వినమరుగైన

ఆరుయుగాల ఆంధ్రకవిత (ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకనే భాగవత కవితలోని విశిష్టతతో పాటు గోపికలు కృష్ణుని దుడుకుచేష్టలు చెప్పడంలో ఆడవారి చేత అట్టి మగ పనులు చెప్పిండం అనుచితం అనక తప్పదు- ఈ సన్నివేశంలో ఎఱ్ఱన ఇతర చేష్టలను వర్ణించాడు గాని, బాలుని అనుచిత శృంగార చేష్టలను వర్ణించలేదు అని నిర్మొహమాటంగా లోపాన్ని వ్యక్తీకరించారు విశిష్టంగా.
ఇలాంటి సందర్భాలలో కట్టమంచి రామలింగారెడ్డిగారి విమర్శలో వలే నిష్పాక్షికత ఉందిగానీ, వారివలే ఎగతాళి చేసే ధోరణి ఇంద్రగంటివారి గ్రంథంలో కనబడదు. కేవలం కావ్య సమీక్షలను చేయడంలో కొంతవరకు పింగళి లక్ష్మీకాంతం గారి ధోరణి వీరికి ప్రేరణ కావచ్చునేమో గానీ, పింగళివారి రచనలో కంటే గాఢానుభూతి తీవ్రత ఇంద్రగంటివారి రచనలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
మచ్చుకి నన్నయ భారతంలోని లయగ్రాహి వృత్తాల్లో కానవచ్చే వసంత వర్ణనం. ఆ దంపతులు ఇరువురు విహరించిన వసంతోద్యాన శోభా వర్ణనలో నన్నయ మూల శ్లోకార్థము నేమియు తడవక స్వయముగా తుమ్మెదల ఝుంకారములును, కోయిల కూజితములును చెవి సోకునట్టి రెండలయగ్రాహి వృత్తములను వ్రాసెను.. అని పింగళివారు వివరిస్తే ఈ సన్నివేశానే్న ఇంద్రగంటి వారు అప్పుడు వసంతం వచ్చింది. ఊపిరి సలపని ఉత్పాతంలా వనంలోని వోహ పారవశ్యంలా అని మొదలుపెట్టి మూల శ్లోకాలను, లయగ్రాహి వృత్తాలను ఇచ్చి మొదటి పద్యంలో మధుకర సంగీతం, కోకిలాలాపాలు, పుష్ప భారాలు వచ్చాయి. రెండవ పద్యంలో శైత్యమాంద్య సౌరభ్యాలతోకూడిన మందమ మలయానిల ప్రచారం ఉద్దీపించింది. వసంతం అంతా విరబోసుకొని ప్రత్యక్షమయినట్టుంది. ఊపిరాడని ఈ ఉద్దీపంలో పాపం పాండురాజు ఏం చేస్తాడు? ఈ స్ఫూర్తీ, అనుభూతీ, చిక్కదనం ఎక్కడుంది? అంటే - ఎన్నుకున్న లయగ్రాహి వృత్తంలో ఉంది. తీసుకున్న ప్రాసల దూకుడులో, సుకుమారంగా కూర్చిన పదబంధ సాంద్రతలో ఈ ఇంద్రజాలమంతా ఉంది. గొప్ప కవి మాటలతో బంతులాడే అపూర్వ ఇంద్రజాలికుడు అంటే తప్పుతుందా? అని పాఠకులతో తమ అభిప్రాయాన్ని మనసు విప్పిచెబుతున్నట్టుగా ఉంది.
ఇలా కావ్యసమీక్షలు చేస్తూ సందర్భానుసారంగా తెలుగులో మాహత్మ్య కావ్యాలను గూర్చి, ప్రాచీన నవీనాంధ్ర సాహిత్యాలలో రాధనుగూర్చి చిరు చిరు ప్రసంగాలను చేసిన వీరు గ్రంథారంభంలో పూర్వం పురుషార్థ సాఫల్యం అభ్యుదయం.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

రామడుగు వెంకటేశ్వర శర్మ