వినమరుగైన

గాలివాన- పాలగుమ్మి పద్మరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావుగారు చలికి తట్టుకోలేక వణికిపోతూ వుంటే ఆమె గాలి లోపలకు రాకుండా వుండేందుకు తలుపు వేసింది.
ఆయన సంతోషించి సూట్‌కేస్‌లోని బిస్కెట్ ప్యాకెట్ తీసి, కొన్ని తాను తీసుకుని ఆమెకి కూడా ఇచ్చాడు.
ఆకలి బాధ కొంతవరకు తీరింది.
గాలివాన ఇంకా ఉధృతమవుతోంది. దగ్గర్లోనే ఏదో కూలిపోయిన పెద్ద శబ్దం. రావుగారు తృళ్లిపడి, ఒక్క గెంతులో ఆమెవైపు దూకి ఆమెను కరచుకుపోయాడు.
ఆమె ఆయనకు భయం పోగొట్టి వెచ్చదనాన్ని ఇస్తున్నట్లుగా దగ్గరకు హత్తుకుంది.
ఆమె కౌగిలిలో సేద తీరుతూ ఇంకా వొదిగిపోయి ఆమెలో లీనమైపోయి, మెల్లగా నిద్రలోకి జారిపోయాడు.
తెల్లవారాక ఆయనకి మెలకువ వచ్చింది. గాలివాన తగ్గిపోయినట్లు తెలుస్తోంది. కాని బిచ్చగత్తె లేదు. ఏదో అనుమానమొచ్చి జేబు చూసుకున్నాడు. పర్సు లేదు.
కోపం రాబోయి, అంతలోనే ఆగిపోయింది. ఆ రాత్రి బిచ్చగత్తె యిచ్చిన సుఖం గుర్తుకొస్తూ మిగతా వ్యతిరేక భావాలన్నిటిని తుడిచిపెట్టేస్తోంది.
రావుగారు గదిలోంచి బయటికొచ్చాడు. వాతావరణమంతా భీతావహంగావుంది. టిక్కెట్లమ్మే గది గాలివాన తాకిడిని తట్టుకోలేక కూలిపోయింది. రావుగారు అటువైపు చూసి ఉలిక్కిపడ్డాడు. బిచ్చగత్తె మృతకళేబరంగా మారి ఆ శిథిలాలలో చిక్కి వుంది. దగ్గరకు వెళ్లాడు. ఆమె ఒక చేతిలో రావుగారి పర్సు రెండో చేతిలో కౌంటర్‌లోంచి కాజేసిన కొన్ని నోట్లూ వున్నాయి. మెల్లగా షాక్ నుంచి కోలుకుని ఆ నోట్లు తిరిగి కౌంటర్‌లో వుంచేశాడు. రాత్రి ఆమె యిచ్చిన తోడులో ఆయన్లోని గాంభీర్యం తొలగిపోయి హృదయమంతా మృదువైన దుఃఖంతో నిండిపోయింది. తన తాలూకు జ్ఞాపకమేదయినా ఆమె దగ్గర వుంచాలనుకున్నాడు. పర్సులోంచి తన విజిటింగ్ కార్డ్ తీసేసుకుని పర్సు చేతిలో అలాగే వుంచి అక్కణ్ణుంచి భారంగా కదిలాడు.
ఇదీ ఓ అద్భుతమైన కథ.
ఇందులో మనిషి బిహేవియరిజమ్ గురించిన విశే్లషణ వుంది. ఎంతో లోతులతో కూడి, గుండెల్ని కదిల్చివేసే విశే్లషణ.
పద్మరాజుగారి కథలో యింకో ప్రత్యేకత వుంది. వర్ణనలు మితిమీరకుండా, అవసరమైన పరిధిలోనే వుండి రచనకు ఓ శక్తి, నిండుతనం కలిగిస్తూ వుంటాయి. అనవసరమైన ప్రసంగాలూ, శృతి మించిన వ్యాఖ్యలూ వుండవు. రచనా విధానంలో ఓ నిగ్రహశక్తి ప్రవహిస్తూ వుంటుంది. అంటే తాను చెప్పదలుచుకున్న విషయంమీద కమాండ్ వుంటుందన్నమాట.
సన్నివేశాన్ని దృశ్యపరంగా కళ్లముందు వుంచే సామర్థ్యం ఆయన రచనల్లో వుంటుంది.మరో విశేషం. ఆయన కథల్లోని కథనం కేవలం ఒకటి రెండు సంఘటనల చుట్టూ తిరుగుతూ వుండదు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సశేషం

కొమ్మూరి వేణుగోపాలరావు