వినమరుగైన

దీపావళి -వేదుల సత్యనారాయణ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు స్వేచ్ఛా ప్రియునిగా భారతీయునికి ఎటువంటి కాంక్ష ఉందో చివర పద్యంలో చెప్పారు. ఇది నిజంగా ఈ శీర్షికలో భరతవాక్యమే!
‘‘నీచపు దాస్య వృత్తి మననేరని శూరత మాతృదేశ సే
వా చరణమ్మునం దసువులర్పణ జేసిన వారి పార్థివ
శ్రీ చెలువారు చోట దదసృగ్రుచులన్ వికసించి, వాసనల్
వీచుచు, రాలిపోవగవలెన్ దదుదాత్త సమాధి మృత్తికన్!’’
హేయమైన బానిసత్వంపై ఉప్పెనలా దూకుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సమాధులనేకం ఉన్నాయి. అటువంటి గొప్ప సమాధులపై పరిమళ సుమాలై రాలిపోవటంలోనే సార్థక్యం ఉంది. ఇంత బరువుగా- బలంగా చెప్పటం వెనుక భారతీయుల తపన, మధన ఎంతగా నివురుగప్పి వున్నాయో అర్థమవుతుంది. దేశభక్తి ప్రస్ఫుటమవుతున్నది.
బ్రిటీషువారి అణచివేతపై ఆవేదన చెందిన భారతీయుడు దీపావళినాడు అనే కవితలో కనిపిస్తాడు. అతనిలో బిక్కు బిక్కుమంటున్న దైన్యం, నిస్సహాయత వ్యక్తమవుతాయి. బాహ్యార్థం నుండి నాణాన్ని త్రిప్పితే అంతరార్థం వ్యక్తమవుతుంది.
‘‘మొక్కిన కొలది గాలితో ద్రొక్కివేయు
నీ కఠినలోకమెల్ల బహిష్కృతమ్ము
రండు! చిమ్మటలార! ఈ రాత్రివేళ
నావలెనె పాడుకొను మీరె నాకు సఖులు!...’’
అంటూ చీకటి మూలలో రోదించే చిమ్మటలను సఖులుగా ఆహ్వానిస్తాడు కవి. ప్రార్థించే కొలది పాతర వేసే ఆంగ్లేయుల రాతి గుండెను ఈ పద్యంలో ధైర్యంగా వెలివేశారు వేదుల. ఈ కవిత విన్న హరీంద్రనాధ ఛటోపాధ్యాయ ఎంతగానో ముగ్ధులై శిరస్సునూపారట.
పైపై రూపాన్ని చూచి బాగుందనుకొనేవారికి తెర వెనుకనున్న బాధలర్థం కావు. సముద్రానిదీ అదే పరిస్థితి.
ఊరు పూర్పున దూగాడు నూర్ములరసి
తరగతరగ వినంబడు తానము విని
నురుగు నురుగున చుక్కల మెరుగు గాంచి
యాటయని, పాటయని, హాసమని తలంచు
గాని, రుూ మహాసాగరా గాథ హృదయ/ బాడ బానల జ్వాల యెవ్వరికి దెలియు..?
ఊగుతున్న కెరటాలను చూస్తూ ఆట అని, తరగ తరగకు వినిపించే నాదాన్ని ఆలిస్తూ పాట అని, నురుగు నురుగులో చుక్కల తళతళలను అవలోకిస్తూ అది నవ్వు అని భావించే మనిషికి దాని అంతరాంతరాల్లోనున్న బడబాగ్ని ఏం తెలుస్తుంది? ఇక్కడ కనిపించేది, వినిపించేది సముద్రమైనా- ఆ భౌతిక ముద్ర వెనుక- అస్వతంత్రుడైనా భారతీయుడు కూడా లేకపోలేదు. అలాగే పైమెరుగులెన్నున్నా- అగాధంలో బాధను జుర్రుకొంటున్న వ్యక్తికూడా ఇక్కడ కనిపిస్తాడు.
***
స్వేచ్ఛాదీపాలను దాటి కొంచెం పక్కకు జరిగితే- ప్రణయ దీపాలు- ఆ ప్రక్కగా ప్రణవదీపాలు పలుకరిస్తాయి. భావకవితా కాంతులు వీటిలో ప్రస్ఫుటంగా ప్రసరించటం మనం గమనిస్తాం. అది ప్రేమికులు నివేదిస్తున్న విషయం కావచ్చును. లేక ఒక భక్తుడు భగవంతుణ్ణి భావిస్తూ చెప్పిన సందర్భమైనా కావచ్చును. అదైనా, ఇదైనా, వస్తువు మన హృదయాలను అలంకరించక మానదు- అలరించక మానదు.
నిరీక్షణలో ఒక పద్యమిది-
‘‘రావను కొందు గాని యనురాగము ద్వారము మూయనీదు, దుః/ ఖావహవౌనుగాని భవదాదర పాత్రములంచు వేషభూ/ షావళులూడ్వలే, నిటు నిరాశ యొకింత, యొకింత యాశగా/ శ్రావణ లక్ష్మినై నిలువ జాలకయుంటిని వెల్గు నీడలన్...’’
ఆశకూ నిరాశకూ మధ్య ఊగిసలాడుతున్న గుండె ఈ పద్యంలో అక్షరాక్షరాలన్నీ ప్రభావితం చేస్తున్నది.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రసరాజు