వినమరుగైన

కాలాతీత వ్యక్తులు- పి. శ్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజానికి ప్రకాశం భీరువు! చాలామంది యువకుల్లాగే అవకాశవాది! సుఖవాది! పోరాటం, ప్రతిఘటన అంటే భయపడే వెనె్నముకలేని జీవుల జాతిలోని వాడు! కల్యాణికి షరామామూలుగానే కష్టాలు త్రోసుకువచ్చాయి. తండ్రి పోయాడు! ఊరంతా అప్పులు! ఒంటరితనం! ఓదార్పు కోరే కష్టాలు!
సాయం రమ్మంటే ప్రకాశం అనే భీరువు బిగుసుకుపొయ్యాడు! ‘వెళ్లి కల్యాణిని ఆదుకుంటే- తనను పెంచిపోషించే కోపం వస్తుందేమో! అదేమో! ఇదేమో!’ అంటూ కల్యాణికి దూరంగా జరిగాడు. కల్యాణికి విస్ఫోటనమంత బలమైన దెబ్బ. ‘‘కన్నీరెందుకు కల్యాణీ! నేనుండగా నీకు దుఃఖమా!’’ అన్న ప్రకాశమేనా? అని దుఃఖపడి, ‘్ఛ ఇతనూ మనిషేనా?’అని అసహ్యించుకొని ‘అన్నివిధాలా నష్టపోయాను!’- దిగాలుపడుతుంది! జీవితం అంతా మునిగిపోయినట్లుగా కుంచుకుపోయింది.
‘‘ఏమిటీ మనుష్యులు- ఇట్టే మమతలు పెంచేసుకుంటారు! ఇట్టే కన్నీళ్లు కార్చేస్తారు. దౌర్బల్యాన్ని చూసి బాధపడటం ఒక దౌల్బల్యం!’’ అనగలిగే అమ్మాయి ఈ ఇందిర- హఠాత్తుగా అలా బీచ్‌వైపు వెళ్దాం పద అని ఆజ్ఞాపించగల అమ్మాయి. రిక్షాలో పక్కనే కూర్చోడానికి భయపడే ప్రకాశాన్ని- ‘‘ఫరవాలేదులే ఇంతలోకే నా పాతివ్రత్యానికేం భయం రాదు! ఇద్దరం కూర్చుని పోదాం!’’అనగలిగే ఇందిర- పారసైట్ లాంటి తండ్రి- ఎవర్నీ లెక్కచేయనితనం- సగంలో ఆపేసిన చదువు, చిన్న ఉద్యోగం- అరమరికలు లేకుండా స్నేహహస్తాన్ని చాటగల ఉదారత- ప్రకాశంతో బీచ్‌కి షికారుకు వెళ్లగలదు! అట్లాగే ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తితో సెకండ్‌షోకి వెళ్లగలదు. జీవితం ఎప్పుడూ మధురంగా పలవరించే పాటలా ఉండాలనుకునే ఇందిర-
‘‘గడియ గడియకి కాళ్లుచాపి కూర్చుని ఏడవడం నాకు చేతకాదు!’’అనే ఇందిర- అంత బరువులోనూ, నేను బలపడి ఇంకొకరిని బలమివ్వాలనే తత్త్వం నాది!’’ ఇందిర ప్రకాశానికి ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది- ఇది కాదు బ్రతికే విధానం అంటూ- పిరికితనం, అణచివేసిన ఆశలతో నిండిన ప్రకాశంలో- కొత్త చిగురులేవో వేయాలనే- ‘‘అన్ని విధాలా ఏకాకిగా నన్ను విడిచిపెట్టేరు’’అని రోధించే ప్రకాశానికి ‘‘నేనెక్కడికిపోతాను! నువ్వు నా వాడివి!’’ అంటూ స్నేహహస్తాన్ని ఇస్తుంది.
ప్రకాశానికి మామయ్యనే యములాడు. అతణ్ణి, అతడి తల్లి జీవితాన్ని శాశించే కర్త, కర్మ, క్రియ- ఆ మామయ్యను ఎదిరించలేడు! ప్రకాశం ప్రేమ పురాణాల్ని ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా తెలుసుకొన్న మామయ్య- ముక్కుపట్టుకొని పల్లెటూరుకు లాక్కువెళతాడు. ఎనిమిది వేల కట్నంతో రాజమండ్రి అమ్మాయితో లగ్నం కుదురుస్తాడు. ఎదిరించలేడు, ఎదిరిస్తే చదువు ఆగిపోతుందనే భయం- నిశ్చితార్థం అయినాక, పారిపోయి దొంగలా ఇందిర దగ్గరకు వస్తాడు. ఆమె ముందు దీనంగా మోకరిల్లి- ‘‘అలా ప్రాధేయపడి నా జాలిని రెచ్చగొట్టి నువ్వేమీ సంపాదించలేవు ప్రకాశం! అన్ని హక్కులూ ఉండే మేనమామను ఎదిరించలేని పిరికివాడివి. అచ్చంగా చింతామణిలో భవానీశంకరంలా మాట్లాడుతున్నావు! నువ్వసలు పుట్టుకతోనే సగం మనిషివి. మొదటినుంచీ బీటలువారిన వ్యక్తిత్వమే నీది. మొదటి పరీక్షలోనే తలవంచేసి లొంగిపోయిన వాడివి! కొన్ని అనుభవాల తరువాతనైనా ఒక మనిషిలా ప్రవర్తిస్తావనుకున్నాను! నీకూ నాకూ గుడ్‌బై!’’అనేసి దిగ్గున లేచి వెళ్లిపోయింది ఇందిర.
ఈ ప్రయోగాల ఫలితం- ఇన్‌ఫెరెన్స్ ఏమిటని అడగవద్దు. పందొమ్మిది వందల యాభైనాటి ప్రయోగ పరిస్థితులు- ఇవాళా ఉన్నాయి. ప్రకాశం అనే వానపాములూ ఉన్నాయి.
ఇవాల్టి స్ర్తి ఎలా రియాక్టు అవుతుంది?
కల్యాణిలానా? ఇందిరాలానా? సమాధానం మన అభిరుచులు, సంస్కారం, మానవ సంబంధాలపై, స్ర్తి పురుష సంబంధాలపై మనకున్న అవగాహనలపై ఆధారపడి ఉంటుంది! ఇంతకూ కాలాతీత వ్యక్తి ఎవరు?
సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వి.చంద్రశేఖరరావు