వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈనాటి భాషలో చెపితే ఇట్లాంటివాటిని ‘తిరుగుబాటులు’ అనో, వేల్చేరు నారాయణరావుగారి మాటను ఉపయోగించుకొంటే, ‘విప్లవాలు’ అనో అనవచ్చు. అట్లాంటి తిరుగుబాటులు, విప్లవాలు ఎంతకాలం వాటి తొలి స్వరూప స్వభావాలతో నిలద్రొక్కుకొని మనగలుగుతాయి.
అవి ప్రధాన స్రవంతిని ఏ విధంగా వీలీనమవుతాయి? అసలు విలీనమవుతాయా? కావా? సాహిత్య చరిత్రలో వాటి పాత్ర ఏమయింది? ఉదాహరణకు తెలుగులో ద్విపద కావ్య రచనా స్రవంతి బయలుదేరింది. అది ప్రధాన స్రవంతిలో ఎట్లా సమన్వయం పొందింది? ఈవిధమైన ప్రశ్నలకు సమాధానాలు సాహిత్య చరిత్రకారుడు వెదుకవలసి ఉంటుంది.్పఅసలు సాహిత్య చరిత్ర ఏ అంశాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని సాగవలసి ఉంటుంది? కవులనా? సాహిత్య ప్రక్రియలనా? కవుల చరిత్రలకూ సాహిత్య చరిత్రకూ వున్న భేదేమిటి? వరసగా కవులనూ, వారి కాలాన్నీ వారి కావ్యాలనూ చెప్పుకుంటూ పోతే ఎంతవరకు సాహిత్యానుస్యూతిని సాధించగలం? కవుల కావ్య దృక్పథాలనూ, జీవన దృక్పథాలనూ సమన్వయించటం ఎట్లా చేయవలసి వుంటుంది? కొందరు కవులు ప్రక్రియా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సశేషం

-కోవెల సంపత్కుమారాచార్య