వినమరుగైన

పాకుడురాళ్లు - రావూరి భరద్వాజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రంగం అంటే సిరులు పండే స్వర్ణలోకం అనుకుంటారు అమాయక చక్రవర్తులు. నిజమేనా? ఏమో, కావచ్చు, కాకపోవచ్చు. సినీ మాయలోకం మాత్రం అవునంటారు లోకవృత్తం ఎరిగినవారు.
తెరమీద కదిలే, మాట్లాడే బొమ్మలు వాస్తవాలు కావు. తళుకు బెళుకులు సంతరించుకున్న మానవ ప్రతిరూపాలు. వెలుగునంటి పెట్టుకుని వుండే నీడలు.
అందుకే సినీ జగత్తును వరల్డ్ ఆఫ్ మేక్ బిలీవ్ అనీ, నిర్మాతల్ని డ్రీమ్ మర్చంట్స్ అనీ సివిక్స్ అంటే దోషాల్ని అనే్వషించేవారు ఆరోపిస్తుంటారు. అంటే భ్రమలు కల్పించే ప్రపంచం, అనౌచిత్యాలను ఔచిత్యాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా భ్రమింపజేసే ప్రపంచం. ఈ లోకాన్ని ఏలేవారు, చక్రం తిప్పేవారు డ్రీమ్ మర్చంట్స్ అంటే వర్ణవైభవం నిండిన కలల్ని అమ్ముకునేవారు. ఈ స్వప్నసీమలో విహరిస్తూ, తనను తాను మరచి పరిసరాల్ని మరచి, తెరమీది పాత్రలతో తాదాత్మ్యం చెంది, వివశుడవుతాడు సామాన్య ప్రేక్షకుడు. అలాంటి ప్రేక్షకుల దృష్టిలో నాయకులందరూ సకల కళావల్లభులు. నాయికలందరూ జగదేక సుందరీమణులు.
ఐతే అలాంటి తెర వేల్పుల తెరవెనుక జీవితాలు పూలపాన్పులు కావు.. సముద్రం తనగర్భంలో బడబాగ్నులు దాచుకున్నట్టు, వారు తమ జీవితాల్లోనూ ఎన్నో అగ్ని గుండాలను ఇముడ్చుకుని వుంటారన్నది చేదు నిజం. ఎందుకంటే సినిమా రంగం మొసళ్లు, తిమింగలాల వంటి జలచరాలు తిరుగాడే భయానక జలధి. కాదంటే క్రూరమృగాలు, సరీసృపాలు సంచరించే గహనారణ్యం. ఇలాంటి దుర్భర వాతావరణంలో తన అందచందాలు పణంగా పెట్టి, తన ప్రజ్ఞ, అభినయ చాతుర్యాల ఆసరాతో ఒక్కొక్క మెట్టుగా ఎదగి, కీర్తి శిఖరారోహం చేసిన మంజరి అనే అపూర్వ నటి జీవిత చరిత్రే రావూరి భరద్వాజగారి బృహత్ నవల పాకుడురాళ్లు.
మంగమ్మ అనే రంగస్థల నటి అందాల సినీతార మంజరిగా వికాసం పొందిన తీరునూ, ఆ పరిణామక్రమాన్నీ కళ్లకు కట్టినట్టుగా చిత్రించిన నవలను మంజరీ మధుకరీయంగా వర్ణించవచ్చు. 1963లో ప్రచురించబడి, నాలుగు పునర్ముద్రణలకు నోచుకున్న ఆ నవలలో మద్రాసు ఫిలిం రంగం యవ్వనదశలో వెలుగొందిన అప్సర మంజరి అయితే, ఆమె చుట్టూ మూగిన మధుకరాల వంటి వ్యక్తులు ఆమె సినీ జీవితం మీదనే గాక ఆమె వ్యక్తిగత జీవితంమీద కూడా బలమైన ప్రభావం చూపారు. ఆ జీవిత ద్వయానికి రంగులు పులిమి, కాలుష్యాన్ని అంటగట్టారు.
అలాంటివారిలో చలపతి ఒకడు. అలనాడు పక్షీంద్రుడిగా వ్యవహరించబడే వ్యక్తిలాంటివాడు ఆ చలపతి. మంగమ్మ వురఫ్ మంజరిని సినిమా ప్రలోభానికి లోనుజేసి, ఆమెను మద్రాసుకు తరలించి, ఆమె సౌందర్యాన్ని తాకట్టుపెట్టి, తన పబ్బం గూడా గడుపుకుని, ఆమె చరమదశ వరకూ మంజరి నంటిపెట్టుకుని వుండిపోయిన వ్యక్తి చలపతి. నేస్తంగా, హితోపదేశకుడిగా, మార్గదర్శిగా, ప్రియుడిగావుంటూ క్రమేణా సచివుడిగా, కార్యదర్శిగా మారి, ఆమె అంచెలంచెలుగా తారాపథం వేపు దూసుకుపోతూ వుంటే, తాను తరుగుతూ వచ్చాడు.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వి. చంద్రశేఖర రావు