వినమరుగైన

అనుక్షణికం -వడ్డెర చండీదాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె లేని అనంత్ పిచ్చివాడై హాస్పిటల్‌లో గొలుసులమధ్య బంధించబడతాడు. వీరి ముగింపు ఎప్పటికీ చెరగని ఒక గాఢ విషాదానుభూతిని మిగులుస్తుంది.
హిమజ్వాలలోని గీతాదేవి మరణంను, అనుక్షణికంలోని స్వప్నరాగలీన మరణంను- మామూలుగా తీసుకోలేడు పాఠకుడు. వాళ్ల జీవితాలు అసంపూర్ణంగా, అసహజంగా ముగుస్తాయి. మానవ జీవితాన్ని సార్థకం చేసి, లక్ష్యాత్మం చేసే అనుభవాతీతమైన విలువలు -అంటే అల్టిమేట్ వాల్యూస్ కల్గిన అతి కొద్దిమంది వాళ్లు గీతాదేవి, స్వప్నరాగలీనలు. అలాంటివాళ్లు అసంపూర్ణంగా, అసహజంగా జీవితాలను చాలిస్తే ఆ విలువలకేమర్థం? ఏం ప్రయోజనం? నవలలోని ఇద్దరి నాయికలనూ అలా ముగిస్తే- ఆ విలువల వ్యక్తిత్వమున్నవారికి అలాంటి ముగింపే ఉంటుందని అన్యాపదేశంగా రచయిత చూపుతున్నాడని పాఠకుడు భావించకుండా ఎలా ఉంటాడు? రచయితను ప్రశ్నించే హక్కు మనకు లేనప్పటికీ, ఔచిత్యం కానప్పటికీ- యిలాంటి పాత్రలకు ఇంతటి అన్యాయాన్ని చేయటానికి మనసు ఎలా వొప్పుకుందా అని సందేహపడతాము. ట్రాజిక్ ఎఫెక్ట్ కోసం పొయిటిక్ జస్టిస్‌ను వదులుకున్నారా అని అనిపిస్తుంది.
మానవుని జీవితంలో కొన్ని సంఘటనలు, మానవుని అభిమతానికి, యిచ్ఛకు, ప్రయత్నానికి సంబంధం లేకుండా మానవాతీత శక్తులచేత ముందుగానే నిర్దిష్టాలవుతాయనేది విధి వాదానికి అంటే ఫాటలిజమ్‌కు ఉదాహరణగా స్వప్నరాగలీల, అనంతారెడ్డి, అలానే గీతాదేవిల జీవితాలు చూస్తాము.
గాయత్రీ, మోహనరెడ్డిల పాత్రలు కూడా పాఠకులను ఆకట్టుకుంటాయి. వాళ్ళిద్దరూ విప్లవ కమ్యూనిస్టు పార్టీలో ఏక్టివ్ మెంబర్స్. సిన్సియర్‌గా పార్టీలో పనిచేసే వీళ్లలాంటి వాళ్లతోపాటు, ఆ పార్టీలోనే అవకాశవాదులైన సుబ్బారెడ్డి, విజయ్‌కుమార్ లాంటి వాళ్లను కూడా చూస్తాము. తల్లిదండ్రులను ఎదిరించి, బయటకు వచ్చి మోహన్‌రెడ్డితో కలిసి జీవిస్తుంది. పెళ్లి చేసుకుందామని మోహన్ అంటే వొప్పుకోదు. ‘పెళ్లి అనేది యిరువురు వ్యక్తుల ఆంతరంగిక సొంత విషయం. నా మెళ్లో వో తాడు కట్టి, ఆ చట్టంతో నిన్నూ, నన్నూ మన పిల్లల్ని బంధించటం నీచం- ‘యిఫ్ నాట్ అన్‌మార్క్సియస్, డోన్ట్ బికం యె సెంటిమెంటల్ ఫూల్’ అని అంటుంది.
కాని తనకు పుట్టిన తన అపూర్వపు ‘చిట్టి అరుణ’ కొద్ది నెలలకే చనిపోతే- ఆ సెంటిమెంటల్ ఎటాచ్‌మెంట్ నుంచి ఎప్పటికీ తప్పుకోలేకపోతుంది. ఆ క్షణాన కన్న తల్లిదండ్రులకు కూడా తనకు తన కూతురు మీద ప్రేమ వున్నట్లే వాళ్లకూ తనమీద వుంటుందని గ్రహించి- అప్పుడు మొదటిసారిగా తనంతట తాను, తాను వొదిలివచ్చిన తన పుట్టింటికి వెళుతుంది. ఆ తరువాత ఎమర్జెన్సీలో అన్యాయంగా జైల్లోకి నెట్టబడి, ఆనక తప్పించుకొని అడవుల్లోకి వెళ్లిపోతుంది. ‘ఈ సమస్త వ్యవస్థనీ మసిలా తగలబెట్టే కార్చిచ్చులా’. ఆ తరువాత చాలా రోజులకు ఆమె నుంచి ఉత్తరాన్ని అందుకొని తనూ అడవుల్లోకి వెళతాడు మోహన్ రెడ్డి. చనిపోయిన అరుణ విషయంలో గాయత్రి ఆవేదన, గాయత్రి విషయంలో మోహన్‌రెడ్డి అనుబంధాలు- సహజాతబంధాలు భౌతిక విలువలకంటే గట్టివని అన్యాపదేశంగా తెలియజేస్తాయి.
రాజకీయ వ్యసనం ఎంతటి భయంకరమైనదో రవి పాత్ర ద్వారా తెలుస్తుంది. డిగ్రీ ఫైనలియర్‌లో వున్న రవి తనని సంప్రదించకుండా, తన పెళ్లిని తన మేనమరదలుతో నిశ్చయించినందుకు అలుగు తాడు. కోపం తెచ్చుకుని ఇపుడు ఏమి చేయాలా అని దీర్ఘంగా ఆలో చిస్తుంటాడు
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

రామిశెట్టి చంద్రశేఖర అజాద్