వినమరుగైన

అపస్వరాలు -శారద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మిడీలేని ఆదర్శవాది సదానందం కూడా పోటీ చేస్తాడు. వరదరాజులకి తెలియకుండా అతని మనుషులు సదానందం బుర్ర పగలకొడతారు.
ప్రభుత్వాసుపత్రిలో వరదరాజులు కుష్ఠువ్యాధితో చావబోతున్న వసంతాన్ని చూస్తాడు. ప్రాణాధికంగా ప్రేమించే పసివాడు చిన్నా ఆఖరి శ్వాసల్ని చూస్తూ జీవితంలో మొదటిసారిగా కన్నీరు పెడతాడు వరదరాజులు. తన దగ్గరున్న ఎవర్నీ రక్షించలేకపోయింది. మరెందుకీ డబ్బు అని ప్రశ్నించుకుంటాడు. మనశ్శాంతినిచ్చే చిన్నా పోయాక మిగిలిందొక్కటే. పాత రోజుల్ని తలుచుకుంటూ మొగల్రాజపురం కొండమీది కెళ్తాడు. వెదుక్కుంటూ వచ్చిన ఏడుకొండల్నీ, బ్రహ్మానందాన్నీ తరిమేస్తాడు. వాళ్ళు వెళ్లి వలంటీర్లని తీసుకొని కార్లో వస్తారు అతణ్ణి తీసుకువెళ్లాలని. కానీ వరదరాజులు లేడు. తరువాత ఎవరికీ కనిపించలేదు. స్థూలంగా ఇదీ కథ.
గోడ మీద తుపాకీ వేళ్ళాడుతోంది అని రచయిత రాస్తే కథాంతం లోపల అది పేలే తీరాలి అంటారు పుష్కిన్. ఇది శిల్పపరమైన అంశం. కథకే కాదు నవలకీ అన్వయించుకోదగిన అంశం. అపస్వరాలలో మొగల్రాజపురం కొండమీద మండపం పుష్కిన్ చెప్పిన తుపాకీ లాంటిదే. అక్కడే సదానందం, బ్రహ్మానందాలిద్దరూ సంపూర్ణంగా ఆవిష్కరింపబడతారు. సదానందం ఊహాలోకంలో వుంటే బ్రహ్మానందం భూమిమీద నిలబడి మాట్లాడతాడు. సదానందం శిల్ప సుందరి బొమ్మ గీసి నచ్చక చింపేశానని చెపుతుంటే, ఏదో బి.ఏ అనే రెండక్షరాలు తగిలించుకుంటే గుమాస్తా ఉద్యోగమైనా దొరుకుతుందనీ, ముందు కాలేజీ ఫీజు కట్టే ఏర్పాట్లు చూసుకోమనీ సలహా ఇస్తాడు బ్రహ్మానందం.
ఆ కాలపు యువకులు స్వాతంత్య్రంపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవన్నీ పగటి కలలని కూడా వెంటనే తెలుసుకున్నారు. నిరుద్యోగం పెద్ద సమస్య పూర్తి రూపాన్ని చూపగలిగాడు శారద. ఆ మండపంలోనే వరదరాజులు ముఖ్య కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి. వసంతం, చిన్నాలు చనిపోయినపుడు తనదగ్గరున్న డబ్బు ఎందుకూ కొరగాకుండా పోయినపుడు బ్రహ్మానందాన్ని ప్రశ్నిస్తాడు వరదరాజులు. ‘‘మీరు వసంతానె్నరుగరు కదూ. ఆమె ఇపుడు చావసిద్ధంగా వుంది. ఎందుకు? ఆమె కుష్ఠు పుట్టి అట్లా నరకయాతనపడుతూ మూలుగుతూ పడి వుంది? ఆ..మె నీ స్థితికి ఎవరు తెచ్చారు? ఆమె మగాడికి ఆనందమిచ్చేందుకే పుట్టి, వాళ్లతోనే బతికి, వాళ్ల సరదాల కోసమే ఇపుడు అట్లా చేస్తోంది. ‘‘పంతులుగారూ చెప్పండి? ఈ బతికే అందరు ఆడవాళ్లలాగే ఆమె కూడా ఎందుకు ఒకడితోనే బతకలేకపోయింది? ఆమె పొట్ట నిండటానికి వేరే మార్గమే లేకుండా చేశారేం? ఎవరి ద్రోహమండీ అది?’’ ఉద్రేకంతో మళ్లీ ఇలా అంటాడు. ‘‘మీరు చూశారా? నా చిన్నా, మామా! మామా! అని ఎవరూ నామీద చూపించనంత ప్రేమ చూపించిన చిన్నా! ఈ నిమిషాన ఏం ద్రోహం చేశాడని అట్లా బాధపడుతూ చచ్చిపోతున్నాడు? నేను డబ్బిస్తానంటే వాళ్లు వద్దన్నారు. అభిమాన పడ్డారు తీసుకోవటానికి, వాళ్ల దగ్గర లేదు. ఆనాడే డబ్బుండి వుంటే కుర్రాడు బ్రతికేవాడేమో!.. ఇపుడు? చిన్నా చిన్నా..’’ వరదరాజు ఆగిపోయినాడు. మండపం మీద ఎండ కాంతి పచ్చగా ప్రసరిస్తోంది అంటాడు రచయిత. అది సంధ్యకు సూచన. వరదరాజులు డబ్బు జీవితానికి అది సంధ్య. అన్ని చెప్తున్న వాడిని ఎన్నికల ప్రత్యర్థి సదానందాన్ని ఎందుకు కొట్టించావని అడిగేస్తాడు బ్రహ్మానందం. అతణ్ణి కనీసం ఎరుగను కూడా ఎరుగనని, తాను కొట్టించలేదని చెప్తాడు. శారద రచనల్ని ఇలా వర్ణిస్తే పావర్టీ గ్లోరిఫైడ్ అని వికటాట్టహాసం చేయగల జాతీయ ఖ్యాతినార్జించిన విమర్శక శ్రేష్టులు వున్నారు. దంతహార్మ్యాల్లోంచి తామెన్నడూ చూడని జీవితాన్ని వీళ్ల మూసలోంచి పోసినా ఆదరించగల మీడియా కూడా వున్నాయి. పదమూడవ ఏట బ్రతుకుతెరువు కోసం తెనాలి వచ్చిన తమిళుడు నటరాజన్. సర్వర్‌గారూ, గారెల కళాయి పెట్టుకునీ బ్రతికిన మూర్ఛరోగి. తెలుగునీ, జీవితాన్నీ చదివి నేర్చుకున్నవాడు. ఎవరితో పోల్చగలం? ఇరన్ హీల్ రాసిన జాక్‌లండన్ బాల్యంతోనా అనేది సదసత్సంశయం!
*
-సమాప్తం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పరుచూరి రాజారామ్