వినమరుగైన

కాలాతీత వ్యక్తులు- పి. శ్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కల్యాణి ఒక ఇందిర-
సంక్లిష్టమవుతున్న కాలం, విలువల పతనం, దారిద్య్రం, జీవితం అంతట్నీ ఒక్కలా చుట్టుముట్టుతున్న నైరాశ్యం- పోగొట్టుకోవటం, దుఃఖం, భీతి, మరణం. ఒడ్డు తెలియని ప్రవాహం- ఏ హెచ్చరికలూ లేకుండా ఒక్కసారిగా ప్రవాహంలోకి తోసివెయ్యబడటం-
ఎట్లా రియాక్టు అవుతారు?
ఒక కల్యాణి లాగానా? ఒక ఇందిర లాగానా?
కల్యాణిని మీరు బాగా ఎరుగుదురు! లలిత లలితంగా, ముగ్ధలా, బేలగా, మీ విశాలమైన బాహువుల్లో ఒదిగిపోయి, రొమాంటిక్ స్వైరకల్పనల్లో రంగుల చిత్రంలా తళుక్కుమనగల పాత్ర- పాపం అన్నీ కష్టాలే, బోలెడంత ఆత్మాభిమానం- గుర్తొస్తుందా మీకు! వందలాది వేలాది కల్యాణుల్ని గత నలభై యేళ్లుగా దేశం పట్టనంతగా విస్తరిల్లి- సెక్రటరీ, శంకుతీర్థం లాంటి నవలలతో మొదలై అభిలాష, వెనె్నల్లో ఆడపిల్ల వగైరా నవల దాకా, నాయికలందరూ ఈ కల్యాణికి రోల్ మోడల్సే!
మరి ఇందిరా?
‘ఇందిరా’ నా అని నొసలు చిట్లించే ఇందిర, ఐడెంటిఫై అవడానికి ఇష్టపడని ఇందిర- పురుషాధిక్యత సమాజం ఏర్పరచిన చట్రాలలో, ఫ్రేములలో ఇమడడానికి ఇష్టపడని ఇందిర- పాతివ్రత్యం, ప్రేమ, అర్చించుకోవడాలు, అంకితమవటాలు- ఈ ట్రాష్‌ని, ఈ నానె్సన్స్‌నీ, ఫెడేల్‌మని కాలితో తనే్న- ఈ ఇందిరను మీరు ఎరుగరు; గుర్తుపట్టడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడరు! ఇందిరను ఇష్టపడే రోజులు ఇంకా మనకు సమీపంకాలేదు! ఇందిర ఒక ఆశ, పోరాటం, ఒక సమగ్రమైన స్ర్తిని- ‘‘నీతో ఎంత దూరం రమ్మన్నా వస్తానుగానీ... ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను! అర్థంచేసుకొని- నన్ను నా యిష్టం వచ్చినట్లు వూపిరి పీల్చుకోనిస్తావా...’’అని అడగగలిగే ఇందిర- ఇవాల్టి ‘ఆకాశంలో సగం’అంటూ ఉద్యమిస్తున్న ఆధునిక స్ర్తికి ప్రోటో టైప్!
ఒక కల్యాణి, ఒక ఇందిర-
త్రోసుకొచ్చే జీవితపు ప్రకంపనలకు ఎట్లా రియాక్టుఅయ్యాడు! ఈ విపత్తు మనిషి రూపంలోనో, ప్రేమ రూపంలోనో, అనుభూతి రూపంలోనో- ఎదురైతే ఎట్లా స్పందించారు? ఏ కంక్లూజన్స్, ఏ ముగింపుని, వాటి ద్వారా ఏ మెసేజ్‌ని అందించారు?
ఇప్పుడొక చిన్న ప్రయోగం! టెస్ట్! అనగనగా పందొమ్మిది వందల యాభై లేదా కొద్దిగా ముందు, ప్రయోగశాల ఆంధ్రదేశం- ఇంకా కరెక్టుగా- చెప్పాలంటే విశాఖపట్టణం- ఈ ప్రయోగంలో వేరియబుల్స్ కల్యాణి, ఇందిరలు నాన్ వేరియబుల్స్‌గా ప్రకాశాన్ని తీసుకుందాం!
ప్రయోగం నెంబర్ ఒకటి! కల్యాణి- ప్రకాశంల ప్రేమకథ!
మెడికో ప్రకాశానికి, ఒక ఉదయం పూట తనుండే అద్దె యింటిలో మెరుపు మెరిసినట్లుగా కల్యాణి కనబడి- గంభీరంగా, అట్టే మాట్టాడకుండా టచ్ మీ నాట్ లా, అచ్చం మన తెలుగు నవలా నాయికలా- ఈ కల్యాణికి ఒక దుఃఖభరితమైన గతం. పల్లెటూరు, జబ్బుపడ్డ తండ్రి, కన్నీటి చారికలాంటి బాల్యం, డాక్టరు కోర్సు చదవాలనే ఫలించని కల ఉన్నాయి. ప్రకాశానికి ఈ అమ్మాయి సహజంగానే నచ్చింది. నచ్చదా మరి! అంత అందం, అంత ఆత్మాభిమానం, ముఖం చుట్టూ ‘ఆరా’లా దిగులు వలయం- సహాయం చేయడానికి వీలుగా కష్టాలు, జబ్బులు- కల్యాణికి టైఫాయిడ్. ప్రకాశం అచ్చం కథానాయకుడిలాగే రాత్రింబవళ్లు సేవచేసి- కళ్యాణి కళ్లలో కృతజ్ఞతలు. అతనంటే ఇష్టం- పొందగలిగాడు. ఇద్దరూ కలిసి బీచ్‌కెళతారు. ఇద్దరికీ తమతమ కళ్లలో దుఃఖపు తడి, జీవితంలో కష్టాల బరువు ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రకాశాన్ని ఒక మహావృక్షంలా భ్రమపడి- లతలా లిఖిత లలితంగా అతన్ని అల్లుకుపోయింది కల్యాణి.
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వి.చంద్రశేఖరరావు