వినమరుగైన

కీలుబొమ్మలు -జి.వి.కృష్ణారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పాత్రలనూ, వీటితోపాటు పల్లెలోని ఇతర ప్రజలనూ కలిపి, సంఘటనలతో పేర్చి అపురూప కథాహారంగా పేర్చుతారు కృష్ణారావు గారు. ధర్మం వ్యక్తిగతమా, సామాజికమా అనే ప్రశ్నను కథాగమనంలో పదే పదే లేవనెత్తుతారు కృష్ణారావుగారు. అయితే చెలరేగిన పుకార్లలో పాతకక్షలు రగుల్కోవడంలో ఇళ్లూ, గడ్డివాములూ కక్షలకు భస్మీపటలం కావడంలో సామరస్యత చెడి ఊరు రెండుగా చీలిపోవడంలో పశువులూ, పాలేర్లూ ద్వేషాలకు బలికావడంలో మలబారు పోలీసులు గ్రామాన్ని వశం చేసుకోవడంలో రుూ ప్రశ్నకి జవాబే దొరకదు.
నిస్సందేహంగా రుూ కథ ఒక వ్యంగ్యాత్మక సామాజిక చిత్రణ. మనం నిత్య సత్యాలుగా భావించే విలువలు ఏమీ రుూ ప్రపంచంలో నిలువవనే నవలాకారుని ఉద్దేశం. మంచి చెడును జయించకపోగా దాని చేతిలో ఓడిపోతుంది. దోషులు అందలాలెక్కుతారు. నిర్దోషులకి శిక్షపడుతుంది. ధర్మం ధ్రువనక్షత్రంలాగా శాశ్వతంగా నిలచి వెలుగుతుందనేది వట్టిమాట. ఈ నవల ఆ కారణంవల్లనే భగవద్గీతలోని ధర్మ సంస్థాపనార్థాయ.. శ్లోకంతో ఉదాత్తమైన వ్యంగ్యంతో ముగుస్తుంది. ఆశావాదం మాత్రమే నవల చివరలో ధ్వనించాలి అనడం కేవలం సంప్రదాయ ధోరణే. వాస్తవానికి కట్టుబడిన వాళ్లూ, జీవిత సత్యాలను అవగతం చేసుకున్నవారూ రుూ ముగింపుతో విభేదించడం జరగదు. పైగా నవల యొక్క సమకాలీన ప్రాముఖ్యత యిక్కడే ద్యోతకం అవుతుంది. కీలుబొమ్మలు ఒక అరుదైన సాంఘిక రాజకీయ చిత్రంగా భావించవచ్చు. కాని దాన్ని ఒక నవలగా మలచడానికి కృష్ణారావుగారికిగల కళమీది నిబద్ధ కారణం అవవచ్చు. నాటకీయంగా చెప్పగలిగిన సాంఘిక విమర్శను కూడా ఆయన అనూషంగికంగా, మృదువుగా చెప్పడం ఆయన కథనా నైపుణ్యానికి మచ్చుతునక. అందరూ కీలుబొమ్మలే. ఉన్నత వర్గాల వారి చేతిలో బందీ అయిన సంఘం ఎలా తిప్పితే అలా తిరిగే మరమనుషులు. ఈ కథల పాత్రలన్నింటిపట్లా కథకుడికి సానుభూతి వుండటంవల్లే ఇది సాధ్యమయింది. ప్రతి ఒక్క పాత్రా ఏదో ఒక సమయంలో మానసిక క్షోభను అనుభవిస్తుంది. అనుమానాల సుడిగుండంలో పడిపోతుంది. చివరికి భ్రమలో కూడా కూరుకుపోతుంది.ఇలాంటి సర్వ కాలికమైన సత్యాన్ని తెలుపగలగడమే రుూ నవలని అపూర్వమైన నవలగా మారుస్తుంది.
సంభాషణా శైలి కూడా రుూ నవలలో మిగతా నవలలకంటే విభిన్నంగా కన్పిస్తుంది. ప్రతి పాత్రా మాట్లాడిన తర్వాతనో, మాట్లాడేముందో తన మనోభావాల్ని లోతుగా విశే్లషణ చేసుకుంటుంది. ఇటువంటి పద్ధతి, చదివించే గుణానికి కొంత అడ్డంకిగా భావించవచ్చు. కాని అతిగా చిత్రించని పాత్రలూ, నాటకీయతలేని సంభాషణలూ, ఎంతో సంయమనంతో కాల్పనిక ధోరణి లేని కథా కథన విధానమూ కృష్ణారావుగారి శిల్ప చాతుర్యానికి వనె్నలు తొడుగుతాయి.
ఈనలలోని పాత్రలు కొన్ని భావాలకు ప్రతీకలుగా పరిగణించవచ్చుననే అభిప్రాయం ఒకటి వుంది. నిజానికి రుూ పాత్రలు నిత్య జీవితంలో తటస్థపడే పాత్రలే.
వాసుదేవశాస్ర్తీ, రామారావు పాత్రల ద్వారా రుూ అనైతిక ప్రపంచానికి నిష్కృతి లభిస్తుందని సూచనప్రాయంగా తెలుస్తుంది. సమస్యలు ప్రారంభమైన వేళ వాటిని ఎదుర్కోకుండా, వాసుదేవశాస్ర్తీ నగరానికి వెళ్లిపోవడం ఒక పలాయనవాదాన్ని సూచిస్తుందనుకునేవారు కూడా ఉన్నారు. అయితే సంస్కరణలూ, మానవత్వమూ మరొక చోటునుండి ఆరంభించి, చివరికి ఆరంభించిన చోటుకు తీసుకురావచ్చుననే వ్యూహాత్మకమైన మార్పుని కథకుడు యిక్కడ ధ్వనిస్తున్నాడని తలపోయవచ్చు. చాలా రకాలుగా సంతృప్తిని కలిగించే సోషల్ డాక్యుమెంట్‌గా కీలుబొమ్మలు నవలను పరిగణించవచ్చు.

-సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-డి.కేశవరావు