వినమరుగైన

అపస్వరాలు - -శారద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరుణమూర్తి డబ్బులెగ్గొడతాడు. మృత్యుంజయ శాస్ర్తీ రంగయ్యకి తెలుగే రాదని ఉద్యోగం వూడపీకిస్తాడు. అన్ని కష్టాలలోనూ తాను చేస్తున్న భాగవత రచన పూర్తిచేయాలి. కళ్ళు కనిపించవు. అయినా కూతురికి చెప్పి రాయిస్తూ వుంటాడు.
వసంతం కోసం వచ్చి మృత్యుజయశాస్ర్తీ, అమాయకురాలైన రత్తమ్మను లోబరచుకోవాలనుకుంటాడు. వరదరాజులు మృత్యుంజయశాస్ర్తీ పట్ల యముడై రత్తమ్మను కాపాడతాడు. పైగా పిల్లనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్న ప్రెస్ వర్కర్‌కి అప్పగించి కాపాడుకోమని చెపుతాడు. వసంతం దగ్గరకు పోనీయవద్దంటాడు.
వరదరాజులు స్నేహితుడు ఏడుకొండలు జేబుదొంగ. వీళ్ల ముఠా సంపాదించిన దానిన మొగల్రాజపురం కొండలమీద మండపం దగ్గర పంచుకుంటూ వుంటారు. ఒకరోజు ఆయన జీతం డబ్బుల్ని ఏడుకొండలు కొట్టేస్తాడు. వరదాజు అది రంగయ్యగారిదని తెలిసి తిరిగి ఇచ్చేద్దామనుకుంటాడు. కానీ తిండికి లేని తక్కిన సహచరుల్ని శాసించలేక వూరుకుంటాడు. కూతుర్ని కాపురానికి పంపలేక, భాగవతం పూర్తికాక రంగయ్యగారికి మతి చలిస్తుది. చూపు పోతుంది.
వారి ఇంట తినే వారాలబ్బాయి, ఒకరోజు ఏడుస్తూ అక్క చనిపోయిందని చెబుతాడు. దీనికి కారణం ఆఅమ్మాయి చావుబ్రతుకులమధ్య నున్న తండ్రికి వైద్యం చేయించటం కోసం పెళ్లి గొలుసు అమ్మేస్తుంది. దానికి నిండు గర్భిణీ అయిన ఆమెను భర్త పొట్టమీద కాలితో తంటాడు. ఆమె చచ్చిపోతుంది. ఇది విన్న జయకు ఫిట్స్ వస్తాయి. దీన్ని చిత్రిస్తాడు సదానందం.
జయకు వైద్యం చేసే డాక్టర్ వీరభద్రరావు సదానందాన్ని అభిమానించి కాంపౌండర్‌గా పెట్టుకుంటాడు.
శోభనానికి ముహూర్తం పెట్టినా ఐదు వందల బాకీ తీరదు. ఆ సందర్భంగా త్రయంబకరావు అక్క జీవితంలో మొదటిసారి తమ్ముడిని తండ్రి మాట కాదనేటట్లు చేస్తుంది. అయితే అత్తగారి సూటిపోటి మాటల వలన భయం తిరగదోడి జయకు ఫిట్స్ వస్తుంటాయి.
ఏడుకొండలికీ, వరదరాజులుకీ దొంగనోట్లు అచ్చేసేవాళ్లు తారసపడతారు. అచ్చువేయటం వాళ్ళ వంతు ఆరబెట్టటం వీళ్లవంతు. వరదరాజులు, ఏడుకొండలు నోట్లు ఆరబెట్టడానికి నోట్లు తరలించాక, అచ్చేసిన వాళ్లు పోలీసులకి దొరికిపోతారు.
ఈ డబ్బుతో వరదరాజులు, ఏడుకొండల్ని తీసుకొని మదరాసు చెక్కేస్తాడు. అయితే అతడి నీతి అతనికున్నది. జైలునుండి బయటపడ్డాకైనా వాళ్ల డబ్బు వాళ్లకివ్వాలి. తన వాటా తన తోటి వాళ్లకి పంచాలి. వెంటనే అలా చేస్తేరహస్యం బయటపడుతుంది. కనుక మద్రాసు వెళ్తాడు.
తిరిగి వచ్చాక ఏడుకొండలి చేత టీకొట్టు పెట్టిస్తాడు. ఏడుకొండలకి నచ్చకపోయినా దాన్నొక సత్రంలా చేసేస్తాడు. బ్రహ్మానందం పనిచేస్తున్న కలప అడితీ యజమాని దాన్ని అమ్మేస్తుంటే చూడనైనా చూడకుండా బ్రహ్మానందం ద్వారా దాన్ని కొనేస్తాడు. అందులోనూ ఇబ్మడి ముబ్బడిగా లాభాలొచ్చి పడతాయి.
వరదరాజులు అద్దెకున్న ప్రక్క పోర్షన్‌లో ఒక పసివాడుంటాడు. మామా అంటూ వదలడు. వాడి పట్ల విపరీతంగా మమకారం పెంచుకుంటాడు. అదీ పేద కుటుంబమే. మధ్యతరగతి నీతికి నిలువెత్తు ప్రతిబింబం ఆ కుటుంబం. జబ్బు చేస్తే చూపించటానికి డబ్బులుండవు. వరదాజులిస్తానంటే తీసుకోవటానికి మొహమాటం. అవసరాలు తీరవు. అప్పులు తీసుకోరు.
వ్యాపారం దొంగనోట్ల చలామణీకి అవసరం. ఇది తెలిసే వరదరాజులు టీ కొట్టూ, కలప అడితీ ఏర్పాటుచేసుకుంటాడు. ఇల్లు కొంటాడు. మృత్యంజయశాస్ర్తీ ద్వారా కనకలక్ష్మి అనే నటిని చేరదీస్తాడు. అడిగినదల్లా ఇస్తాడు. లైంగిక సంబంధం వుండదు. ఏది ఏమైనప్పటికీ విలాసవంతమైన జీవితం గానీ, ఇల్లు గానీ, వ్యాపారాలు గానీ, చేరదీసిన కనకవల్లిగానీ అతడికి శాంతినివ్వలేదు. మృత్యుంజయశాస్ర్తీ, కరుణమూర్తీ ప్రోత్సహించగా ఎన్నికలలో పోటీ చేస్తాడు.

-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పరుచూరి రాజారామ్