వినమరుగైన

అనుక్షణికం -వడ్డెర చండీదాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనను పెంచిన ఆ మేనమామ ఇంటినుంచి బయటకు వచ్చి స్నేహితుల సహాయాన్ని కూడా నిరాకరించి, ఒక కార్మికునిగా చేరతాడు. తనను ప్రేమించిన స్థితిమంతురాలు ‘నళిని’ని అంతకుముందే కాదంటాడు. ఎంతో నిజాయితీ వున్న మనిషి. దొంగతనం, లంచం, వ్యభిచారం అంటే అతనికి పరమ అసహ్యం. తన తోటి కార్మికుని చెల్లెలు ‘గంగి’ని పెళ్లాడతాడు. క్రమక్రమంగా రాజకీయాలవైపు ఆకర్షితుడౌతాడు. ఎంఎల్‌ఏ అవుతాడు. అవకాశవాదిగా మారి ఆనక మినిష్టరవుతాడు.
ఆ పదవి రావటానికి, దాన్ని నిలబెట్టుకోవటానికి అన్ని వెధవ పనులూ చేస్తాడు. భార్య ‘గంగి’ చెడు ప్రవర్తనను కూడా భరిస్తాడు. తన పదవిని నిలబెట్టుకోవటానికి, ఒక సందర్భంలో ‘నళిని’ని ఆశ్రయించి, ఆమె షరతు మీద ఆమె ముందు అండర్‌వేర్‌తో నిల్చుంటాడు కూడా. ‘ఎందుకింత దిగజారిపొయ్యావని’ నళిని ప్రశ్నిస్తే యిలా చెబుతాడు- ‘‘రాజకీయం భయంకరమైనది. ఆ దాహం, ఆ వ్యసనం జూదం కంటే, త్రాగుడుకంటే, ముండలకంటే అన్నిటికంటె మించిన వ్యసనం- మహామోహం అది. దాన్లో పడినవాడు దాన్లో అంతం కాక తప్పదు’’ అని - అలా అంతం కావటానికే సిద్ధపడ్తాడు కాని బయటపడాలని అనుకోడు.
అతనికి ఎంతో ఇష్టమైన నల్లగులాబి మొక్కను అతని రాజకీయ అస్తిత్వానికి ప్రతీకగా చూపెడతాడు రచయిత. ఎదగకుండా ఎప్పుడూ అలాగే వుండిపోయే అతను ఇష్టపడిన ఆ నల్లగులాబి మొక్క ఎప్పుడూ గుంట పూలనే చూస్తూ వుంటుంది.
రవి భార్య గంగిది మరొక రకమైన మనస్తత్వం. రవి అంటే ఎంతో ప్రేమ, అంతకుమించిన ప్రాణం. కాని ‘రవి’ ఆమెను సెక్స్‌ను తృప్తిపరచలేకపోతుంటాడు. ఆమెకు ‘సెక్స్‌యావ’ ఎక్కువ. తన కోరికలను ఆపుకోలేక కావాలనే దారి తప్పుతుంది. అలా తప్పు చెయటానికి కారణం ‘రవి’యే అన్న విషయాన్ని కూడా అతనికి సూచనగా తెలియజేస్తుంది. ఒక తప్పును పదే పదే అనేకమార్లు చెయ్యటం వల్ల అది తప్పనే భావం పోతుంది. అటువంటి పరిస్థితులలో అందరూ అదేవిధంగా ప్రవర్తిస్తారనే దృష్టితో ఆ నైతిక ప్రవర్తనను కొనసాగిస్తుంటుంది. తత్త్వశాస్త్రంలో ఈ స్థితిని గాడిద అంతరాత్మ (కాన్‌సైన్స్ ఆఫ్ యాన్ యాస్) అని అంటారు.
మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ‘తార’ చిన్నప్పటినుంచి తన పరిధిని మించిన కలలు కంటూ వుంటుంది. తనలాంటి అందగత్తె పొరపాటున ఈ సగటు కొంపలో పుట్టినట్లు ఎప్పుడూ బాధపడుతుంది. తప్పని పరిస్థితుల్లో ‘డ్రాఫ్ట్‌మెన్ రామారావు’ను పెళ్లిచేసుకొని హైదరాబాద్ వచ్చి పిజిలో చేరుతుంది. భర్త ఇంజనీరని, తమది హై క్లాస్ సొసొటీ అని అందరికీ చెప్తుంటుంది. భర్త లంచాలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. అతని జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. చివరకు సూర్యప్రకాష్ వలలో చిక్కుతుంది. ఎంతో సెక్సీగా కనపడే తార, సెక్స్ క్రియ విషయంలో మనసు బిగదీసుకుపోతుంది. అయినా ఆ అయిష్టతను కనపడకుండా నటించగల నేర్పరి. సూర్యప్రకాష్ వల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో, బ్రిడ్జి మీద రైలు క్రిందపడి తునాతునకలౌతుంది. ఈ పాత్ర విషయంలో పొయెటిక్ జస్టిస్ జరిగినట్లుగా పాఠకుడు భావిస్తాడు.
సుబ్రమణ్యం విద్యార్థి దశలో తనకు పిన్ని వరసైన, పెళ్లైన, నేర్పుగా బొంకగల్గిన వేదవతితో సెక్స్ సంబంధాలు పెట్టుకుంటాడు. ఒకసారి ఆమెమీద వొరుగుతుండగా అనుకోకుండా ఆమెభర్త కంటపడతాడు. తనను రేప్ చెయ్యబోయాడని బొంకుతుంది వేదవతి. తన్నులు తిని అవమానంతో బయటకు నెట్టబడతాడు.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

రామిశెట్టి చంద్రశేఖర అజాద్