వినమరుగైన

తెలుగు జానపద గేయ సాహిత్యం ( బిరుదురాజు రామరాజు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానపదుల హాస్యం నిష్కల్మషమైనది. వరస పాటలు పాడుకోవటం వారికి సరదా. కష్టాల్ని మర్చిపోవటానికి హాయిగా నవ్వుకోవటం వారికి అలవాటు. రామరాజుగారు సీత గడియపాటలో, ఊర్మిళాదేవి నిద్రపాటలో, శ్రీరామ పట్ట్భాషేకము పాటలో ఉత్తమ శ్రేణికి చెందిన హార్యం కనిపిస్తుందని చెప్పారు. లక్ష్మీ పార్వతుల సంవాదం అనే పాటలో చక్కని హాస్యం ఉందని వివరిస్తూ-
లక్ష్మి:గౌరీదేవి నీ శంభుని గళమున నలుపేమిటి ఓయమ్మా నలుపేమిటి ఓయమ్మా
పార్వతి:నారీమణి నీ విష్ణుదేవుడు నలుపుగాడటే కొమ్మా- నలుపుగాడటే కొమ్మ
లక్ష్మి:బిరుదులేక నీ కాంతుడు జగములో భిక్షమెత్తుటేమమ్మా- భిక్షమెత్తుటేమమ్మ
పార్వతి: బలము లేకను బలి చక్రవర్తిని అడుగలేదటే కొమ్మా- అడుగలేదటే కొమ్మ- అని సాగినట్లు చెప్పారు.
ఉక్తిప్రత్యుక్తులతో కూడిన లక్ష్మీపార్వతుల సంవాదం జానపద గేయ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. జానపద గేయాల్లోకనిపించే హాస్యం మన జాతీయ హాస్యమని, జానపదుల్లో సున్నితమైన హాస్యంతోపాటు హాస్యం కూడా ఉంటుందని రామరాజుగారు తెలిపారు. జానపదుల హాస్యం వారి జీవితాలను సుఖమయం చేస్తుందనటం వాస్తవం.
వివిధ రీతుల్లోని జానపద గేయాలను వివరించిన రామరాజుగారు జానపద గేయాల్లోని భాషారీతుల్ని కూడా పరిశీలించారు. జానపదగేయాల్లో పదసారళ్యం, నిరలంకారత, సౌకుమార్యం, రామణీయకం ఉంటుందని తెలిపారు.
జానపదుల వ్యావహారిక భాషలో చేరిన అన్యదేశ్య పదాలైన వజీర్, ముస్తాబ్, ఫకీర్, డేరా, ఖాయదా, ఫిర్యాదు, రసీదు, రవాణా మొదలైన పదాల్ని గూర్చి వివరించారు. పరభాషా పదాలు మన భాషను పాడుచేశాయనటం కంటే, సహృదయతతో, వాటివల్ల భాషకు కలిగిన మేలును లెక్కించటం మంచిదని రామరాజుగారు హితవు పలికారు.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

గుమ్మా సాంబశివరావు