వినమరుగైన

చిల్లరదేవుళ్ళు-దాశరథి రంగాచార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ బృహత్తర మహత్తర ప్రజా, రైతాంగ పోరాటాన్నీ దాని ఫలితాలనూ చిత్రించిన నవలలు కొద్ది సంఖ్యలోనే అయినా వెలువడ్డాయి. ఆ పోరాట ఫలితంగా అప్పటికీ ఇప్పటికీ తెలంగాణకు చెందిన రచయితలలోనే సామాజిక స్పృహ కానవస్తుంది. ఆ పోరాట ఫలితంగా జన జీవితంమీద ఏర్పడ్డ గాయాల ప్రభావం ఇంకా అక్కడి రచయితలపై ఉన్నట్టే అనిపిస్తుంది. కేవల కాలక్షేపపు రచనలకన్నా జన శ్రేయస్సు కోరే బాధ్యతాయుత రచనలే అక్కడినుంచి ఎక్కువగా రావటం గమనించవచ్చు.
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు శివరామకృష్ణ మృత్యుంజయులు నవలలు ఆనాటి చరిత్రను పాఠకుల కళ్లముందు చిరస్థాయిగా నిలిపాయి. అవి ఆనాటి ప్రజల జీవనాడీ స్పందనను ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
ఆ కోవకు చెందిన మరొక ఉత్తమ రచన చిల్లరదేవుళ్లు. దాశరథి రంగాచార్య ఆనాటి ఉద్యమ మధ్యంలో ఉండి, జీవించి, ఆ బాధలు కళ్లారా చూసి అనుభవించి స్పందించిన రచయిత.
ఆనాటి తెలంగాణలోని వాస్తవ జీవిత పరిస్థితులను అప్పటి నిజాం నవాబు తాబేదారుల గ్రామాధికారుల క్రౌర్యాన్నీ, దోపిడీదారీ గుణాన్నీ, వారి అవినీతినీ, ఆ రాచరిక వ్యవస్థలోని కుళ్లునూ, బాంచను నీ కాల్మొక్త అని సాగిలపడే అతి సామాన్యుల నిస్సహాయతను పఠిత హృదయాలను కలచివేసేంత సరళంగా శుభ్రంగా నిజాయితీతో చిత్రించారు ఈ నవలలో రంగాచార్య.
మాయజలతారు, మోదుగుపూలు, జనపదం వంటి నవలతోపాటుగా చిల్లరదేవుళ్లు ఉత్తమాభిరుచిగల పాఠకులను అర్థశతాబ్ది వెనక్కు తీసుకువెళ్లి ఆనాటి పరిస్థితులను కళ్లముందు చూపించి ఆనాటి కఠోర నిష్ఠుర జీవితాన్ని ఆనాటి దొరల దుర్మార్గంతో పాటు ఆనాటి సామాన్య జనుల సాహసాన్ని కూడా చిత్రించి చిరస్థాయి అయిన స్థానాన్ని సంపాదించుకున్నది. ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క సర్వ లక్షణాలను జీవతత్త్వాన్ని సమగ్ర స్వరూపాన్ని ఆ ప్రజల వాడుక భాషతో సహా తెలిసి అర్థమై ఉంటే తప్ప ఇటువంటి రచన సాధ్యం కాదు. ముఖ్యంగా గట్టున ఉండి చూసినట్టు కాక రచయిత ఆ జీవితంలో పుట్టి పెరిగి ఉండాలి. కర్ణాకర్ణిగా వినీ పేపర్లలో చదివీ ఇట్టి రచన చేయడం కుదరదు. ఒకవేళ ఎవరైనా వ్రాసినా అది గట్టున ఉండి చేసిన రచనే అని పాఠకులకు తెలిసేపోతుంది. రంగాచార్య ఆ జీవితంలో భాగమై జీవించాడు. ఆటుపోట్లు అనుభవించాడు. ఆ నిష్ఠుర కష్టాలను అనుభవించిన సహచరులను చూశాడు. అప్పటి కరువు కాటకాలు, దారిద్య్రం, ప్రజల కన్నీళ్లు, వారి సాహసం అన్నీ చూసి హృదయం ద్రవించి కలం పట్టాడు. అప్పటి ప్రజలలో రాజు అంటే దైవాంశ సంభూతుడని నా విషుఃపృధ్వీ పతిః అని విశ్వాసం. మనలను పరిపాలించేవాడు ఎవడైనా ఎక్కడివాడైనా తమవాడు కాకపోయినా సరే వాడు దేవుడితో సమానం అనే భావం. వాణ్ణి తృణీకరిస్తే నరకం తథ్యం అనే దారుణభావం ప్రచారంగా ఉండేది. పరాయివాడు పరాయి భాషను వాడి సంస్కృతిని మన నెత్తిన రుద్ది మన సంస్కృతి రూపురేఖలను ధ్వంసం చేసినా పట్టించుకోని నిర్లిప్తత. ఇది అంతకాలమూ చెల్లింది. కాని పంధొమ్మిదవ శతాబ్దం తర్వాత ఈ ధోరణి చెల్లలేదు. కరుడుకట్టిన జమీందారీ నిరంకురశ ధోరణీ, పెత్తందారుల దోపిడీ, గ్రామాధికారుల క్రౌర్యం కొత్త పరిస్థితులలో చెల్లలేదు. జన సామాన్యంలో కొత్త చదువు.. కొత్త చూపు.. కొత్త రాజకీయ విశ్వాసాలు.. వీటితో ఇది బ్రతుకు కాదు పోరాడితే కాని మేలి రకం బ్రతుకు సిద్ధించదు అనే తెగింపు అలవడింది. స్వేచ్ఛకోసం.. భూమి విముక్తి కోసం పోరాటం ప్రబలింది. ఇది 1930 ప్రాంతాలలో తెలంగాణా..
అప్పుడు సుధీర్ఘంగా సాగిన పోరాటాన్ని చూసి అందులో భాగస్వామిగా పెరిగిన వాడు రంగాచార్య. ఆ గాలి పీల్చి ఆ వ్యవస్థలో జీవించి ఆ పోరాటంలో ఆరితేరిన రంగాచార్య దాన్ని అక్షర రూపంలో తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా అర్హుడే. పైగా ఆయన చేతిలోని భాష అమృతతుల్యమైన తెలంగాణ ప్రజల భాష.. జీవద్భాష.. ఇంత నేపథ్యంతో వెలువడింది చిల్లరదేవుళ్లు నవల. స్వాతంత్య్రానంతరం మాత్రమే మన దేశం మారిందా? అప్పటి వారెటువంటి కలలు కన్నారు. అవి ఎలా ఫలించాయి? భారతదేశమంటే లెక్కకు మిక్కిలి గ్రామాలు, ఆ గ్రామాలలో పాలకుల తాబేదార్లు.. అధికారగణమూ. వారిది ఇష్టారాజ్యం. ఊరికొకదేవత కాక చిల్లరదేవుళ్లు ఉంటారు. వాళ్లవల్ల అసలు దేవుడికే లేక అసలు దేవతకే తిండి దొరకదు. అసలు దేవుడికి గతి ఉండదు. చిరుతిండి కూడా దక్కనివ్వరు చిల్లరదేవుళ్లు. జనసమూహం సంగతి సరేసరి. వాళ్ల కడుపులెప్పుడూ మాడుతూనే ఉంటాయి. వారు పస్తులున్నా ఎవరికీ పట్టదు. అట్టివారిని గురించి నవల ఇది. వనజ పాత్ర ఈ నవలకు ఆయువుపట్టు.
ఆజన్మ మరణాంతమూ ఆమె ఆ దుష్ట వ్యవస్థ పదఘట్టనల క్రింద ఎలా నలిగి నుసై పోయిందో చదివితే కొండలవంటి గుండెలు కూడా ద్రవిస్తాయి. ఈ నవల చిరకాలం పాఠకులకు ఎంతో ఆత్మీయంగా నిలిచిపోతుంది.

పెద్ద్భిట్ల సుబ్బరామయ్య