వినమరుగైన

గాలివాన- పాలగుమ్మి పద్మరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయనకు జీవితంలోని అనేక అంశాలమీద దృఢమైన అభిప్రాయాలున్నాయి. అవన్నీ ఓ లాజిక్‌తో నిండి వుంటాయి.
ఆయన వేదాంతి, జీవితానికి, వేదాంతానికి మధ్య వున్న అనుసంధానం గురించి అనర్గళంగా మాట్లాడుతారు.
ఆయన మంచి ఉపన్యాసకుడు కూడా. వేదాంతానికి సంబంధించిన ఒక అంశంమీద వేరే వూళ్ళో ఉపన్యసించటానికే ఆయన రుూరోజు ప్రయాణం.
రావుగారు మిగతా ప్రయాణీకులందర్నీ పరిశీలిస్తున్నాడు. వాళ్ల మాటల్లో, ప్రవర్తనలో ఆయన కన్నీ లోపాలే కనిపిస్తున్నాయి.
గాలి ఉధృతమై వాన మొదలయింది.
ఆ సమయంలోనే కంపార్ట్‌మెంట్‌లోకి ఓ బిచ్చగత్తె ఎక్కింది.
ముప్ఫయి ఏళ్లుంటాయి. వొంటిమీద వున్న దుస్తులు అక్కడక్కడా చిరిగి వున్నాయి. అప్పటికీ ఆమెలో ఎలాంటి ఆకర్షణ కనబడటంలేదు.
బిచ్చగత్తె ఒక్కొక్కరి దగ్గరకూ వచ్చి తనదైన భాషలో అడుక్కుంటోంది. ‘ఇది పరుపుల పెట్టె, బిచ్చగాళ్లు ఎక్కటానికి వీల్లేద’ని చుట్ట కాలుస్తున్న ముసలాయన, తెలివితేటల్ని ప్రదర్శిస్తూ మాట్లాడబోయిన యువజంటలోని భర్తా... ఎవరూ ఆమెకు పైసా కూడా ఇవ్వలేదు. రావుగారుకూడా ఇవ్వలేదు. ఆమె పట్ల అసహనంగా, విసుగ్గా వున్నాడు. అసహ్యం కూడా వుంది.
ఎవరి దగ్గరా రూపాయి కూడా దక్కని బిచ్చగత్తె గుమ్మం దగ్గరకు వెళ్లి నిలబడింది.
గాలి, వాన ఉధృతమై గాలివానగా మారింది.
చాలాసేపటికి చీకటిపడుతూన్న వేళ రావుగారు దిగాల్సి వచ్చింది. చేతిలో సూట్‌కేస్‌తో దిగటానికి ఆయన ఇబ్బందిపడుతూ వుంటే బిచ్చగత్తె సాయం చేసింది.
ఆ భయంకరమైన వాతావరణంలో ఆయన్ని రిసీవ్ చేసుకునేందుకెవరూ రాలేదు. ఆ రాత్రికి వెయిటింగ్‌రూమ్‌లో తలదాచుకొమ్మని చెప్పి స్టేషన్‌మాస్టరూ, అతని అసిస్టెంటూ ఎటో వెళ్లిపోయారు.
రాత్రి.. కాళరాత్రిగా మారుతోన్న వేళ, నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయిన రావుగారు వెయిటింగ్ రూమ్‌లో తలదాచుకున్నారు.
పెను తుఫాను, కరెంట్ లేదు, తలుపులు ఊగిపోతున్నాయి. దగ్గర వున్న టార్చిలైటు సాయంతో పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తూ.. కొంతసేపటికి ఆ గదిలో తనతోబాటు మరో ప్రాణి వున్నట్లు గ్రహించాడు.
ఆ ప్రాణి బిచ్చగత్తె.
కొంతసేపటి క్రితం అసహ్యించుకున్న బిచ్చగత్తె. అతన్తోపాటు ఆ గదిలో తలదాచుకుంటోందని తెలిసేసరికి భయంతో బిక్కుబిక్కుమంటోన్న ఆయనకు కొండంత ధైర్యమొచ్చింది.
కొంత ఆప్యాయంగా మాట్లాడాడు.రావుగారు చలికి తట్టుకోలేక వణికిపోతూ వుంటే ఆమె గాలి లోపలకు రాకుండా వుండేందుకు తలుపు వేసింది.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కొమ్మూరి వేణుగోపాలరావు