వినమరుగైన

అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం ( శ్రీపాద గోపాల కృష్ణమూర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలాన్ని కత్తిరించుకుంటే చరిత్ర కాంచనమై గుబాళిస్తుంది. కత్తిరించడమే తెలియాలి. కాలాన్ని శతాబ్దాలుగా కాకుండా అర్ధశతాబ్దంగా కూడా తీసుకుని ఏదైనా చరిత్రని రాసుకోవచ్చు. అర్ధశతాబ్దం ఎక్కడ్నించి ఎక్కడిదాకా? అదీ తెలుసుకోవాలి!
అసలు రాయదలిచింది ఏ చరిత్రని? ఇది మరో ప్రశ్న. ఇంతెందుకు? రాయదలిచింది సాహిత్య చరిత్ర. దీని పరిధి ఏభయ్యేళ్ళు. అదే 1910 నుంచి 1960 దాకా, కత్తిరింపు పూర్తయింది. వస్తువు స్పష్టంగా తెలిసింది. ఆ కాలంలో ఈ వస్తువుని ఇమిడించి నేర్పుతో చరిత్రను చెప్పుకుపోవాలి. ఈ గారడీ అల్లాటప్ప ఏం కాదు! తీసుకున్న సమయ వలయంలో రాసేసిన కవిత్వాలన్నీ చదివేసి, మంచీ చెడూ జల్లించుకుని, శక్తీ యుక్తీ మేళవించుకుని, ఏదో పాఠం పూర్తిచేసినట్లుగానో ఆషామాషీగానో కాకుండా శాస్త్రంలాగానూ కళాఖండంగానూ కూడా రాయడానికి అందరూ సిద్ధంగా ఉండరు. అది శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారి కొక్కరికే చేతనయింది.
కృష్ణశ్రీ డా శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో ప్రిన్సిపాలుగా పనిచేశారు. ఫిజిక్సు లెక్చరర్ శ్రీపాద కామేశ్వరరావు గారి తనయులు, తండ్రి కన్యాశుల్కం సమీక్షతో సుప్రసిద్ధులు. వీరి సోదరులే సంగీత విద్వాంసులు శ్రీపాద పినాకపాణిగారు. జానపద గేయాల సేకరణలో కృష్ణశ్రీగా మూర్తిగారు ప్రసిద్ధులు.
ఆయనెవరూ? సాహిత్య గతి చరిత్ర రాయడాని కెందుకువ్విళ్వూరారు? అదే చిత్రం. ఒక సైన్సు పాఠం చెప్పేవాడు సాహిత్య పాఠం చెప్పేవాడుగా మారితే, చిత్రంగాక మరేమిటి? చిత్రమనను, అద్భుతమంటున్నాను.
విజ్ఞాన ప్రపంచంలోంచి వచ్చినాయన అభిరుచి మహిమవల్ల సాహిత్య జగత్తులో కొదిగిపోయారన్నమాట. ఫలితంగా ఒక చెట్టు పూలు పూసినంత సహజ సుందరంగా అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం వ్యాస పరంపర రూపంలో రాయడం పూర్తిచేశారు. ఆయన ఓ పందొమ్మిది వ్యాసాల్లో ఈ అద్భుతాన్ని సాధించారని గుర్తించి అచ్చేసిన గ్రంథం మన చేతిలో వుంది. అసలు ఈ వ్యాసాలన్నీ ప్రధానంగా భారతిలో వచ్చాయి. 1963, 64ల్లో పత్రికా ముఖంగా వస్తున్న ఈ వ్యాసాలు కాలాన్ని గుబాళింపజేశాయి. ఇరవయ్యో శతాబ్దం ముగిసిపోతుందేమోనన్న సందేహ సంధ్యలో 1994లో ఇవి పుస్తకంగా అచ్చయ్యాయి. అప్పటికే శ్రీపాద గోపాలకృష్ణమూర్తి అస్తమించారు. ఆయన మహత్తర సేవని మనం అప్పుడు మరీ గుర్తించాం.
ఆయనింక శ్రీ పా.గో.మూర్తిగారందాం అచ్చంగా. అసలీ ప్రయత్న శ్రీకారాన్నాయన 1947 ఉగాది పండక్కే చుట్టుకున్నారు. ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో నవ్య సాహిత్య సింహావలోకనం చేస్తూ కొత్తదనమేదయినా ఒక వ్యక్తి ద్వారా రాదన్నారు.
ఒక్క ఉదయం ఊడిపడదన్నారు. వ్యక్తులు, ఉద్యమాల్ని నడిపినట్లే ఉద్యమాలు వ్యక్తుల్ని నడుపుతాయని గ్రహించారు. వ్యక్తీ సంఘమూ / కవీ సాహిత్యమూగా మారతాయనీ ఊహించారు. ఈ చూపుడు వేలితోనే ఆయన సాహిత్య చరిత్రను చూపించారు.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

మిరియాల రామకృష్ణ