వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో సాహిత్య చరిత్ర రచనా విషయంగా సాగినా కృషి తక్కువేమీ కాదు. పంతొమ్మిదవ శతబ్దం నాలుగవ పాదం ఆరంభంలో అంటే, 1876 గురజాడ శ్రీరామమూర్తిగారు వెలువరించిన కవి జీవితములు అనే గ్రంథం సాహిత్య చరిత్ర రచనా కృషికి బహుశః ఒక శుభారంభం కావచ్చు. ఇరవయ్యో శతాబ్దం మొత్తం ప్రపంచానికి ఒక చివరి హద్దుగా భావిస్తే, ఆనాటి నుంచి ఈ నూట పాతిక సంవత్సరాల కాలంలో ఎంతోమంది మహానుభావులయిన సాహిత్య పరిశోధకులు అనేక గ్రంథాలు రచించారు. కందుకూరి వీరేశలింగం పంతులుగారు, చాగంటి శేషయ్యగారు, వంగూరి సుబ్బారావుగారు, టేకుమళ్ల అచ్యుతరావుగారు కవిత్వ వేది అనే ఉపనామం గల కల్లూరి వెంకట నారాయణరావుగారు, జయంతి రామయ్య పంతులుగారు, భోగరాజు నారాయణమూర్తిగారు బసవరాజు అప్పారావుగారు, బులుసు వెంకట రమణయ్యగారు పింగళి లక్ష్మీకాంతంగారు, ఖండవల్లి లక్ష్మీ రంజనంగారు- ఇట్లా ఎందరెందరో వారికి తోచిన ప్రణాళికలతో సాహిత్య చరిత్ర రచనలు నిర్వహించారు. మరి సాహిత్య చరిత్రలంటూ ప్రత్యేకంగా గ్రంథాలు రచించకున్నా మానవల్లి రామకృష్ణ కవిగారు, వేటూరి ప్రభాకర శాస్ర్తీగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు, చిలుకూరి వీరభద్రరావుగారు, కొమర్రాజు లక్ష్మణరావుగారు మొదలైనవారు తమ పరిశోధనలతో తెలుగు సాహిత్య చరిత్ర రచనా గ్రంథాలన్నీ ఏదో విధంగా అసమగ్రాలు మాతమే. పాక్షిక రచనలు- అంటే, కొంత కొంత సాహిత్యానికి పరిమితమైన చరిత్రలు మాత్రమే. ఉదాహరణకు టేకుమళ్ల అచ్యుతరావుగారి రచన విజయనగర సామ్రాజ్య కాలానికి మాత్రమే పరిమితం. జయంతి రామయ్య పంతులుగారి రచన ఆధునికాంధ్ర వాఙ్మయ వికాస వైఖరి మాత్రమే. మరికొన్ని సంగ్రహ రచనలు కాగా, విపులమైన సమగ్రమైన సాహిత్య చరిత్ర గ్రంథాలు కన్పించవు. ఇది ఒక లోపమే అనుకుంటే, ఈ లోపాన్ని పూరించిన గ్రంథం సమగ్రాంధ్ర సాహిత్యం మాత్రమే. పదమూడు సంపుటాలుగా, ఒక్కొక్క సంపుటం మూడు నుంచి నాలుగు వందల పుటలుగా ఆరుద్రగారు రచించిన సమగ్రాంధ్ర సాహిత్యం పేరుకు తగినట్టుగా సమగ్రమయింది మాత్రమే కాదు, విపులమయింది కూడా. అందుకే ఇరవయ్యో శతాబ్దంలో వెలువడిన సాహిత్య చరిత్ర గ్రంథాల్లో ఒక విలక్షణమైన రచనగా గుర్తింపు పొందింది.
సమగ్రత ఆశయం. దాన్ని సాధించడానికి ఇది ప్రయత్నం అని సవినయంగా ఆరుద్రగారన్నారు. ఆ ఆశయం ఈ రచనలో సఫలమయిందనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. అయితే, ఈ ప్రయత్నం చేసింది ఆరుద్రగారు కావటమే ఆశ్చర్యం. ఆరుద్రగారు తెలుగులో అభ్యుయదయ కవులుగా ప్రసిద్ధులయిన ప్రగతివాద కవులలో ప్రయోగవాదిగా పేరెన్నికగన్న కవి. టెక్నిక్ లేని కవిత్వాన్ని నేను ఊహించలేను అని ప్రకటించిన తీవ్ర ప్రయోగవాది ఆయన. ఆయన తొలికావ్యం అతి జటిలమయిన టెక్నిక్ ప్రయోగించి రచించిన త్వమేవాహమ్. పాఠకుల అవగాహనకు ఒక పరీక్షగా రూపొందిన ఈ కావ్యమే ఒక విలక్షణమైన ప్రయోగవాదిగా ఆయనకు ప్రతిష్ఠను సంపాదించి పెట్టింది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

-కోవెల సంపత్కుమారాచార్య