వినమరుగైన

ఓబయ్య - వేలూరి శివరామశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతావధాని వేలూరి శివరామశాస్ర్తీగారి వంటి ఉద్దండ పండితులూ- బహు శాస్త్ర నిష్ణాతులు నవలా రచనకు పూనుకోవడం ఆ సాహిత్య ప్రక్రియకే గౌరవం తెచ్చిపెట్టిందని విమర్శకుల అభిప్రాయం! శివరామశాస్ర్తీగారి ఒక చేతితో స్వతంత్ర నవలలు సృష్టించారు. రెండో చేత్తో అనువాదాలు చేశారు. ఓబయ్య, చీకటి తప్పు అనే రెండూ శాస్ర్తీగారి స్వతంత్ర నవలలు, బిందుగారబ్బాయ్, రాముని బుద్ధిమంతనం, మార్గ ప్రదర్శనీయం, బాపన పిల్ల, కట్టు తప్పిన పిల్ల, సర్వేసు వీలునామా- అనే ఆరూ శరత్‌బాబు బెంగాలీ నవలలకు అనువాదాలు. ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత విక్టోర్ హ్యూగో లే మిజరబుల్స్ నవలను దివ్య జీవనం అనే పేరుతో కథా ప్రధానంగా అనువదించారు. డాన్ క్విక్ సెట్ అనేది స్పానిష్ నవలకు తెనుగు సేత.
తెలుగు నవల పుట్టిన నలభై ఏళ్ల దాకా దేశంలో రాజకీయ ఉద్యమాన్ని ప్రతిబింబించిన నవల రాలేదు. వేలూరి శివరామశాస్ర్తీగారి ఓబయ్య గాంధీ ఉద్యమాన్ని ప్రతిబింబించే మొదటి నవల అన్నారు ప్రఖ్యాత సాహితీవేత్తలు శ్రీ ఆర్.ఎస్.సుదర్శనంగారు. తెలుగు నవలలను గురించి విశేష పరిశోధన చేసిన శ్రీ మొదలి నాగభూషణ శర్మ గారు తెలుగు నవలా వికాసాన్ని సమీక్షిస్తూ 1902లో వెలువడిన శివరామశాస్ర్తీగారి ఓబయ్య జాతీయోద్యమాన్ని గురించి వ్రాయబడిన తొలి నవల అని పేర్కొన్నారు.
రాజకీయాలలో గాంధీ మహాత్ముడు- సాహిత్యంలో అరవింద, రవీంద్రులు శివరామశాస్ర్తీ గారిని ప్రభావితం చేసిన మహనీయులు. గాంధీజీ ఆదర్శమహిత జీవితం శాస్ర్తీగారిమీద ఎంత ప్రగాఢ ప్రభావం కలిగించిందంటే ఆనాటి జాతీయోద్యమాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఒక నవలగా తీర్చిదిద్దడమేకాక, ఆ పిమ్మట మహాత్ముని ఆత్మకథను గుజరాతీమూలం నుండి తెనుగు కనువదించారు. శ్రీ శివరామశాస్ర్తీగారి తరువాతనే ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులుగారు మాలపల్లిలో జాతీయోద్యమానికి నివాళి పట్టారు. అనంతరం ఎందరెందరో గాంధీజీ నడిపిన జాతీయోద్యమం గురించీ, నాటి రాజకీయ పరిణామాల గురించీ ఎన్నో నవలలు వెలయించారు.
వేలూరి వారి వంశంలో ఎందరో భారత జాతీయోద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములు కావడం ఈ నవల ఆ రచనకు దోహదం చేసి వుండవచ్చు. వారి అన్నగారు శ్రీ యజ్ఞ నారాయణ శాస్ర్తీగారు గాంధీజీ అడుగుజాడలలో నడిచి, తమ జీవిత సర్వస్వాన్ని దేశమాత పాదాలపై సమర్పించిన కర్మయోగి. ఆయన భారతీయ సాంస్కృతిక జాగరణానికి మూర్త్భీవం; గాంధీ యుగపు నైతిక రాజకీయ చైతన్యానికి ప్రతీక- కాగా శివరామశాస్ర్తీ గారు కూడా మాతృదేశ స్వాతంత్య్ర వాయువులతో పులకించిపోయిన జాతీయవాదులు- అంతేకాదు- శాస్ర్తీగారు నిత్యం ఖద్దరు ధరించిన గాంధేయవాది.
ఓబయ్య ఎప్పుడు పుట్టాడో, ఎక్కడ పుట్టాడో తెలీదు కాని ప్రజోత్పత్తి ఫాల్గుణం భారతిలో అవతరించాడు. అతని మరోపేరు అహోబలుడు. నవల ఆరంభంలో మనకుడుపుల అల్లుడు హోదాలో మనకు కనిపిస్తాడు ఓబయ్య. తన శక్తిని తానెరుగని హనుమంతుడులాంటివాడు ఆయన. అదొక పల్లెటూరు. పల్లెటూళ్లలో కొత్త పెళ్లికొడుకన్నా, కొత్త పెళ్లికూతురన్నా పెద్దలకూ, పిల్లలకూ వల్లమాలిన మోజు. ఓబయ్య వారందరి మోజు రుచి చూడడానికే ఎక్కే గడపా దిగే గడపా. అవధానులు గారింటికి వెళ్లాడు. అవధాన్లుగారు జపం చేసుకొంటున్నాడు. ఆయన మంచి గడుసరి- సంతోషప్రియుడు.
ఓబయ్యను కొంచెం బుజ్జగించాడు. ఓబయ్యకు బులపాటం రేగింది. అవధాన్లుగారూ! నాకొక తేలు మంత్రం చెప్పండి అని అడిగాడు. అట్లాగేనని, ఓబయ్యకు ముసుగేసి, అతడి మొహాన ఇంత విభూతి రాసి, చెవులో నోరు పెట్టి హే వృశ్చికరాజ! మమ అథః ప్రదేశే దశదశ’ అని ఉపదేశించాడు. దీన్ని లక్షలసార్లు జపించమని ఆదేశించాడు.
ఆ మునుకుడుపు అల్లుడు, అత్తగారి వంటింటి పంచలో మకాం పెట్టి, ఇంటికప్పు లేచిపోయేటట్లు జపం ప్రారంభించాడు.
ఓబయ్య భార్య పేరు వసుమతి, మామగారు బడిపంతులు కైలాసరావు, అత్తగారు సోమమ్మ, వారికొక శిష్యుడు వాసుదేవరావు. సోమమ్మకు అల్లుడి మంత్రోచ్ఛారణ చూసి బేజారెత్తింది. ఇదేమి అల్లుడు! ఐదవ ఫారం చదువుతున్నాడు. పైగా మూడవఫారం చదువుతున్న అమ్మాయికి భర్త-
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-జంధ్యాల మహతీ శంకర్