వినమరుగైన

నగరంలో వాన -కుందుర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోతు వుంది. వైవిధ్యం వస్తురూపాల్లో వుంది. విస్తృతి విషయావగాహనలో, అభివ్యక్త పరిణతిలో వుంది. లోతుభావ సంద్రత- అనుభూతి గాడతలో వుంది. అన్నీ వెరసి అద్భుత భావాత్మక లయ శిల్పంతో తనదైన శైలిలో కొనసాగుతుంది.
వస్తువులో ప్రాకృతిక, వైయుక్తిక, నగర సంక్లిష్టత, ట్రావెలోగ్,ఎలిజీ లాంటివి అనేకం వున్నాయి. రూపంలో మినీ, దీర్ఘ కవితలతోపాటు తాను తిరస్కరించే పద్యాలూ ఉన్నవి. సంభాషణా రీతిలోనివీ వున్నవి. ఆముద్రిత కావ్యం పేరుతో మనిషి జీవితంలోని వివిధ దశలలో కథాకావ్యమూ వుంది. అన్నీకలిసి ఒక విశిష్ట కావ్యం అయింది నగరంలో వాన. వచనకవిత్వం పట్ల కుందుర్తిగారి ప్రమాణాల నిర్వచనాలు, సాధారణీకరణలో ఇమడదు నగరంలో వాన. వాటిని చీల్చుకుని, పెగల్చుకుని, ఎదిగింది ఈ కావ్యం. అభివ్యక్తిలోనూ నిబద్ధతా, నిర్దుష్టతా చట్టాల్ని చేదించుకుని ఎంతగా వ్యాప్తి చెందగలదో తెలియడానికి నగరంలో వాన ఓ ప్రతీక.
ఒక కావ్యాన్ని, కవిని అంచనా వేయడానికి ఆ కాలానికి సంబంధించిన ప్రమాణాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అనంతర వాటితో జోడించి బేరీజువేస్తే అది సరైన విశే్లషణ కాబోదు. ఈ రీత్యా కుందుర్తి నగరంలోవ వాన కావ్యం అప్పటికే 1967లోనే కుందుర్తి ఎంత నవీనుడో తెల్పుతుంది.
కుందుర్తి అన్ని కావ్యాల్లోలాగే ఇందులోని కవితా ఖండికలూ సరళత, స్పష్ట సహజతలకు చిహ్నాలు. మచ్చుకు ఈ కావ్యనామం అయిన కవితా శీర్షికనో తీసుకుందాము. నగరంలో వాన అనగానే మన ముందో దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ప్రాకృతిక సంబంధితవాన, ఆధునికత మరియు సంక్లిష్టతల మేళవింపు నగరం రెండింటి అద్వితీయ సమ్మేళనంతోపాఠకుడని నగరం మధ్య నిలబెట్టి అక్షరాల వానతో పూర్తిగా తడిపేస్తారు. ఇక్కడ కవి సున్నిత, సునిశిత పరిశీలన ద్యోతకమవుతుంది. కవిత అంతా-
అసలు ఆరంభంలోనే-
‘‘నగరంలో వాన
కవిత్వం నా ఊహాంచలాల్లో కదలాడినట్లు
జల్లులు జల్లులై కురుస్తోంది
ఆశుకవితతో నగర ప్రజలకు
ఆశీస్సులు పలుకుతున్నట్లు
......
అనంత ధారా సమేతంగా అంబరం మెరుస్తుంది
నగరంలో వాన
అంబరానికి అంత సంబరమెందుకంటె’’
అని ప్రారంభించి ఒకే వానని పల్లెలూ, పట్నాలూ ఎట్లా స్వీకరిస్తాయో తెల్పుతూ-
‘‘నడి బజారులో పడిపోయిన మూర్ఛవాడు
బిందెలతో దాహం తాగినట్లు
పల్లెల్లో పది దిక్కులైనా లెక్కుండదు
పల్లెసీమలో వానల మేనాల మీద
దివి నుండి సస్య సమృద్ధి దించే వర్షకాండ’’ అని అద్భుతంగా అంటూనే-
‘‘అవసరం లేనపుడడిగితే అప్పులు సుళువుగా లభించినట్లు
అక్కరలేని నగరంలో కూడా పుష్కలంగా కురుస్తుంది’’
అని కొనసాగిస్తూ ఆ సమయంలో సామాన్యుని మదిలో ప్రకంపనలు అపురూపంగా వర్ణిస్తారు. బొమ్మ కట్టిస్తారు. అదే సమయంలో ప్రకృతికీ మానవ ధర్మాలు ఆపాదించి నగరంలో వానకీ ఆర్ద్రత వుందంటూ-
‘‘దానికీ కాస్తో కూస్తో ధర్మం, దయా వున్నాయి
మూడు నాళ్ల పసిపాపను
ముద్దుగా ఒడిలో గుండెల కద్దుకుంటూ
వెచ్చగా ఆసుపత్రి నుండి పచ్చగా ఇంటికి వెళ్ళే
పచ్చి బాలింతరాలిమీద
పూలజల్లు పడుతుంది గాని
బోరున వర్షం కురవదు’’
అంటూ అట్లాగే నాయకుల కొరకు స్కూలు పిల్లల నిరీక్షణ తెలుపుతూ
‘‘రెండు మూడు గంటలసేపు
బారులు తీరి నుంచున్న పసిబాల బాలికల మీద
జాలిగా సన్నని తుప్పర పడుతుంది గాని
జలజలా వర్షం కురవదు’’
అంటారు. అసలు వాన అంటేనే నిర్వచిస్తూ-
‘‘్భమీద పస్తులున్న మనుషుల్ని చూసి
ఆకాశం కంట తడిపెట్టినట్లు’’
అనడంతో అట్టడుగు మనిషిని, ప్రకృతిని ఏ రీతిలో సమన్వయించారో తెలుస్తుంది. వారిపట్ల కుందర్తి ఆర్తికి, భావోద్వేగానికిది పరాకాష్ఠ.
ఆ వర్షం రోజుదయం జల్లులతో ప్రారంభించి ఆకాశంలో సూర్యుని దిశా గమనాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. అందరికీ సుపరిచితమైన ఉపమానాలతో ఇణకా వానలో నగరం ఎలా వుందో చెప్తూ-
‘‘నగరం గడగడ వణికిపోతున్నది
నగరం నడి సముద్రంలో తేలాడుతున్న ద్వీపంలా ఉంది
ఉడు వీధి నుండి జారిన ఒక మంచుకొండ ఏదో పగిలి
శతకోటి శకలాలు జలబిందువులుగా మారి
ముసురుగా ముంచెత్తుతుంటే
గూట్లోకి చేరిన గువ్వలా నగరం నక్కి కూచుంది
......
అంటూనే, వానలో నగరం ఎంతగా అతలాకుతలమయిందీ, వారి మాటల్లోనే-
‘‘కదిలినట్లే కనపడ్డది గాని
అంతా స్తంభించిపోయింది. అరగంట సేపు నిశ్శబ్దం
ఆకాశరాజు చేసిన దాడికి నగరం నలిగిపోయింది’’-
ఆ సమయంలో ఏఏ పనుల్లో వారి స్పందనలెలా ఉంటాయో వర్ణనాత్మకంగా చెప్తూనే
‘‘అంతా స్తంభించిపోయిందనుకున్నాను
అరగంటలో అనంత కోటి దృశ్యాలు’’
అని వాటిని పాఠకునికి దృశ్యమానం గావిస్తాడు.
మనుషుల్లాగే వాన చినుకులన్నీ ఒకటే భౌతికంగా, కాని వారున్న స్థానాల్ని బట్టి విలువా, గౌరవాలన్నట్లు వాన చినుకునీ అది పడిన స్థలం, స్థానం, తీరుని బట్టి వర్ణించడం ఈ కవితను పతాక స్థాయికి తీసుకువెళ్లింది. కావ్యానికి మణిప్రాయమై మకుటమయింది.
‘‘జవరాలు జడలో ముడిచిన
గులాబీ పూవులో బడి రేకలమీద ప్రాకుతూ
వర్షాంతంలో భువికి దిగిన ఒకానొక ముసలి జలబిందువు
కులికింది కోటి జన్మల కోరిక నెరవేరినట్లు
భూగర్భ మురికి కూపంలోకి పోయిందొక జలబిందువు
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-బి.లలితానంద్