వినమరుగైన

వేమన ( రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపన్యాసాలు స్వాతంత్య్రోద్యమం మహాత్మాగాంధీ నాయకత్వంలో ముమ్మరంగా సాగుతున్నకాలంలో వెలువడ్డాయి అన్న సంగతి. అందరి హదృయాల్లో విజృంభిస్తున్న దేశభక్తి భావాలే రాళ్లపల్లి నోట వచ్చాయి. సి.పి.బ్రౌన్ పట్ల గౌరవం ప్రకటిస్తూనే, ముద్రణ విషయంలో మనం సాధించాల్సిన స్వావలంబన గురించి ఆయన ఇక్కడ నొక్కి చెప్పారు. ఈ ఉపన్యాసాలు ఏర్పాటుచేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వారే ఇందుకు పూనుకోవాలని ఆకాంక్షించి, తొలి ఉపన్యాసం ముగించారు.
రెండవ ఉపన్యాసం వేమన కాల దేశములు. ఈ ఉపన్యాసంలో చరిత్ర రచన గూర్చి వాస్తవాలనే సాహ్లాదంగా ప్రసంగించి, వేమనపై వున్న అనేక కట్టుకథలు ఖండించి, కొండవీడు ఆయన నివాసం అన్న బ్రౌన్ అభిప్రాయంతో రచయిత ఏకీభవిస్తాడు. కాలం విషయంలో సుదీర్ఘ చర్చ అనంతరం వేమన అవతారంగా కటార్లపల్లెలో చెలామణి అవుతున్న దొంగ గురువు తుంగవేమన్న కాలం ఆధారంగా వేమనకాలం పద్ధెనిమిదవ శతాబ్దం తొలిపాదం అని నిర్ణయిస్తారు రాళ్లపల్లి.
మూడవ ఉపన్యాసం వేమన సంసార స్థితిగతులు. ఈ ఉపన్యాసంలో వేమన పద్యాలు ఆధారంగా వేమన జీవితాన్ని పునర్నిర్మించారు రచయిత. కారణం, వేమన పద్యాలు వేమన స్వానుభవంతో, ఆవేశంగా, ఎప్పటికప్పుడు చెప్పటం. టూకీగా వేమన జీవితం ఇది. వేమన కలిగిన ఇంట్లోనే పుట్టాడు. శివభక్తుడు. ఏకపత్నీవ్రతం పురుష లక్షణం కాదనుకునే సమాజంలో పుట్టాడు గనుక యవ్వనంలో వేశ్య ఇంట మెట్టాడు. క్రమేపి పశ్చాత్తాపపడి కులసతిని వివాహమాడాడు. ఆమె గయ్యాళితనం అతనికి దుఃఖకారణం అయింది. పిల్లలు కూడా గాలివాళ్లు అయ్యారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించడానికి, స్వర్ణవిద్య నేర్వాలనుకొని ఇల్లొదలి, గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు. వేమన కవితాత్మనీ, ఆయన జీవితాన్నీ అర్థం చేసుకోవడానికి ఈ ఉపన్యాసంలో రాళ్లపల్లి ఒక తాళం చెవి యిచ్చాడు. అది: వేమన సంగీత ప్రియుడు. సంగీతంలో తోడిరాగం ఆయనకు ఇష్టరాగం. ఏదో చాలదనే అసంతృప్తి. జుగుప్స, శక్తి లేకపోవడంతో కలిగే ధైర్యం, అయినా కార్యసాధనకు పట్టుదల, స్వాతంత్య్రరక్తి తోడి రాగ లక్షణాలు. అచ్చంగా వేమనవీ ఇవే లక్షణాలు జీవితంలో, కవిత్వంలో. నాలుగవ ఉపన్యాసము వేమన కాలమందలి మత ధర్మముల స్థితి. ఈ ఉపన్యాసం తొలిపుటలలో వేమన కాలంలో మత ధర్మాల స్థితి వివరించి, వేమన పరిస్థితికి అన్వయిస్తాడు రాళ్లపల్లి. భక్తి వుంటే ముక్తి సులభం అని నమ్మిన వేమన తన చిక్కులు తీర్చమని భగవంతుడిని పదే పదే ప్రార్థించి, తుదకు సిగ్గువిడిచి ఇలా ఏడుస్తాడు.
పలుకుమన్న నేల పలకక యున్నావు?
పలుకు నన్ను జూచి ప్రబలముగను,
పలుకవయ్య నీదు పలుకు నేనెఱిగెద
విశ్వదాభిరామ వినురవేమ

- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కొలసాని సాంబశివరావు