వినమరుగైన

నేటికాలపు కవిత్వం (అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల వెల్చేరు నారాయణరావుగారు తమ తెలుగులో కవితా విప్లవాలు గ్రంథంలో అవి జానపద స్థాయికి మించినవని నిరూపించటం, ఎంకిపాటల దుమారంలోనూ ఆ కాలంలో ఈ విషయాలు చర్చకు రావటం గమనిస్తే ఉమాకాన్తమ్‌గారి విశే్లషణ, నిరూపణలోని నిశితత్వం, ఔచిత్యం మనకు మరింత అవగాహనకు వస్తాయి.
అవ్యుత్పత్తి, పూర్వ కావ్యాల అధ్యయనం లేకపోవటంవల్ల కలిగిన అనేక దోషాలను ప్రదర్శించటం అట్లా ఉంచి ఉమాకాన్తమ్‌గారు ప్రధానంగా ప్రణయం, శృంగారం అన్న వాటిని విశే్లషించి అనేక దోషాలను సోదాహరణంగా ప్రదర్శించటం ప్రధానంగా గుర్తించవలసిన అంశం. ఆనాటి అనేక రచనలు ఈనాడు మనకు తెలియకపోవటంవల్లా, కేవలం కొందరి రచనలు మాత్రమే తెలియటంవల్లా ఉమాకాన్తమ్‌గారి విమర్శ కఠినంగా ఉందని అనుకోవచ్చుగాని, ఆయన ఉదహరించిన వాటినే చేసినా వాటిలోని అశ్లీలం, అనౌచిత్మనకు ఈనాటికీ సులభంగానే అవగతమవుతాయి.
శృంగారం మిక్కిలి నిశితమయింది. అది ఏ మాత్రం హద్దుమీరినా క్షోభమే కలుగుతున్నది అని ఆయన అన్న మాటలు యధార్థమని శృంగారం పద్యం సంకలనంలోని అనేక రచనలు నిరూపిస్తున్నవి. ఈ గ్రంథం మొత్తంలో శృంగారాన్ని వివేచించే అధికరణమే అన్ని అధికరణాలు లేదా అధ్యాయాలకన్నా చాలా విస్తృతమయింది. ఆ తరువాత పెద్దది అనౌచిత్యాధికారణం-ఈ రెండూ ఈగ్రంథంలో అత్యంత కీలకమయిన అధికరణాలు.ఈ గ్రంథంలో దోషాలు నిరూపించటంలోని తీవ్రతకు, నిష్ఠూరత్వానికి మనం బిత్తరపోవచ్చు, బాధపడవచ్చు గాని, ఉమాకాన్తమ్‌గారు చేసిన ముఖ్యమైన ఆక్షేపణలకు తగిన సమాధానం ఇంతవరకూ రానేలేదని అనుకోవలసి వస్తోంది అని అబ్బూరి రామకృష్ణారావు గారు అన్నారు. మహాపండితుడైన అక్కిరాజు ఉమాకాన్తమ్ సవాలుకి సాహితీ సమితి విమర్శనాత్మకమైన గ్రంథ రూపంలో జవాబు చెప్పలేకపోయింది అని శ్రీశ్రీ అంగీకరించారు. ఉమాకాన్తమ్‌గారి గ్రంథం ‘అశనిపాతమంతా తీవ్రధాటిలో వచ్చిందంటూనే, ఆయన తీవ్ర విమర్శ నుంచి నావంటివారు నేర్చుకోవలసింది లేకపోనూ లేదు అన్నారు భావకవితకు లేదా ప్రణయ కవితకు ప్రతిరూపకంగా భావింపబడే దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారు. అవును, తెలుసుకోవలసిన అంశాలు ఆ గ్రంథంలో అనేకం ఉన్నాయి.

-కోవెల సంపత్కుమారాచార్య