వినమరుగైన

నేటికాలపు కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు ఈ కవిత్వ స్వభావమేమిటి? ఏనాటికయినా గర్వించదగిన భారతీయ నాగరికతా సంస్కృతుల వారసత్వం మనది. కాని, ఈ మహత్తరమయిన వారసత్వానికి, మన ఈ కవితా ప్రవృత్తి ఎంతవరకు అనుకూలంగా ఉంది? మన నిత్యజీవనంలో జీవిత లక్ష్యంతో ఈ కవితకువున్న సంబంధం ఎట్లాంటిది? జీవితంలోనూ, కవిత్వంలోనూ ఏవిధమయిన విలువలను మనం పాటిస్తున్నాము? భారతీయ సంస్కారానికి దూరమయి, పరాయి సంస్కారంతో సాగుతున్న ఈ కవిత్వంలో మనం అభ్యుదయ దిశగా పురోగమిస్తున్నామా? పతనమవుతున్నామా? ఈవిధమైన వౌలిక ప్రశ్నలు అనేకం ఉమాకాన్తమ్‌గారి మనస్సును గొప్ప సంక్షోభానికి గురిచేసినాయి. ఈ సంక్షోభంతో పరమ వేదన చెందిన ఉమాకాన్తమ్‌గారు సమకాలీన కవిత్వాన్ని నిశితంగా విశే్లషించి గుణదోష విచారణకు పూనుకున్నారు. ఆ పూనిక ఫలితమే నేటి కాలపు కవిత్వం అన్న విమర్శ గ్రంథం. తన విశే్లషణ ఫలితాలను తొలుతగా1926లో ఆనాటి చెన్నపురి ఆంధ్రసభలో ఉపన్యాసాలుగా ప్రకటించారు. అవి అప్పటి ఆంధ్రపత్రికలో వెలువడినాయి. ఆ తరువాత రెండేళ్లకు ఆ వ్యాసాలకు విస్తృతమైన భాష్యపద్ధతిని సంతరించి ఆయన రచించిన నేటి కాలపు కవిత్వం గ్రంథాన్ని 1928లో వావిళ్లవారు ప్రచురించారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

-కోవెల సంపత్కుమారాచార్య