వినమరుగైన

కవిత్వతత్త్వ విచారం - కట్టమంచి రామలింగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్పు తన్ను దాటి వెళ్లే మార్పుల్ని ఆమోదించలేడు. ఇది చాలామంది మేధావుల్లో కూడా వున్న బలహీనత. బహుశా ఈ బలహీనత రామలింగారెడ్డిగారిలో కూడా ఉందేమో!
కవిత్వతత్త్వ విచారం వచ్చిన కొత్తలో దానిమీద చాలా ప్రతి విమర్శలు వచ్చాయి. కాళ్ళూరి వ్యాసమూర్తి శాస్ర్తీగారూ, అక్కిరాజు ఉమాకాంతమ్ గారూ, నోరి నరసింహశాస్ర్తీగారూ ఆ గ్రంథంమీద విరుచుకుపడ్డారు.
వీరెవరూ రామలింగారెడ్డిగారు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పలేదు. వీరు రామలింగారెడ్డిగారు పాశ్చాత్య సులోచనాలతో తెలుగు సాహిత్యాన్ని చూస్తున్నాడన్నారు. రెడ్డిగారు పెద్ద పెద్ద పదవుల్లో వుండటం చేత సాహిత్యంలో వారిమాట చెల్లుతోందన్నారు. కానీ కాలం వారిని పక్కకు నెట్టి ముందుకు సాగింది. ఆనాడే విశ్వనాథ సత్యనారాయణగారు ‘‘రామలింగారెడ్డిగారు తమ కవిత్వతత్త్వ విచారము రాసి విమర్శపథాల్లో గొప్ప దృక్పథం కలిగించి నవ్య సాహిత్యానికి కొత్త బోదెల తవ్వారు’’ అని చాలాకాలం క్రితమే అన్నారు.
ఈనాడు చే.రా వంటివారు ‘‘కాలానికి అవసరమైన విమర్శ కట్టమంచిది. కాలగమనం ఇష్టంలేక అన్నీ తాటాకుల్లోనే ఉన్నాయనే తత్త్వం ఆయన వ్యతిరేకులది’’ అంటున్నారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సమాప్తం

వల్లంపాటి వెంకట సుబ్బయ్య