వినమరుగైన

దీపావళి -వేదుల సత్యనారాయణ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలా ఎన్నో కవితా ప్రక్రియలు ఆయనలో ఉద్దీపన చెందాయి. ప్రక్రియలే అలా వుంటే ఆయన నేర్చిన భాషలూ అలాగే ఉన్నాయి. సంస్కృతం, హిందీ, బెంగాలీ భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించగలిగారు. రవీంద్రుని కవితలు, బెంగాలీ నవలలు తర్జుమా చేశారు. ఏడు పదుల వయసులో కూడా వంగని హరివిలై ఒకానొక వంగ రచనకు అనువాద భిక్షనందించారు.
నవ్య సాహిత్యంలో వీరి స్థానం అజరామరం. మూడు దశాబ్దాల కాలంలో పసిడి పంట పండించిన భావ కవితాకేదారంలో వీరి కృషీవలత్వం ఎన్నదగినది. ఆర్ద్రగుణం, మైత్రీభావం అణువణువునా వీరిలో ప్రతిఫలించటంవలన వీరి కవితలు మరింత వనె్నకెక్కాయి. అకలంక దేశభక్తి వీరి లేఖినికి ప్రాణవాయువు.
***
భావకవిత్వం బలంగా పెనవేసుకొన్న రోజులవి. నారు రాయప్రోలు నాటితే, నీరు కృష్ణశాస్ర్తీ పోశారు. వేదుల, నాయని, కొడాలి, అబ్బూరి, నండూరి, బసవరాజు, వేంకట పార్వతీశ కవులు, దువ్వూరి, విశ్వనాథ, పింగళి- కాటూరి, జాషువా, తుమ్మల, తల్లావఝుల, బాపిరాజు- ఇలా ఎందరో దానిని మరింత పెంచి పోషించారు.
భావ కవిత్వాన్ని అనేకమంది అనేక రకాలుగా నిర్వచించారు. అసలు భావకవిత్వం- ఆంగ్ల విద్యా ప్రభావంతో ఈ నేలపైకి అడుగుపెట్టిందని విమర్శకుల అభిప్రాయం. రొమాంటిక్ పొయిట్రీగా కవులు దానిని భావించారు. 1930 ప్రాంతంలో ఈ భావకవిత్వం కొత్తచిగురులు తొడిగింది. దీనిని ఆరు రకాలుగా విభజించి వింగడించారు డాక్టర్ నారాయణరెడ్డి. తమ సిద్ధంత గ్రంథంలో - 184 పేజీలలో, ఒకోసారి ప్రణయమో, ప్రణవమో తెలియని అంతర్వాహినులనేకం ఈ భావ కవిత్వంలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ ప్రణయం ఒక ఉదాత్తమైన పరిణామ దశకు చేరుకోవటం మనకు తెలుస్తుంది. అంతవరకు స్ర్తిని అంగాంగ వర్ణనలతో ముంచెత్తిన కవితాలోకం- తన దృష్టిని మానవీయ మార్గంవైపు మళ్లించింది. ఆ కొత్త కోణంలో స్ర్తి ఒక ప్రకృతి మాతగా ఆరాధింపబడింది. ప్రాణసఖిగా ప్రస్తుతింపబడింది. దేవతగా కీర్తింపబడింది. స్వచ్ఛమైన ప్రణయం మధ్య అమలిన శృంగారం ఆవిష్కరింపబడింది. వేదుల వారి విషయంలో అయితే ప్రేయసి, ఒకోసారి తల్లిగా కూడా దర్శనమిచ్చింది. ఆయన స్ర్తికి ప్రసాదించిన స్థానం అటువంటిది.
భావకవిత్వం వ్రాయటం ఒక ఎత్తయితే, గానం చేయటం మరొక ఎత్తుగా ఆనాడు భావింపబడింది.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రసరాజు