వినమరుగైన

నేటికాలపు కవిత్వం (అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ గ్రంథం వెలువడుతూనే తెలుగు కవితా లోకంలో అసాధారణమయిన సంచలనాన్ని సృష్టించింది. ఆనాటి భావ కవులు భావించిన తీరులో చెపితే ఆ గ్రంథంలో ఉమాకాన్తమ్‌గారు భావకవిత్వాన్ని చీల్చి చెండాడారు.
నవ్యత, భావ ప్రాధాన్యం అనేవి కవిత్వానికి సాధారణ ధర్మాలే తప్ప అంతకుమించిన విశేషమేమీ లేదన్నారు. అందువల్లనే భావ కవిత్వం అనే మాటను అంగీకరించక నేటికాలపు కవిత్వమన్నారాయన. ఆయన తమ విశే్లషణకు స్వీకరించినవి- భారతి మొదలయిన పత్రికల్లో వున్న ప్రణయ పద్యాలు, అనేక పద్యాల సముదాయ రూపకమైన కృష్ణపక్షం వంటి పుస్తకాలు, ఏకాంతసేవ, కావ్య కుసుమావళి, వనకుమారి, లక్ష్మీకాంత తొలకరి, బాపిరాజు తొలకరి, ఎంకి పాటలు, నారాయణమ్మ- నాయుడు బావ పాట, ఎంకయ్య చంద్రమ్మ పాట మొదలైన రచనలు.
వీటిని తన విచారణ పరిధిగా చెప్పినా, వనవాసి వంటికావ్యాలు, సారంగధర, చిత్రనళీయం, పఠాను వంటి నాటకాలు, సుమబాల వంటి పాటలు శృంగారం అనే ప్రణయ పద్యాల సంకలనం, మాతృమందిరం, చెన్నపట్టణం వంటి నవలలు, పరీక్ష- సర్వదర్శి- లోలక్కులు వంటి కథలు కూడా వివిధ సందర్భాల్లో ప్రస్తావించి విశే్లషించటం ఈ గ్రంథంలో కన్పిస్తుంది.
ఇవన్నీ కూడా ఇంచుమించుగా ప్రణయం, శృంగారం చిత్రించే రచనలే. ఈ అన్నింటిలోనూ అయోమయత్వం, పులుముడు, నిదర్శన పరంపరలు, భాషా వ్యతిక్రమం వంటి అనేక లోపాలను లేదా దోషాలను అనేకోదాహరణలతో యుక్తియుక్తంగా ఆయన వివరించారు. చెప్పవలసినదానికంటే హెచ్చుగా కవిగాని, పాత్రలుకాని చెప్పటం విస్తరణ దోషం అంటూ నిర్వచించి కవిత్వంలోకన్నా నాటకాలలో ఈ దోషం ఉందని నిరూపించారు. ప్రకృతి భేదాన్ని అనుసరించి చేష్టా సంభాషణాదులను చిత్రించటం ఔచిత్యమనీ, అట్ల కానిది అనౌచిత్యమనీ వివరిస్తూ ఎంకి పాటలలో ఈ విధమైన అనౌచిత్యం ఉందన్నారు.
ఎంకిపాటలలో ఎంకి- నాయుడుబావల జీవనస్థాయికి, ఆలోచనల -్భవనల స్థాయికి మించిన వారి స్థాయికి అందని అనేక భావాలను, అభివ్యక్తులను చిత్రించటం అనౌచిత్యమని నిరూపించారు.
ఎనక జల్మంలోన ఎవరమోనంటి అనే ఎంకిపాటల్లోని ఒక పాటలోని నిర్మాణ రీతిని, భావనను విశే్లషించారు.

- సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కోవెల సంపత్కుమారాచార్య