వినమరుగైన

అల్పజీవి - రాచకొండ విశ్వనాథశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూనత నుంచి ఆధిక్యతకు చేసే పయనాన్ని నష్టపూరణం అంటాడు ఆడ్లర్. ఈ ఆధిక్యతకు ఈ పయనంలో ప్రతి వ్యక్తి తనదైన విధానాన్ని శైలిని అనుసరిస్తాడు. దీనినే ఆడ్లర్ జీవనశైలి అన్నాడు. సమస్యల పరిష్కారానికి వ్యక్తి అనుసరించే పరిష్కార విధానమే జీవనశైలి.
సుబ్బయ్య తన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో అవలంబించే శైలిని చూస్తే సుబ్బయ్య మనస్తత్వం అర్థమవుతుంది.
సుబ్బయ్య రెండు కారకాలతో బాధితుడయ్యాడు. ఒకటి భయం, రెండోది న్యూనత. ఈ రెండింటిని అధిగమించడానికి విజయవంతమైన జీవనశైలి అనుసరించలేకపోయాడు. ఏ విజయవంతమైన జీవనశైలి అయినా చాలావరకు సామాజిక కారణాల సోషల్ ఫాక్టర్స్‌మీద ఆధారపడి ఉంటుంది. పాపం సుబ్బయ్య విషయంలో అవి అతనికి దోహదపడలేదు.
తల్లి బాల్యంలోనే పోయింది. తల్లి ఏ బిడ్డకైనా పరమాధారం. అది లేని బ్రతుకు గాలిలో తేలియాడుతూ, దేనిమీద కాలూనలేనిది అయింది. అంటే అతడు ఒక రకమైన కారణం తెలియని ప్లవన వ్యాకులత (్ఫ్లటింగ్ అనిక్సిటి)తో బాధితుడయ్యాడు. రెండోది తన చిన్నతనంలో తండ్రితో చీకట్లో వెళ్తుంటే, తనను దూరంగా నెట్టివేసి తండ్రిని ఇద్దరు ముగ్గురు కొట్టిన జ్ఞాపకం అతనిని ఎప్పుడూ మసక మసకగా వెన్నాడుతూనే వుంది. ఆ అనుభవం తాలూకు ఛాయలు అతని అచేతనంలో పాతుకుపోయాయి. ఫ్రాయిడ్ భాషలో చెప్పాలంటే అతడక్కడే స్థిరీభవనం చెందాడు.
మూడోది సుబ్బయ్య సవతి తల్లి క్రూరత్వం అగ్నికి ఆజ్యమైంది. ఈ మూడూ సుబ్బయ్య జీవనవైలి, మూర్తిమత్వ లక్షణాలయ్యాయి. ఈ జీవనశైలిలో ఉన్న సుబ్బయ్య జీవిత చిత్రణమే ఈ నవల.
ఎవరైనా తనలో లేని మంచి వాటిని ఇతరులలో ఊహించుకొని, వారితో తాదాత్మ్యం చెంది, ఒక రకమైన ప్రాతినిధ్య సుఖాన్ని అనుభవిస్తారు. అలాగే మన నాయకుడు సుబ్బయ్య కూడా ఎర్ర చీర మనిషిని, మునీశ్వర్లవారిని, రెండు లేడిపిల్లలను ఊహించుకొంటాడు. వీరంతా అతని ఊహలకు ప్రతీకలు. వీరందరూ అతనిలో నిద్రాణంగా వున్న ప్రేమ, శాంతి, స్ర్తి వాంఛ, చీకూ చింత లేని హాయి అయిన జీవితాలను ప్రతిబింబిస్తారు.
సుబ్బయ్యలోని మూడు ఉద్వేగాలను వెంకట్రావు, గవరయ్య, మనోరమలు ప్రతీకరిస్తారు. వెంకట్రావు ధనాశకు, గవరయ్య లోభితనానికి, మనోరమ కామానికి ప్రతీకలు. నవల వీటి చుట్టూ అల్లుకునే నడుస్తుంది.
సుబ్బయ్య తన న్యూనతాభావగ్రంథి నుంచి కొంతగాకపోయినా కొంతగానైనా బయటపడడానికి బావమరిది వెంకట్రావు, గవరయ్య నౌకరు పోతన్న, ఆఫీసు గుమాస్తా అవధాని, మనోరమలు ప్రోత్సహిస్తారు.
ఈ నవలలో కథ పెద్దగా లేదు. అంతా సుబ్బయ్య పాత్ర చిత్రణే. సుబ్బయ్య నంగిరి పింగిరిగాడు. వట్టి వాజమ్మ, చవట, అసమర్థుడు, తాను చెప్పాలనుకొంది చెప్పలేని, చేయాలనుకొంది చేయలేని అసమర్థుడు. ఒకటి చెప్తాడు, వేరొకటి చేస్తాడు. తరవాత ‘‘అలా చెప్పి ఉండవలసింది కాదు, అలా చేసి ఉండవలసింది కాదు’’ అనుకొంటాడు. అవతలివాని ఉద్దేశం ‘‘ఇదై ఉంటుంది, కాదు అదై ఉంటుంది’’ ఇలా విరోధాలతో ఆలోచిస్తుంటాడు. అతని మనస్సు అతనికి వాస్తవం. దానిని బాహ్య ప్రపంచానికి ఆరోపిస్తాడు. అందుకని సుబ్బయ్య ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోలేడు. అతని మనోవల్మీకం ఒక సాలెగూడు. ఆ గూట్లో అతడు ఇరుక్కుపోయాడు. ఆ గూటి లక్షణం తన ఆత్మన్యూనతాభావం. సుబ్బయ్య లంచం పుచ్చుకొన్నాడు. ‘‘ఇంకా ప్రక్కకి, ఇంకా వెనక్కి ఇంకా వారకి, ఇంకా చాటుకు పోతాం. తప్పుకుపోవాలి. ఎవరెలా ధీమాగా నడుస్తున్నారు? ఎంత ధీమాగా నడిపిస్తున్నారు! ‘‘నేను గూడా ధీమాగా, ధైర్యంగా ఉండగలిగితే’’ అనుకొంటాడు సుబ్బయ్య లంచం తీసుకొన్నాక. లంచం పుచ్చుకొనే ముందు ఊగిసలాట. తెల్లచీర మనిషి టైమ్ అడిగినపుడు తడబాటు.

-అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి