వినమరుగైన

సంపూర్ణం - వేమన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికీ భగవంతుడు కనపడడు. ఈ స్థితిలో వేమనకు రసవాద విద్యాభినివేశంచేత యోగుల సంబంధం కుదిరి వుండవచ్చునంటాడు రాళ్లపల్లి. అయితే వేమన ఏ పని చేసినా తీవ్రంగా చేసే మనిషి కావడం చేత విద్యలకే విద్య బ్రహ్మవిద్య సంపాదించాలనుకుంటాడు.
ఐదవ ఉపన్యాసము వేమన యోగ సిద్ధి చేత మత ప్రచారము లుంబికా శివయోగి గురుత్వంలో వేమనకు యోగసిద్ధి కలిగి, రాజయోగి అవుతాడు. అయితే సిద్ధి బొంది శాంతించే మనిషి కాడు వేమన. తన అనుభూతి ప్రజలకు వివరించడకానికి బయలుదేరతాడు. ఈ ఉపన్యాసంలో క్లుప్తంగానైనా సవివరంగా వేమన రాజయోగం ఎలా సాధించిందీ తన మరపురాని శైలిలో వివరిస్తాడు రాళ్లపల్లి.
ఆరవ ఉపన్యాసము వేమన వంటివారు. దీనిలో రచయిత వేమన కవిత్వాన్ని కన్నడ సర్వజ్ఞమూర్తి ఆరవ తిరువాళ్లువారు, పోతులూరి వీరబ్రహ్మం ఏగంటి, ఆనంద వరద రాజయోగి, ముత్యాల నారసింహయోగి కవిత్వాలతో పోలుస్తాడు.
ఏడవదీ, ఆఖరిదీ అయిన ఉపన్యాసం వేమన కవిత్వము, హాస్యము, నీతులు. ఈ ఉపన్యాసం మిగిలిన ఉపన్యాసాలన్నింటికీ కిరీటప్రాయమైంది. వేమనకు ప్రధానమైంది అంతరంగ శుద్ధే కాని, బాహ్యశుద్ధి కాదు, కవిత్వంలో కూడా ఆయన సిద్ధాంతం అదే. ప్రజలకు కావలసింది బైటకు కనపడేది. వేమన కవిత్వంలో అది ఏది అని ప్రశ్నిస్తారు రాళ్లపల్లి. కాని వేమన కవిత గాలిలా సర్వవ్యాపకం అయిన కవి అని స్థాపించి, కవితానుభూతికి ముఖ్యంగా కావలసింది అహంకార త్యాగం అంటారు. మనం ఎవరిమో మరచిపోతేగాని, మనకు వినబడుతున్న కవితను అనుభవించలేం. వేమన కవిత ప్రధాన లక్షణం భావ తీవ్రత. అయితే అతని కవితకు చాలా బలాన్నిచ్చింది ఆయన హాస్యం అని రాళ్లపల్లి ఈ క్రింద వేమన పద్యాన్ని ఉదాహరించారు.
పాలసాగరమున పవ్వళించినవాడు
గొల్ల యిండ్ల పాలు కోర నేల?
ఎదుటివారి సొమ్ములెల్ల వారికి తీపు
విశ్వదాభిరామ వినురవేమ
ఇది విన్న వాడెంత కృష్ణ్భక్తుడైనను నవ్వక యుండలేడు అంటారు రాళ్లపల్లి. అని వేమన కవితా గుణాలను ఇలా సంక్షిప్తీకరిస్తారు... ఇతని పద్యములందు అనన్య సాధారణమైన సారళ్యము, ధారాళత, చెక్కడపు పని, నిర్లక్ష్యము మొదలగు కవితా గుణములు నిండియుండును. ఇతని ఏ పద్యమును విన్నను నిలిచి తటాలున ఆ ప్రక్క తిరిగి యొకమారైనా చూడకుండుటకు తెలుగు మాటలాడు వానికెవ్వనికిని సాధ్యముగాదు. రుూ యాకర్షణ శక్తి ఇతని యందున్నంత తక్కిన వారెవరియందును గానరాదు.
భరతవాక్యంగా, విశ్వవిద్యాలయాలలో వేమన కవిత పఠనీయాంశం చేయవలసిన ఆవశ్యకతను చెబుతూ, ఆ పని ఆంధ్ర విశ్వవిద్యాలం చేయగలదనే ఆశతో రాళ్లపల్లివారు ఈ వ్యాస పరంపర ముగిస్తారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

కొలసాని సాంబశివరావు