వినమరుగైన

నేటికాలపు కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సాహిత్య విమర్శ ప్రస్థానంలో విప్లవాత్మకంగానూ తెలుగు సాహిత్య విమర్శను ఆరోగ్యకరమైన గొప్ప మలుపు తిప్పిన విమర్శ గ్రంథం అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు రచించిన నేటి కాలపు కవిత్వం.
1889లో జన్మించి 1942లో పరమపదించిన ఉమాకాన్తమ్‌గారు తన నాటి ఆంధ్రప్రదేశ్‌లో పాండిత్యంలోనూ, విమర్శలోనూ నిజాయితీకి, నిక్కచ్చితనానికీ, నిర్భయత్వానికీ నిలువెత్తు వ్యక్తిత్వంలో నిలిచిన గొప్ప విద్వద్రచయిత. చేకూరి రామారావుగారన్నట్లు ఉమాకాన్తమ్‌గారు జీవించింది కేవలం యాభై మూడు సంవత్సరాలే అయినా తన అమోఘమైన పాండిత్యంతో, అసమానమయిన వాదపటిమతో, అవిచ్ఛిన్నమైన సారస్వత వ్యాసంగంతో తెలుగు సాహిత్య లోకంలో చిరకాలంగా పాతుకుపోయిన విశ్వాసాలను కుదిపివేసిన సాంస్కృతిక విప్లవకారుడు. అంతేకాదు- ‘లోకం వంచితమవుతున్నదని తెలిసినపుడు సత్యప్రకటనం తన ధర్మంగా నిలిచి అధర్మానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన సాహిత్య యోధుడాయన. ఆయన పరిశీలనలూ, నిర్ణయాలూ ఎంతో స్పష్టంగానూ కచ్చితంగానూ ఉంటాయి. నైషధతత్త్వ జిజ్ఞాస అనే తన విమర్శ గ్రంథంలో శ్రీహర్షుని పాండిత్య వైభవాన్ని గుర్తిస్తూనే నైషధం ఉత్తమకావ్యం కాదన్నారు. హర్షుని కాలానికి భారతదేశంలో శాస్త్ర పరిశ్రమ హెచ్చిందనీ, కావ్యగుణం తగ్గిందనీ గుర్తించారు. అది గొప్ప విమర్శనము బయలుదేరిన సమయము. గొప్ప కవిత్వము కుంటుపడిన సమయము అంటూ ఆనాటి సామాజిక సాంస్కృతిక కారణాలను వివరించారు. ఈవిధంగా ఆయన చేసిన నిర్ణయాలూ, వ్యాఖ్యలూ ఈనాటికీ ఎదురులేనివిగానే నిలిచిపోయినయి కాగా, అంతటి గాఢశీల, ప్రతిభావంతుడయిన ఉమాకాన్తంగారిని సమకాలీనంగా తెలుగులో నిర్‌నిరోధంగా సాగుతూ ఉండిన కవితా రీతిని నిశితంగా పరిశీలిస్తున్నపుడు ఉదయించిన అనేక ప్రశ్నలు కలవరపరచినయి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

-కోవెల సంపత్కుమారాచార్య