికి కలుగుతున్న ఆర్థిక పరమైన బాధల పరిణామాలను కళ్లారా చూశారు. సామాజిక జీవనంలో సామరస్యం, భావ సమైక్యత ఎలా వుంటే ఈ వ్యవస్థ కుదుటపడుతుందోనని ఆలోచింపసాగారు. ఈ విధంగా మధనపడుతున్న నేపథ్యంలో దళితవాడలోని ఒక కుటుంబానికి సంబంధించిన ఇతివృత్తాన్ని తీసికొని, భూస్వామ్య వ్వవస్థలో పాతుకొని వున్న పెత్తందారీతనాన్ని నిలుపుకోవటమే గౌరవమని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మరొక కుటుంబాన్ని అందులో వున్న భిన్న ప్రవృత్తులవారిని- అంటే మనసున్న మనుష్యుల్ని, పరుపుప్రతిష్ఠలే ముఖ్యమనుకునేవారిని, పవిత్రతకు, ఆత్మౌన్నత్యానికి ప్రాధాన్యమిచ్చేవారిని జాతికంటే నీతి ముఖ్యమని భావించేవారిని పాత్రలుగా నిలిపి తెలుగు పలుకుబడి తియ్యదనాన్ని నోటికందిస్తున్నట్లు ఉన్నవ వారీ నవలను వ్యావహారిక భాషలో రూపొందించారు.
మంగళాపురం పల్లెలో అంటే దళితవాడలో దాసరి రామదాసు కుటుంబం అనాదిగా నివసిస్తోంది. అన్నవస్త్రాలకు లోటులేదు. సొంత భూవసతి వుంది. ఇంట్లో అందరూ కష్టపడేవారే. ఆ విధంగా కుటుంబ పషణ చేసుకుంటూ రోజులు నడుపుకుంటున్నారు. రామదాసు భార్పేరు మాలక్ష్మి. వెంకటదాసు, సంగదాసు అనే ఇద్దరు ఎదిగొచ్చిన కొడుకులు, ఆరంజోంతి అనే కూతురు, రంగడనే పసివానితో మొత్తం నలుగురు సంతానం. ఆయనకొక వితంతువైన చెల్లెలు, ఆమెకొక బిడ్డడు ఉన్నారు. అతడిపేరు అప్పాదాసు. లేబ్రాయమాతనిది. ఆరంజోతి అతనికంటె వయస్సులో చిన్నది. వారిది సంప్రదాయ విద్యాభ్యాసం. రామదాసు కొడుకులు పెద్దవాళ్లిద్దరూ ఎవిర పనులలో వాళ్లున్నారు. అప్పాదాసు సుకుమారుడు గనుక బయట ఇళ్లలో జీతపు పని కష్టమని రామదాసు తనింట్లోనే పని సమకూర్చాడు. రామదాసు భార్యకు చదువులేదు గాని అందరిపట్ల ఆప్యాయత చూపించే ఉత్తమ గృహిణి. నవల ప్రారంభంలో రామదాసు చెల్లెలు ఎక్కడో గడ్డి కోసుకొని తెచ్చుకుంటుంటే ఒక ఆసామి తన చేలోనే ఆమె దొంగతనంగా గడ్డి కోసి ఉంటుందని భావించి నిందిస్తూ కర్రతో కొడితే ఆమెకు మోచేతి దగ్గరనుండి గూడవరకు ఎముకలకు బలంగా దెబ్బ తగిలి వైద్యానికి కుదరక తరువాత ఆమె చచ్చిపోతుంది. నవలలో రామదాసు ప్రారబ్దమనుభవించటం దీనితో మొదలవుతుంది. రామదాసు కొడుకు సంగదాసు సంఘ సంస్కరణకు పూనుకొని అప్పటికే మంచి ప్రతిష్ఠ సంపాదించుకున్నాడు. దానికి అతని స్నేహితుడు రామానాయుడు సహకరిస్తున్నాడు. ఇది రామానాయుడు తండ్రి చౌదరయ్యకు అంత ఇష్టం లేదు. వీళ్లిద్దరూ బెజవాడలో జరిగిన ఆది ఆంధ్ర మహాసభకు వెళ్లి కలసి హోటలులో భోంచేసి, తిరిగి మంగళాపురం వస్తూ రామానాయుడు భార్యనూ, కొడుకునూ తీసుకొని రావటానికి అత్తవారింటికి వెళ్లాడు.
సంగదాసు తిరిగి వచ్చి చౌదరయ్యతో ఇంట్లో ఎప్పటివలెనే వ్యవసాయపు పనులపై పర్యవేక్షణలో వుండగా, సంగదాసు తనకుమారునితో సమాన స్థాయిలో మసలుతున్నందుకు కోపంతో మండిపోయి ఒళ్లు తెలియని ఆవేశంతో చౌదరయ్య రాగోలతో సంగదాసు తలపై కొట్టడంతో అతడు చచ్చిపోతాడు. అది తెలిసిన జనం కొంతమంది చౌదరయ్యను చంపే ప్రయత్నం చేయగా, అతడు తప్పించుకుంటాడు. ఆ సమయంలో రామదాసు దంపతులు చూపిన సంయమనం, అంతా ప్రారబ్దవశాన జరిగిందని తమ్ము తాము సంభాళించుకోవడం, నష్టపరిహారంగా రూపాయల ఎరకు బానిసలు కాకపోవటం - ఇదంతా రామదాసు ఔన్నత్యానికి, నైర్మల్యానికి ఉదాహరణ. నవల ముగింపునకు వచ్చేసరికి శ్రీ ఉన్నవ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు ఊహాచితం గీసుకున్నారు. నవల వ్రాసిన 1922-23 కాలానికి ఒక్క సహాయ నిరాకరణోద్యమం మాత్రమే జరిగింది. స్వరాజ్యం రాలేదు. స్వరాజ్యం వస్తే ఎలా ఉంటుందన్న భావనతో వారు ఒక ముగింపు ఇచ్చారు. అది ఇలా ఉంది - ‘‘రాజకీయ ఖైదీలనందరిని విడిచిపెట్టారు. వృత్తులు వృద్ధి అయి ప్రతివారికి న్యాయంగా జీవించడానికి అవకాశం కలిగి నేరాలాగిపోవటానికి, దేశ గౌరవం, సంపాదించటానికి అవకాశమియ్యవలసిందని దేశమంతటా ఆందోళన కలిగించారు. దేశం సుముఖమైంది’’. నిజానికి పై మాటల్లోనిదంతా వారి ఊహ. అస్తవ్యస్తంగావున్న భారతీయ జీవన వ్యవస్థ సరిదిద్దుకుంటుందన్న ఆశతో చేసిన వర్ణన ఇది.
ఇక రామదాసు జైలునుండి విడుదలై వచ్చిన సన్నివేశం ఈ నవలకు పరాకాష్ట. ‘‘రామదాస యతీంద్రుడు విజయపతాకం పట్టుకొని వస్తున్నాడు’’ అని ప్రారంభించి, ఆయనకు నూతనంగా ఏర్పరచిన నివాసంలో ప్రవేశపెట్టిన సన్నివేశంలో స్వాగతం చెప్పటానికి వచ్చిన వారంతా రామదాసుకు జేజేలు చెప్పి రామదాసు కుటుంబంలోని వారినందరిని తలచుకొని, మాలక్ష్మి వెంకటదాసుల అవశేషాలుంచినచోట అక్షతలు జల్లి, నివాళులర్పించి తాంబూలాలు పుచ్చుకొని ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోవటంతో నవలకు ఒక ముక్తాయింపు వస్తుంది.

- సమాప్తం
---------------------------------------------------------------
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- ఉన్నవ లక్ష్మీనారాయణ