వినమరుగైన

ఎంకి పాటలు - నండూరి వెంకట సుబ్బారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావములోను, భాషలోను పాత పాటలలోని యాస, స్వచ్ఛత కొత్త పాటలలో కొరవడ్డాయి. ఈ మార్పును సమర్థించుకుంటూ శ్రీ నండూరివారు ‘‘ఏ యెడను మార్పు సహజం. మార్పు గుణమున కాయెనా, దోషమున కాయనా, అను విషయమును సహృదయ లోకమే నిర్ణయించాలి’’ అని తమ కొత్త పాటల పీఠికలో విన్నవించుకున్నారు.
యెంకి పాటల్ని ఆకాశానికి యెత్తినవారూ వున్నారు. అవేం పాటలని ‘గాలి దుమారం’ రేపినవారూ ఉన్నారు. కావ్య వ్యాకరణ తీర్థులైన శ్రీ పంచాగ్నుల ఆదినారాయణగారు యెంకి - నాయుడు బావలను రతీమన్మథులతోను, శ్రీ వేదం వేంకటరాయశాస్ర్తీగారు రంభా నలకూబరులతోను, శ్రీ పురాణం సూరిశాస్ర్తీగారు జీవాత్మ-పరమాత్మలతోను పోల్చారు. శ్రీ పొక్కులూరి లక్ష్మీనారాయణగారు మాత్రం వీరిని సంకర దంపతులని అధిక్షేపించారు. ఎవరెంతగా విమర్శించినా యెంకి పాటల సాహిత్య సౌరభం కలుషితం కాలేదు.
‘‘యేటి కడుపున దాగి తోట నిదురోయింది’’
‘‘యెనె్నలంతా మేసి యేరు నెమరేసింది’’
‘‘నా యెనక యెవరోను నడిసినట్టుంటాది’’
‘‘గాలికైనా తాను కౌగిలీనన్నాడు’’
‘‘యెనె్నలల సొగసంత యేటి పాలేనటర’’
వంటి మధురస నిష్యందమైన భావనలు, కరుడుగట్టిన సంప్రదాయవాదుల చేత కూడా ఆశిరఃకంపన చేయించక మానవు.
ఆకాశవాణి ద్వారా వివిధ రాగాలలో లయబద్ధంగా ప్రసారితమైన రుూ యెంకి పాటలు అశేష జనవాహినిలో విశేషమైన ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి. పాత పాటలను శ్రీ పారుపల్లి రామకృష్ణయ్యగారు, కొత్త పాటలను శ్రీ మందాళ జగన్నాథరావుగారు స్వరబద్ధం చేశారు. శ్రీమాన్ వేదాల తిరువేంగళాచార్యులు గారి వంటి పండితులే తమ ‘ఆంధ్ర ధ్వన్యాలోకము’లో రుూ పాటలను ఉదాహరణలుగా స్వీకరించారంటే యెంకి పాటల విలక్షణత్వం యెంతటి విశిష్టమైందో మనకు విశదవౌతుంది. వైతాళికులు అనే ఆధునిక కవితా సంకలనాన్ని అందించిన శ్రీ ముద్దుకృష్ణ గారి మాటల్లో చెప్పాలంటే ‘శ్రీ నండూరివారు తమకు సాక్షాత్కరించిన కవితను అందుకోవడంలో బంధాలను తెంచివేశారు. నియమాలను తోసిపారవేశారు. భావంలో, భాషలో అన్నిటా ఎర్రబావుటాను ఎగురవేశారు. అవును మరి! కేవలం అగ్రవర్ణం వారే కావ్యాలలో నాయికా - నాయకులుగా చెలామణి అవుతున్న సమయంలో పల్లీయులైన యెంకీ - నాయుడు బావలను కవిత్వానికి ఆలంబనంగా స్వీకరించడం విప్లవమే. వ్యవహారిక భాషనే నొసలు చిట్లించి చూస్తున్న రోజుల్లో ‘తూర్పు కాపు యాస’లో పాటలు వ్రాయడం సాహసమే! అంతటి విప్లవాన్ని సాధించారు కాబట్టే శ్రీ నండూరి వారు తమ ఒకే ఒక్క రచనతో అక్షర సామ్రాజ్యంలో అజరామరమైన కీర్తిని సంపాదించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన యెంకి పాటలు ఆధునికాంధ్ర సరస్వతికి అక్షర మణిహారాలు! నవ్యాంధ్ర గేయ వారదకు మృదు పద మంజీరాలు!!
-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కె.వి.ఎస్.ఆచార్య