వినమరుగైన

అనుక్షణికం -వడ్డెర చండీదాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరిగి యితను మరొకరిని కలిసిందాకా.
నవల మొదట్లో పరిచయాలు చేయబడిన వాళ్ల జీవితాలు పదేళ్ల తర్వాత ఎలాంటి మలుపులతో మార్పులు చెందుతాయో చూస్తాము నవలను.అనుక్షణికం నవల శ్రీపతితో మొదలయి, చివరన అతనితోనే ముగుస్తుంది- ఉస్మానియా ఆర్ట్స్ బిల్డింగ్‌లా. చండీదాస్ మేథస్సు నుంచి వచ్చిన ఒకానొక అతి గొప్ప అతి విలక్షణ సృష్టి నృపతి. తన చుట్టూ జీవితం అనుక్షణం మారుతున్నా తనలో ఎటువంటి మార్పు లేకుండా మొదటినుంచి చివరిదాకా కనపడేది ఒక్క శ్రీపతే.
వొడ్డున నుంచొని జీవితం నదిని పరిశీలించే ఒక యోగిలా, ఒక సైంటిస్టులా, జీవితపు నదిలో పూల పవడలో వెల్లికలా పడుకొని జీవిత రహస్యాలను ఆకాశంలో వెదికే ఒక తత్వవేత్తలా, ఒక స్వాప్నికుడిలా, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు అగుపించే ఒక సామాన్యనిలా, అత్యున్నతపు మానవతా విలువలు కలిగిన ఒక అపూర్వ వ్యక్తిలా శ్రీపతి కనపడ్తాడు.
చేతనాత్మక నీతిని అంటే కాన్సియస్ మొరాలిటీని కల్గిన వ్యక్తి శ్రీపతి. స్వయంగా తన నైతిక విధిని, పరిధిని తానే నిర్ణయించుకొని, దానిని బాధ్యతతో నిర్వహించే దశను లేక స్థితిని చేతనాత్మక నీతి అని అంటాము. సహజీవనావసరాల కనుగుణంగా గాని ఆచారాల కనుగుణంగా గానీ సాగక తన అంతరాత్మనే సాక్షిగా గ్రహించి మెసులుకోవటం శ్రీపతిలోని విశిష్టత.
సాహిత్యాన్ని, సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని, చివరకు రాజకీయాలలోనూ లోతుల్లో తట్టగలడు. అందరికీ ఆప్తుడు. ఎవరినీ నొప్పించడు. అవసరమైతే అడ్డదిడ్డంగానూ ప్రవర్తించగలడు. అప్పుడప్పుడు శరీరపు ఒత్తిడి ఎక్కువయినప్పుడు ‘వేశ్య’ దగ్గర గడపనూ గలడు.
(ఇంకా ఉంది)

రామిశెట్టి చంద్రశేఖర అజాద్