వినమరుగైన

అల్పజీవి - రాచకొండ విశ్వనాథశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవరయ్య బాకీ అడిగి తెమ్మన్నాడని పోతరాజు సుబ్బయ్య దగ్గరకు వచ్చి చెబుతాడు. సుబ్బయ్య తాను ఇవ్వను అని చెప్పడం అసంభవమని భావిస్తాడు. అసంభవమని భావించినదానిని సంభవం చేశాడు. హామ్లెట్ అనుకోకుండా, యాదృచ్ఛికంగా పినతండ్రిని చంపినట్లు సుబ్బయ్యకు అనుమానం ‘‘అలా చెప్పింది తనేనా’’ అని. నేనే, నా నోటితోనే చెప్పాను’’ అనుకొంటాడు. ఇవన్నీ అతని ఆత్మన్యూనతను ప్రదర్శించే సంఘటనలే. ఇంకా నవల నిండా ఇలాంటి సందర్భాలెన్నో ఉన్నాయి. గవరయ్యను సుబ్బయ్య ధిక్కరించడం, మనోరమ కౌగిలి, లాలింపులు, వెంకట్రావు, మనోరమలు, సుబ్బయ్య- గవరయ్యకు రాసిన ప్రోనోటును తిరిగి తెప్పించడం లాంటి సందర్భాలు సుబ్బయ్య జీవనశైలి కొంతవరకైనా మారడానికి తోడ్పడ్డాయి. సుబ్బయ్య ఈ కథకు నాయకుడు. ఊహ తెలియకముందే తల్లి మరణం, సవతి తల్లి క్రౌర్యం, తండ్రిని చీకట్లో ఎవరో కొట్టడం, సుబ్బయ్యకు గుమస్తాగిరి రావడం, క్లాస్‌మేట్ వెంకట్రావు చెల్లెలు సావిత్రిని సుబ్బయ్యకు పెళ్లి చేయడం, సావిత్రి సబ్బయ్యను అసలు మగనిగానే చూడకపోవడం, వెంకట్రావు అవసరానికి, సుబ్బయ్య, గవరయ్య దగ్గర ఐదు వందలు లంచం తీసుకోవడం, సీటు మారడంవల్ల గవరయ్య పని చేయలేకపోవడం, గవరయ్య బెదిరించి నోటు రాయించుకోవడం, అనుకోకుండా మనోరమ అతని జీవితంలోకి ప్రవేశించడం, వెంకట్రావు మనోరమల జోక్యంతో నోటును వెనక్కు తెప్పించడం, మనోరమ లాలన- ఇవీ ఈ నవలలోని ముఖ్యాంశాలు. ఈ అంశాలతో కథను బ్రహ్మాండంగా నడిపించాడు రావిశాస్ర్తీ. కథ బిగి కంటె సుబ్మయ్య అంతర్మథనాన్ని చిత్రించిన తీరు ఒక చైతన్య ధార, సుప్త చైతన్యంతో ప్రభావితమైన భావధార మహాద్భుతంగా ఉంది. ఈనవలను ఎవరైనా అందుకే అభిమానించవచ్చు. మరి దేనికీ కాదు. చేతనా చేతనల మేళవింపు. భూత భవిష్యద్వర్తమానాలు సుబ్బయ్య ఆలోచనలో అంతర్గతంగా కలగాపులం కావడం అద్భుతంగా ప్రదర్శించారు రావిశాస్ర్తీ. ‘‘మంచి, పిరికి ఒక చోట మనలేవు. ఏది మంచికి హాని కలిగిస్తుందో, ఏది చెడ్డకు ఉపకారం చేస్తుందో, రచయిత ఆలోచించి రాయాలంటాడు శాస్ర్తీ. పిరికివాడు మంచివాడు కాలేడు. మంచిగా ఉండాలంటే ధైర్యం కావాలి. నేను రాసేదంతా అందుకే’’ అంటాడు రావిశాస్ర్తీ. సుబ్బయ్య పిరికితనం కొంతమేరకు తగ్గింది. మరి అతడు మంచి వాడయ్యాడయా? తెలుసుకోవడానికి అల్పజీవిని అడగండి.
-సమాప్తం

-అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి