వినమరుగైన

దీపావళి -వేదుల సత్యనారాయణ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవాసి పద్యాలలో భగ్నజీవిని చూపిస్తారు వేదుల
‘‘ప్రేమ కఠోరతల్ చిదిమి పెట్టిన దుర్దివ సావసాన లే
హిమ సృణాంధకార పటలమ్ముల చాటున దాగి యెవ్వరో
కోమల తారకాద్యుతి నిగూఢరవమ్ముల రమ్మటంచు నన్
వేమరు బిల్చుచున్న సరణిన్ మదిదోచు బ్రతిక్షణమ్మునన్..’’
ప్రేమించినందుకు ఫలంగా కఠోర స్పందనను కాన్కగా గ్రహించిన భగ్నజీవికి- ఎవరో చీకటి చాటున, నక్షత్ర కాంతులతో దాగి రహస్యంగా స్వాగతం చెపుతున్న దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ప్రణయ దీపాలు రెండూ ఇక్కడ ఒకదానిలో నొకటి ఒదిగి కనిపిస్తాయి.
‘‘నా యెదకే అపపంచ మనినన్ మృగతృష్ణల ఇంద్రజాలమై
పోయె, గలంత నిద్ర గనుమూసితినేని మనోహరా కృతి
చ్ఛాయ యెదో కనంబడుచు స్వప్నములం, బవవెల్ల దుఃఖముం
బాయనియట్టి నా హృదయమర్మములన్ మెలివైచి త్రుంపెడున్!’’
ఎండమావులు సృష్టించే ఇంద్రజాల ప్రపంచంలో- ఒక నిమిషం కలత నిద్రలో కనుమూస్తే లీలగా ఒక మనోహర రూపం కనపడిందట. ఆ కాంతి ఎవరిది? అది ప్రణవ దీపానిదే!
ఈ కావ్యంలో భగ్నవీణ దాల్చిన మరొక ప్రేమికుడు తారసపడతాడు. ప్రేయసి అతణ్ణి ఏడిపించింది. వికటంగా నవ్వింది. పరువంలోనున్న ఆశావిపంచి ఆమె కారణంగానే అంగవైకల్యంతో మూలబడిపోయింది. అయినప్పటికీ అదే వీణపై ఆమె సౌందర్యాన్ని నాదంగా చేసికొని వౌన ప్రేమ బాష్పగీతిని పాడుకోవడానికే అతడుద్యుక్తుడౌతాడు. అయితే ఆ పాట ఎంతకాలం వరకు ప్రయాణిస్తుంది? ఆత్మ జీర్ణించేవరకు. అంటే ఆ గానానికి అంతం లేదన్నమాట. ఈ శీర్షికలోనున్న పద్యాలన్నీ చదివితేనే కాని, ఈ చిన్న తేటగీతిలో నున్న కూర్పు అర్థంకాదు పాఠకునికి.
‘‘కార్తీక జ్యోత్స్నలందు నేకాకినగుచు
బ్రాణ సంత్రాణ మీ భగ్నవీణ దాల్చి
పాడుకొందు వౌన ప్రేమ బాష్పగీతి
నీతను వికాస మాత్మ జీర్ణించువరకు’’
ఇంత లోతైన భావ సంపద ఉన్నది కనుకనే- గురుదేవులు శ్రీపాదవారి నోటిమీదుగా మహాకవి బిరుదాన్ని అందుకోగలిగారు వేదుల.
ప్రభువుతో విన్నవించుకున్న పద్యాలలో ఆశాగానం అనిర్వచనీయమన కవితా ఖండికగా మనం స్వీకరింపవచ్చును.
‘‘ఏ సడిలేక ఈ ప్రకృతి యెల నిశీధతమో నిబద్ధమై
నీ సుకుమార హస్తముల నిద్దురవోయెడు
వౌనవేళ, నీ
వేసరిజేసి రుూ శిథిల వీణను బాడు మటంచు నా పయిన్
ద్రోసెదవేల? తీగె తెగునో... శ్రతిదప్పునొ.. పల్కదో ప్రభూ!’’
అంటూ ప్రశ్నతో ప్రాంజలించే దయాపాత్రుడగుపిస్తాడు. నిరసిస్తూ, సిరసించనట్లుగా నిలబడ్డ ఆత్మీయ భక్తుడు ‘నాపయిన్ ద్రోసెదవేల’ అనటంలో కనిపిస్తాడు. తీగె తెగునో.. శ్రుతిదప్పునో. పల్కదో ప్రభూ!’’ అనటంలో దయనీయ భక్తుడు స్ఫురిస్తాడు. పద్యంలో పై మూడు పాదాలను బ్రతికించేలా నాలుగోపాదం ‘తీగె తెగునో! శ్రుతి దప్పునొ! పల్కదో ప్రభూ!..’ అంటూ కొసమెరుపుతో ముగింపు కావటంవలన పద్యంలో బిగింపు ఏర్పడింది. పద్య నిర్మాణం తాలూకు మెలకువ ఇక్కడే కనిపిస్తుంది- కవిలో. అలాగే ‘ప్రభూ!’ పతాక స్థాయిలో నింగినంటిన శీర్షిక-

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రసరాజు