వినమరుగైన

వేమన ( రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సి.పి.బ్రౌన్, సి.ఆర్.రెడ్డి ఈ ఇద్దరు మహనీయులు తమవైన పద్ధతులలో వేమన కవితను సాహితీ ప్రపంచంలో సుప్రతిష్ఠించారు. సి.పి.బ్రౌన్ వేమన పద్యాలు ఆంగ్లీకరించి, అంతర్జాతీయ పాఠకుల హస్తాలలో ఉంచితే, సి.ఆర్.రెడ్డి వేమనపై తెలుగు ఉపన్యాసాలు ఇప్పించి, ఆ ఉపన్యాసాలు పుస్తకరూపంలో ప్రచురించి సాక్షాత్తు తెలుగువారికి వేమన కవితను ఎలా ఆస్వాదించాలో నేర్పించారు.
సి.ఆర్.రెడ్డి వేమనపై ఉపన్యసించడానికి ఎంపిక చేసిన వ్యక్తి శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు. 1910లో రెడ్డిగారి శిష్యులు శ్రీ కందాళ రఘునాథాచార్యులు రెడ్డిగారికి రాళ్లపల్లిని పరిచయం చేశారు. తొలి పరిచయంలోనే రెడ్డిగారు రాళ్లపల్లి వారి ప్రతిభని గుర్తించారు. ఆ క్షణం నుంచే వారు లోకం గుర్తించని జంట కవులుగా జీవితాంతం భాసించారు. డిగ్రీలు లేని పాండిత్యంబు వనె్నకు రాని రుూ పాడు కాలాన బుట్టిన రాళ్లపల్లివారిని రెడ్డిగారు ఆరు రూపాయల జీతంతో మైసూరు మహారాజావారి కళాశాలలో తెలుగు పండితుడిని చేశారు. ఆపై రెడ్డిగారు ఆంధ్రా యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్‌గా వచ్చారు. 1928 జనవరి 19వ తేదీ గురువారం నాటి ఆంధ్ర పత్రికలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో ఒక ప్రకటన ఇప్పించారు. ఆ ప్రకటన పాఠం ఇది.
ఆంధ్ర విశ్వకళాపరిషత్తు
ఆంధ్రమున ప్రత్యేకోపన్యాసములు
డాక్టర్ సర్ ఆర్.వెంకటరత్నము నాయుడు, యం.ఏ., డి.లిట్ (ఆంధ్ర)గారు ఆంధ్ర విశ్వ కళాపరిషదధికారులకు వేమనను గూర్చి ప్రత్యేకముగా నుపన్యాసము లిప్పించుటకై 250 రూప్యముల విరాళము నొసంగి యున్నారు. అట్టి యుపన్యాసములీయదలచువారు త్వరలో తమ నివేదన పత్రములంపుకొన ప్రార్థితులు. వేమన యొక్క కవిత్వము, తత్త్వవిచారము, సంస్కరణ పరాయణత్వము, ధార్మిక జీవనమున కతడొసగిన చేయూత, స్వదేశ విజ్ఞానమునతడు పెంపొందించిన విధము, కర్ణాటకుడగు సర్వజ్ఞుని తోడను, తమిళడగు తిరువాళువారుతోడను వేమనకుగల పోలికలు, భేదములు- మున్నగు విషయములు సమగ్రముగా చర్చింపబడవలయును. ఈ యుద్యోగమున గుణించిన విశేషాంశము లెఱుంగగోరువారు రిజిస్ట్రారుగారి పేర వ్రాసి తెలుసుకొనవచ్చును.
ఇదీ రాళ్లపల్లివారి వేమన గ్రంథానికి ఉన్న నేపథ్యం. ఉపన్యాసకుడు ఏ అంశాలపై ఉపన్యసించవలసి వుందో స్పష్టంచేయడానికే పై ప్రకటన పాఠం పూర్తిగా పేర్కొనడం జరిగింది. అప్పుడు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు మద్రాసు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ఉన్నారు. ఆయన ఏర్పరచిన ధర్మనిధి పుణ్యమా అని తెలుగు సాహిత్యానికి, సి.ఆర్.రెడ్డిగారి కవిత్వతత్త్వ విచారం తరువాత రెండో విమర్శ గ్రంథం రాళ్లపల్లివారి వేమన వచ్చింది. అయితే ఈ గ్రంథానికి కూడా సూత్రధారి సి.ఆర్.రెడ్డి కావటం ఓ సాహిత్య విశేషం. ఆయన తన ముసలమ్మ మరణం కావ్యంలో వేమనను స్తుతించడం, తరువాత కవిత్వ తత్త్వ విచారంలో వేమనను మహాకవి అని సిద్ధాంత స్థాపనం చేయడంతోనే ఆయనకు వేమన పట్ల ప్రేమ ఆగక, వేమనపై ఒక సద్విమర్శ గ్రంథాన్ని ప్రకటింపించాలని భావించారు. అందుకు సరైన వ్యక్తిని ఆయన రాళ్లపల్లిలో చూశారు. ఉపన్యాసాలకు ఆయనను ఎంపిక చేశారు. ఆ పుస్తకం ఎలా రాయాలో, ఎలా రాయకూడదో మైసూరులో వున్న రాళ్లపల్లికి ఉత్తరాలమీద ఉత్తరాలు రాసి ఎడ్యుకేట్ చేశారు. రాళ్లపల్లి కన్నా ఆయనే ఎక్కువ ఆరాటపడ్డారు. తన సాహితీ గురువులలో ఒకరైన సి.ఆర్.రెడ్డిగారు తనపై ఉంచిన నమ్మకాన్ని రాళ్లపల్లి వమ్ముచేయలేదు.
ఏ ప్రమాణాలు సి.ఆర్.రెడ్డి తన నుండి ఆశించారో ఆ ప్రమాణాలతో రాళ్లపల్లి ఏడు ఉపన్యాసాలు రచించారు. 1928 అక్టోబరు 25వతేదీ నుండి 31 వరకు ఏడు రోజులపాటు ఉపన్యాసాలు అనంతపురం సి.డి. కాలేజీ అనగా- నేటి ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటయ్యాయి. అనంతపురం ప్రజ పులకించిపోయింది.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కొలసాని సాంబశివరావు