వినమరుగైన

విలోమ కథలు నగ్నముని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాస్తవానికి ఏ మాత్రం భావ వ్యక్తీకరణకి మార్గం లేనపుడు, రచయిత తాను చెప్పదల్చుకున్న దృక్పథం చెప్పి తీరాలనే నిబద్ధత కల్గి వున్నపుడు సహజంగానే ప్రతీకలనీ, సంకేతాలనీ ఆశ్రయిస్తాడు. వ్యంగ్యం, కసి, క్రోధం ఆధారంగా చేసికొని పాత్రలని తలకిందులుగా ప్రవర్తింపజేసి - పాఠకులకి తత్కాలీన పరిస్థితుల్ని పరోక్ష పద్ధతిలో అర్థం చేసికొనే పరిస్థితుల్ని కల్పిస్తాడు.
సరిగ్గా నగ్నముని విలోమ కథల్లో ఆ పనే చేశాడు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కోసం, సెన్స్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ కోసం ఆయన పడిన తపన, కోపం ఈ కథల్లో నిండా కన్పిస్తుంది. నగ్నముని విలోమ కథల సంపుటి తెరవంగానే ఈ మాటలు కన్పిస్తాయి. అదీ ఒక కథ పేరున.
‘‘ఇందు మూలంగా సమస్తమైన వారికి మన ముఖాలూ, కాళ్ళూ, చేతులూ వగైరా సర్వాంగాలను గురించీ తెలియజేయడమేమనగా - ‘‘ఇలా సాగే సుదీర్ఘ వాక్యం ఇంతవరకు ఏ కథకీ పేరుగా లేదు. డప్పుకొడ్తున్న వాడుచెప్తున్న విధంగా వున్నాయి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సశేషం