వినమరుగైన

అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం ( శ్రీపాద గోపాల కృష్ణమూర్తి )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1947 నాటికే భావకవిత్వం తప్పయిపోయింది. అభ్యుదయ కవిత్వం నీడలే అంతటాను. అక్కడిదాకా టూకీగా చెప్పుకుంటూ పోయి, నిలబడిపోతూ కళలైనా కవిత్వమైనా ప్రచారం కోసమా? పాఠకుల్ని పట్టుకుని దారిచూపడానికా? అని ప్రశ్నించి వదిలేశారు. భావకవుల్లోని గూఢతనీ అభ్యుదయ కవుల్లోని వాచ్యతనీ ప్రశ్నించారు. ఇలా సూత్రీకరించారు చివరికి. కళలేని శుష్క ప్రచారంకంటే ప్రబోధములేని కళ ఉత్తమము. అయితే కళారీతుల్ని అభ్యుదయాకాంక్ష.. నడపాలన్నారు (211 పే)
1910 నాటి నవ్యతావతారానికి ముందు రంగాన్ని కూడా గురజాడే తీర్చిదిద్దారనీ, అందుకు కన్యాశుల్కమే ఒరవడి అయిందనీ శ్రీ పా.గో.మూర్తి నిరూపించారు.
ఈవేళ మనం సాహిత్య రంగంలో సంప్రదాయం, తిరుగుబాటు, ప్రయోగం, ప్రయోజనం వంటి మాటలు తరచుగా వాడుతున్నాం. ఈ పదాలకు సంబంధం, సంఘర్షణ ఉందని గ్రహించితే కానీ సాహిత్య చరిత్ర పాకంలో పడదు. ప్రయోగం స్థిరపడిపోతే తిరిగి సంప్రదాయమవుతుంది. తిరుగుబాటు ప్రయోజనం లేందే వుత్తి పుణ్యాన జరగదు.
శ్రీ పా.గో.మూర్తిగారి 1948 నాటి కొడాలి వారి కవిత్వం అనే వ్యాసం కవిత్వంలో దేశభక్తి ప్రయోగం ఎలా సంప్రదాయంగా స్థిరపడిపోయిందో నిరూపించి, పఠాభిమీద రాసిన మరో వ్యాసంలో సంప్రదాయంమీద తిరుగుబాటు అంటే ఏమిటో నిక్కచ్చిగా నిదర్శనాలతో పరామర్శించారు.
కవిత్వంలో నా ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో పద్యాల నడుముల్‌విరగదంతాను, బాలవ్యాకరణాన్ని దండిస్తాను, నా యిష్టం వచ్చినట్లు చేస్తాను, నవీన పంథా అనుసరిస్తాను అంటూ దండయాత్రనే మొదలెట్టారు పఠాభి. ఈ ప్రతిజ్ఞలనన్నింటినీ అతడెలా నిజం చేసుకున్నాడో చెబుతూ ఈయన ప్రయత్నమంతా సంప్రదాయాలమీద విరగబాటుకోసమే అని నిశ్చయించాలన్నారు. పఠాభిలో ఒక కట్టుబాటు కూడా ఉన్నట్లు గమనించారు కూడా. అయితే అదేమిటంటే నాగరీకదృష్టి అని నిర్దేశించారు.
పఠాభికన్నా ముందు సంప్రదాయలమీద తిరుగుబాట్లు చేసిన వారినిద్దరినే శ్రీపాద గుర్తించారు. అందులో ప్రాతఃస్మరణీయుడు గురజాడే! రెండోవారు కృష్ణశాస్ర్తీ. అయితే మనకో సందేహం కలుగుతుంది. శ్రీశ్రీ తిరుగుబాటుదారు కూడా అని! తొలి రోజుల్లో సంప్రదాయాల్ని మన్నించి నియమాల్తో రచిస్తూనే క్రమంగా మారి తిరుగుబాటు చేశాడు (172 పే.) అన్నారు శ్రీపాద.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

మిరియాల రామకృష్ణ