వినమరుగైన

అనుక్షణికం -వడ్డెర చండీదాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుక్షణికం రచన గొప్పదనం దాని సందేశం వల్లనా, లేక దాన్ని తీర్చిదిద్దిన సాహిత్యంవల్లనా అని అడిగితే- సాహిత్యంవల్లనే అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. ఈ నవల సందేశం అన్యాపదేశంగా వుంటుంది.
కానయితే లాజికల్‌గా ఆలోచించినపుడు అక్కడక్కడ చిన్న చిన్న విషయాలలో పాఠకుడు రాజీకి రాలేకపోతాడు. శ్రీమంతుడైనా మానవత్వం మూర్త్భీవించిన శ్రీపతి విధివంచిత శ్రీగంథం కస్తూరి పడుపు వృత్తితో జీవితాన్ని గడుపుతూ వుంటే, ఆమెను ఆ వృత్తినుంచి తప్పించాలని ఎందుకనుకోడో అర్థం కాదు. అతను తలచుకుంటే అది ఏమంత కష్టం కాదు. అన్‌సోలిసిటెడ్ అడ్వైస్ కాని, హెల్ప్ కాని చేసే నేచర్ వున్నవాడు కాదని అనుకోవటానికీ వీల్లేదు. అలా చాలామంది విషయంలో చేసినవాడే. అలానే మొదట్లో ఎంతో నిజాయితీగా బ్రతికే రవి, అవినీతిని, అన్యాయాన్ని ఏ రకంగానూ సహించని రవికి- ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీలో తన పేరు చాలా ముందుగా రిజిష్టర్ అయ్యే విషయంలో, సీనియారిటీని త్రోసిపుచ్చి కాల్ లెటర్స్ వచ్చేలా తనఫ్రెండ్ ‘ఆచారి’ చేసిన సహాయమూ అవినీతిగా అన్పించవు. వీటిని లోపాలుగా తీసుకోకున్నా, ఇలాంటివి చోటు చేసుకోకుంటే బావుండేది.
మానసిక వైద్యులైన శేషావతారం, కూర్మావతారం పాత్రలు అతి హాస్యానికి అద్దంపట్టి అసహ్యం కలిగేలా చేస్తాయి. మానవ సమాజంలో అన్ని రంగాలలోనూ అనుక్షణం వస్తున్న మార్పులను బాగా ఆకళింపు చేసుకుంటే తప్ప ముఖ్యంగా యూనివర్సిటీ యువతతో కలిసి జీవించి వాళ్ల జీవిత విధానాన్ని పూర్తిగా స్టడీ చేసి అనుభూతి చెందితే తప్ప, అనుక్షణికం లాంటి గొప్ప నవలను వ్రాయటం సాధ్యపడదు.
చండీదాస్ గారి మాటలను కొద్దిగా మార్చి అనుక్షణం నవలను యిలా చెప్పవచ్చు.అంతలోనే అంతమయ్యే ఎంతకూ అంతమవని అనుభూతిని మిగిల్చే నవల అనుక్షణికం అని.
-సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

రామిశెట్టి చంద్రశేఖర అజాద్