వినమరుగైన

ప్రజల మనిషి -వట్టికోట ఆళ్వారుస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విషయాన్ని ఆళ్వారుస్వామి గారు చాలా వాస్తవికత ప్రాతిపదికగా చిత్రించటానికి ప్రయత్నించారు. మనకు సాధారణంగా ఇలాంటి నవల లొచ్చినపుడు వాటిలో ఎక్కువ కాల్పనికమైనటువంటి అంశం చాలా వుంటుంది.
ముఖ్యంగా ఆళ్వారుస్వామిగారి ఈ ప్రజల మనిషి, దీని అనంతరం వచ్చినటువంటి గంగు వీటిని తీసుకుంటూ తెలంగాణలో ఆ రోజు వున్నటువంటి దుస్థితే కాకుండా, ఆ దుస్థితినుంచి బయటపడటానికి, అలాగే తమ శక్తిని గుర్తించటానికి, ప్రజలలో వివిధ వర్గాలకు ఏ విధంగా ఆ పరిస్థితి ఉపయోగపడిందీ మనకర్థమవుతుంది. అందుకనే మహాకవి దాశరధి చెప్పినట్టు ఒక్క తెలంగాణా ఉద్యమంలోనే కాకుండా అన్నిచోట్లా కూడా ప్రజల తరఫున వున్నటువంటి నాయకులు తయారుకావటానికి కొంతకాలం పడుతుంది. వారికి కూడా వున్నటువంటి పరిమితులు పోవటానికి ఇంకా అనుభవం తోడ్పడుతుంది.
అప్పటివరకు దోపిడీ వ్యవస్థలో చితికి, చివికిపోయి తాము నిస్సహాయంగా వున్నామనుకున్న సామాన్య ప్రజ శక్తిమంతులవటానికి, సాహసోపేతమైన కార్యాలు చేయటానికి తగిన భూమిక ఈ నవలలో చిత్రించబడింది. ఇక్కడ వట్టికోట ఆళ్వారుస్వామిగారు ఒక వాస్తవిక రూపంగల రచయితగా తప్ప తానుగా కాల్పనికమైనటువంటి అంశం ఏదీ చొప్పించలేదు. ముఖ్యంగా ఇతర నవలలలు తెలంగాణకు సంబందించి వచ్చిన వాటిలో ఈ కాల్పనికఅంశం ఎక్కువగా కనపడుతుంది.
అక్కడివాడు, అక్కడి ఉద్యమంలో తాను పాల్గొన్నవాడు, ఆద్యమం ఎలా క్రమంగా రూపుదిద్దుకున్నదీ పరిశీలించినటువంటివాడు కనుక ఆళ్వారుస్వామి దానిని తాను తిరిగినటువంటి ప్రదేశాలను, తాను కలిసినటువంటి మనుషుల యొక్క అనుభవాలని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఒక చారిత్రక నవలగా తీర్చిదిద్దినటువంటి అంశం మనకు స్పష్టమవుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జైల్లో ఆయన జైలరుతో చేసినటువంటి వాదనలో రాజ్యాంగం, జైళ్లు, పరిపాలన వాటికి సంబందించిన అనేక అంశాలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు కనపడతాయి. అందులోను ప్రతి పాత్ర కూడా తాను మూసపోసినట్లుగా కాకుండా వైవిధ్యంతో కూడినట్లు ఉండటం -చిత్రించటంలో ఆళ్వారుస్వామిగారు కృతకృత్యులయ్యారు. అందుకే వాస్తవానికి ఆళ్వార్లు పన్నిద్దరే అయినా మా వట్టికోట పదమూడో ఆళ్వారని దాశరధి అగ్నిధారను ఈయనకంకితమిస్తూ చెప్పింది అక్షర లక్షలలు చేసేటటువంటి సత్యమని మనం భావించాల్సి వుంటుంది.
సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సి.రాఘవాచారి