వినమరుగైన

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ కథలు -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాయగా రాయగా భాష స్వాధీనమవుతుంది. రాయగా రాయగా క్రాంత దర్శిత నిశితం అవుతుంది, రాయగా రాయగా తపస్సు సిద్ధించి మహర్షి అవుతావు. మహర్షి కానివాడు, కథలు రాయలేడు’’ అంటారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ గారు. ఇంగ్లీషు వాసనలంటని అసలుసిసలు తెనుగు జాతీయ కథా రచయిత ఆయన. ఆయనదొక విశిష్ట మూర్తిమత్వం. భాష, భావం, పాత్రల ప్రవృత్తీ, అన్నింటా నూటికి నూరుపాళ్లూ తెనుగుదనం జొప్పించిన స్రస్ట, ద్రష్ట కూడా ఆయన.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా పొలమూరు ఆయన జన్మస్థలం. వల్లూరు, వేటపాలెం శాస్ర్తీగారు విద్యాభ్యాసం చేసిన గ్రామాలు. వేదం, జ్యోతిషం మొదలు అనేక ధర్మశాస్త్రాలను ఔపాసన పట్టిన ఆయన అష్టావధానాలున్నూ చేశారు. కాని ఆధునిక కథ చేసుకున్న అదృష్టమో ఏమో? శాస్ర్తీగారు క్రమేపీ, వచన రచన పట్టి; అందునా వాడుక భాషలోనే కథారచన సొంతం చేసుకుని, దానిని పరిపుష్టం, సుసంపన్నం చేశారు. ఆయనకు 1956లో కనకాభిషేకం జరిగిందీ అంటే అబ్బురం కాదు!
ఏ రచయిత అయినా- సారస్వత చరిత్రలో నిత్యనూతన తారగా భాసిల్లవలనంటే, సమకాలీన సంఘ జీవితానికి ప్రతినిధి కావాలి. అతని కథలకు నాటి సంఘ జీవితమే ముడిసరుకు కావాలి. కొండంత జీవితానికి గోరంత దీపాలుగా రాణించాయి యిరవయ్యవ శతాబ్దపు నవీన కథలు.
అట్టివాటిలో శాస్ర్తీ గారి కథలు- ఒజ్జ బంతులు, మేలి మణిపూసలు, వస్తు రూపేణా, శిల్ప దృష్ట్యా అత్యుత్తమమయిన కథలు మాత్రమే గాక వారి కథలు, అభ్యుదయ కామన గలవి. చిత్తశుద్ధికీ, ధైర్య పటిమకు నిదర్శనాలు. లక్ష్యశుద్ధి గల కళాఖండాలు.
అసలు సంఘసంస్కరణోద్యమం 19వ శతాబ్దంలోనే ప్రారంభమైనా, అది ఇరవయ్యవ శతాబ్దాన్ని అమిత సంరంభంగా అందుకుంది. ఒకప్రక్క జాతీయోద్యమం, మరోప్రక్క వ్యావహారిక భాషోద్యమం, అంతటా సంఘ సంస్కరణోద్యమం రుూ మూడూ త్రివేణీ సంగమంగా రెండు ప్రపంచ సంగ్రామాల మధ్య నలిగిపోకుండా, వెల్లువెత్తిన నవీన యుగానికి నాటి కందుకూరి, గురజాడ, గిడుగు పిడుగు గారలు త్రిమూర్తులు! వారు ప్రసాదించిన నడబండీ సాయంతో, సాహిత్యాన్ని ప్రజల భాషలో పరుగులు తీయిస్తూ ఉద్యమ రథంగా మార్చిన శ్రీపాద వంటి ఎందరో మహానుభావులు కథనే వజ్రాయుధంగా ఎంచుకున్నారు.
సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు వీరేశలింగం గారి ప్రభావంతోనే కథారచయితగా మారిపోయారు. 1915లో ప్రప్రథమంగా ఆంధ్రపత్రిక వారి కథను వేసుకుంది. మరి నాలుగు కథలు ప్రబుద్థాంత పత్రికలో వెలువడ్డాయి. ప్రబుద్ధాంధ్రకు శాస్ర్తీగారే సారధులు. దరిమిలా 14 కథలు రెడ్డిరాణి పత్రికలో పడి, సంచలనే సృష్టించాయి! వీటిని గ్రుచ్చెత్తి ఆయన పూలదండ అన్న సంపుటం ప్రచురించినాడే, దానిని ఆంధ్ర కథా సరస్వతి గళసీమలో అలంకరించాడు. ఆ దండ నేటికీ వాడిపోలేదు. మరో శతాబ్దానికికూడా యింకా గుబాళింపులు వెదజల్లుతూనే వుంటాయి. అందులోని కథాకుసుమాలు. శాస్ర్తీగారి కథలో రామలక్ష్మి, ముందు హాలహలము పిదప అమృతమూ, వెలిపెడితే అల్లుడైనాడు, మేనరికం తప్పులేదు వగైరా కథలు వితంతు పునర్వివాహానికి ఉద్యమించిన కథలు. ఇక రజస్వలానంతర వివాహం ఆ రోజుల్లో తగని నేరం!
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com