వినమరుగైన

చివరకు మిగిలేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరే, ఇవన్నీ ప్రశ్నలు. అసలు కథాక్రమానికొస్తే- ఆ మాటకొస్తే- ఈ నవలలో ఇతివృత్తపు మలుపులు పెద్దగా ఏమీ కన్పించవు. ఉన్న ఒకటి రెండు మలుపులే నవలను ముందుకు కొనసాగనిస్తాయ్. నాటకీయత, మెలోడ్రామా ఏమీ లేకుండానే ఇతివృత్తం పారదర్శకంగా ముందుకు సాగుతుంది. అమృతం తనను తాను దయానిధికి ఓ వానరాత్రి సమర్పించుకోవటంలో నవల తిరిగిన రెండవ మలుపు- దయానిధి రాయలసీమకు ఒంటరిగా ఆ చీకటి ఉదయాన రైలెక్కి పయనమైపోవటం, ‘కాత్యాయని’ అనే వజ్రం దొరకటం ఒక విరుపు. అనాస్తకయోగంలో వున్న దయానిధి సన్నిధికి తిరిగి కమలి చేరుకోవటం నవలలోని ఆఖరి మలుపు.
ఈ నవలలో పదకొండు అధ్యాయాలున్నై. ఆ అధ్యాయాలకు కవితాత్మకమైన శీర్షికలుంచాడు నవలా రచయిత. గతాన్ని గురించిన స్వగతంలో గడిచిన వర్తమానం ఈ నవల. కొన్ని అధ్యాయాలు- గడ్డిపోచ విలువెంత? అనుభవానికి హద్దులు లేవు. సౌందర్య రాహిత్యం, చీకటి సమస్య లాంటి వాటిల్లో ప్రకృతి, మానవ ప్రకృతి ప్రవృత్తుల వర్ణన అధికంగా కన్పిస్తుంది. చప్పుడు చెయ్యని సంకెళ్ళు, రాళ్లసీమలాంటి అధ్యాయాలలో సామాజిక దృష్టి, పరిశీలన, అవగాహన ఉంటుంది. ‘స్వయం సంస్కారం’ అధ్యాయంలో బౌద్ధిక పరిశీలన, తాత్త్విక విచారం ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. దయానిధి ఆత్మశోధన అనే పరిశోధనలో నవలలోని మిగతా పాత్రలన్నీ శోధనా నాళికలే.
నవలలోని అసలు సమస్య సౌందర్య సమస్య. ప్రేమ రాహిత్యం. భౌతికమైన కాంక్షలో పూర్వ నిర్మితమైన, నిద్రితమైన ఆత్మిక ఆకాంక్ష. కోమలి ఎవరిని ఎప్పుడైనా అడిగితే దయానిధి చేయగలిగిందల్లా వెలుగునీడలవైపు వేలు చూపించటం మాత్రమే.
తల్లి అనైతిక జీవితానికి సాక్ష్యాలు లేవు. ఆమె మరణానికి వాఙ్మలాలు లేవు. ఉన్నవల్లా ఆరోపణలూ, అనుమాన ప్రమాణాలే. సుశీల మరణానికి కక్షతో కూడిన సాక్ష్యం ఉంది కాని, అది సత్యం కాదు. అది అసత్య సాక్ష్యం. ఒక్క అమృతం మాత్రమే తన నిసర్గమైన సౌందర్యంతో దయానిధిని జయించి ‘‘బావా నీ పోలికే!’’ అని శిశువుని మనసారా చూపిస్తుంది. దయానిధి తన కోల్పోయిన తల్లిని అమృతంలో దర్శిస్తాడు. ఆ నేర భావంతోనే, మొహం చూపించలేక తెల్లార్జామున రాయలసీమ వేపు రైలెక్కి వెళ్లిపోతాడు. హామ్లెట్ నాటకంలో ఒఫీలియా చనిపోతుంది. చివరకు మిగిలేది నవలలో కోమలి - ఒఫీలియా లాంటి కోమలి - తిరిగి ప్రత్యక్షమవుతుంది. నవల ఆఖరి దృశ్యంలో ఆమెతో దయానిధి భవిష్య ప్రయాణం- అనిర్దేశితమైన ప్రయాణం మొదలుపెడతాడు. తనను తాను సమర్పించుకొని అమృతం తను కన్న శిశువు ద్వారా పునర్జీవితాన్ని పొందింది.
ఈ నవలలో ఆదినుండి అంతంవరకూ దయానిధి తన బ్రహ్మచర్యాన్ని కోల్పోయింది ఒక్కసారే. అది కూడా సభ్య సమాజంలో ఒక భాగమైన అమృతంవల్లనే. దయానిధీ, కోమలీ ఇద్దరూ సమాజపు వెలుపలి వ్యక్తులే. అయినా దయానిధి తనకు దొరికిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు. కోమలి సహజ సౌందర్యం అతని ఆత్మని మాత్రమే దగ్ధం చేసింది కాని దేహాన్నది ఏనాడూ తాకలేదు. ఇందిర, నాగుమణి, సుశీల, శ్యామల సమాజం తనకనుకూలంగా తయారుచేసుకున్న బొమ్మలు. వివాహ వ్యవస్థ వాళ్లకు మిగిల్చిన ఆనందమంటూ ఏమీ లేదు చివరికి.
కోమలి వర్ణనలో దయానిధి సౌందర్య విచికిత్స ఉంది. బాహ్యాంతర సౌందర్యాల జిగీష ఉంది. భౌతిక ప్రేమ- ప్లెటానిక్ ప్రేమగా రూపాంతరం చెందే క్రమం కన్పిస్తుంది. దయానిధి అంతఃస్సంభాషణలో కొన్ని శకలాలు వినండి:
‘‘శరీరంపై యవ్వనం దౌర్జన్యం చేసి అధికారం చలయించగల్దుకాని, విముక్తి నివ్వలేదు’’ (పు.20)
‘‘యవ్వనం వొక ప్రాచీన శక్తి- తరతరాల వ్యక్తులను కాల్చి మట్టిచేసిన బలంతో సృష్టినే వేధించిన ఆ మహాశక్తికి, సంస్కారం, వనె్న చినె్నలు, నగిషీలు, వంకరతిరిగి, తిరిగి బైల్దేరిన స్థానానికి తెచ్చే మానసిక మెట్లు- నిశీధి తెరచుకున్న ద్వారాల మధ్య ఆత్మహత్య చేసుకున్న యవ్వనపు శక్తి.. సంస్కారాన్ని కోరదు’’ (ప.23)
*

-- బుచ్చిబాబు