వినమరుగైన

ఆరుయుగాల ఆంధ్రకవిత (ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఇహలోక సుఖం అభ్యుదయమని ప్రాచీన నవీనాంధ్ర కవులు వాడిన అభ్యుదయ శబ్దానికి విశిష్టంగా అర్థాన్ని విశదీకరించారు. ‘‘నా మేధ శంకర రామానుజులు. నా బోధ వివేకానంద మహాత్ములు, నా గాథ కాళిదాస రవీంద్రులు, నా బాధ హింస రిరంస. ఈ అవగాహన నా సప్త ధాతువులలోను జీర్ణించింది. నేను అంటే నా జాతి. ఈ భావన పాదుకొన్నపుడు నా జాతి హిమశిఖరంలా తలయెత్తుకుని తిరుగుతుంది. తాను తానుగా నిలబడుతుంది. ఈ సులోచనాలతోటే నేను నా వాఙ్మయాన్ని చూస్తాను. లోపాలూ, ప్రతీపాలూ కనబడినపుడు నిష్కారంగా విమర్శిస్తాను. సాధుమార్గంలోకి మళ్లమంటాను అన్న వాక్యాల్లో నిజ హృదయావిష్కరణమూ ఉంది. విమర్శ విషయంలో ఇంద్రగంటివారు యువకులకిచ్చే సందేశమూ ఉంది.
విమర్శలో ఇలా కళాత్మక ధోరణిని, తెనుగుదనాన్ని మక్కువతో వ్యక్తీకరించిన శాస్ర్తీగారూ- తెలుగు సౌందర్యాన్ని పండించిన తాళ్లపాక కవులను గురించి గూడా పేర్కొనివుంటే బాగుండేది.విమర్శలో కళాత్మక ధోరణి వుంటే స్పష్టత కొరవడుతుందని కొందరంటారు గానీ, ఈ గ్రంథాన్ని గూర్చి ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనే బృహద్గ్రంథంలో.. చెప్పవలసింది స్పష్టంగా తెలియడానికీ, అనుభవానికి అందడానికి కళాత్మక ప్రవృత్తిని రచనలో వెలార్చడం దోషమేమీ కాదనీ, ఈ అవసరాన్ని గుర్తించి ఇంద్రగంటివారు నీరసంగా సాగే సాహిత్య చరిత్ర రచనకు సారస్వతాంశను సంవదించారని అన్నారు.
ఇంతకీ కళ ఎరుగని సాహిత్యం ఒక శిల! కళలో కరిగే సాహిత్యం ఒక అమృతపు జల! అన్న ఇంద్రగంటివారి సూక్తికి వారి అన్ని రచనలతోపాటు ఈ గ్రంథాన్ని కూడా ఉదాహరణగా పేర్కొనవచ్చు. రామచంద్రునికి సీత ఎంత ప్రియురాలో, రసజ్ఞునికి మంచి గ్రంథం అంత ప్రియురాలు.
అది పాణిగ్రహణం మొదలు హదృయాన్ని పట్టుకొని వదలదు. అలా హృదయాన్ని పట్టుకొని వీడని గ్రంథం- ఈ ఆరు యుగాల ఆంధ్ర కవిత. ఆధునికాంధ్ర విమర్శ వాఙ్మయ నందనంలో వసవాడని, వాసి వీడని వసంత పారిజాతం- ఈ ఆరు యుగాల ఆంధ్ర కవిత.

సంపూర్ణం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

రామడుగు వెంకటేశ్వర శర్మ